Saturday, 23 May 2026

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 మహర్షి : ఏకాంత స్థలంలో పాటించే మౌనము బలవంతపు మౌనము. సమాజం మధ్యలో ఉన్నప్పుడు కూడా నిగ్రహయుతమైనట్టి వాక్కు మౌనముతో సమానమే. అప్పుడు మనిషి తన మాటను అదుపులో ఉంచుకుంటాడు. అసలు వచించే వాడు ఉంటేనేగదా వాక్కు ఉండగలదు ?_*
*_◆ మాట్లాడేవాడి మనస్సు వేరేపనిలో నిమగ్నమైవుంటే, మాట నిగ్రహించబడుతుంది. మనస్సు అంతర్ముఖమైనప్పుడు ఇలా అది మరొక పనిలో పాల్గొంటూ ఉంటుంది గనుక దానికి మాట్లాడాలన్న తొందర ఉండదు._* 
*_◆ మౌనదీక్ష పాటించడంలోని ఉద్దేశ్యం వాక్కువల్ల ప్రేరేపించబడే మానసిక కార్యకలాపాలను పరిమితం చెయ్యడమే. కాని మనస్సే నిగ్రహించ బడినప్పుడు మౌనదీక్ష అవసరం ఉండదు. మౌనమే సహజమవుతుంది !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

No comments:

Post a Comment