🌍🍃🌍🍃🌍🍃🌍🍃🌍🍃🌍
*🌾🌹పితృ దేవతా🌾🌹 జ్ఞానం*
*🌾🌹దీనిని పూర్తిగా చదవగలిగితే మీకు పితృదేవతల అనుగ్రహం ఉన్నట్టే.*
🌾🌾🌾🌾
*🌹మాసికాల రహస్యం ఇదే*!
*మాసికాలు ఎందుకు పెట్టాలి?*
*అన్ని మాసికాలు పెట్టాలా?*
*కొన్నిమానేయవచ్చా?*
🌾🌾🌾🌾🌾
*🌹🌾వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే*
*🌹🚩🌾చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ* *సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.*
*దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది.*
*🌹🌾అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*
*🌾కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.*
*🚩🌹చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు?*
*🚩🌾మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి?*
*🌈🌹దేవతగా ప్రేత ఎలా మారుతుంది?*
*🌹పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి*?
*🚩అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.*
*🌾వీటికి సమాధానం ఒక* *ఉపనిషత్తు చెబుతోంది.*
*ఆ ఉపనిషత్తు పేరు* *పిండోపనిషత్తు*.
*🌈🌾ఇది అథర్వణ వేదశాఖకు చెందినది.*
*ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది*.
*🌾ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది*.
*🚩దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు*.
*🌎బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు*.
*🌹🌾మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?*
*అనే ప్రశ్నలు వేశారు.*
*🌈🌾దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు*.
*🌈మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.*
*🌈ఈ శరీరం*
*భూమి,*
*నిప్పు,*
*నీరు,*
*గాలి,*
*ఆకాశం*
*అనే మహాభూతాలతో ఏర్పడింది*.
*🌹ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి.*
ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.
*🌹ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం).*
*దాని వలన పంచప్రాణాలు పోతాయి.*
*🌹గాలి తరువాత అగ్ని పోతుంది.*
*శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది.*
*🌈తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది.*
*🌹🌾ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి.*
*🌈ఇవి భూమిలో కలిసిపోతాయి.*
*🌹శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది.*
*క్లుప్తంగా జరిగేది ఇదే.*
*🌏ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.*
*🌹నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ*
*కారణ శరీరం,*
*యాతనా శరీరం*
*అని ఉంటాయి*
*👉🏾🌈కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం.*
*తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది.*
*అదే నూతన శరీరం పొందుతుంది.*
*🇮🇳🍃యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది.*
*ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*
*🌈ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు, చుట్టూ తిరుగుతూ ఉంటుంది.*
*ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*
*🌹దీని తరువాత పదోరోజున*
*సపిండులు,*
*సగోత్రీకులు,*
*బంధువులు,*
*స్నేహితులు*
*వచ్చి, వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి.*
*వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.*
*💥🇮🇳అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.*
*పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ, ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది*.*
*🌈సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో,*
*తన తండ్రి తాత ముత్తాతల్లో,*
*ముత్తాతను ముందు జరిపి,*
*ఆయన ఖాళీలో తాతను,*
*తాత స్థానంలో తండ్రిని,*
*తండ్రి స్థానంలో తాను*
*చేరుకుంటుంది.*
*పితృదేవతాస్థానం పొందుతుంది.*
*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది.*
*🌺నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*
*🌹వీటిలో మొదటి పిండం ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది.*
*దీన్నే కలనం అన్నాడు.*
*దీని తరువాత మాంసం, చర్మం, రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*
*మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).*
*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*
🌈*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.*
*🌺ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు ఏర్పడతాయి.*
*🌹ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.**
*🌈ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*
*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.*
*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*
*🌹ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన, పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం, పిండాల వలన కలుగుతుంది.*
*🌺ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి, వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.*
*🍃నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*
*🌈వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది.*
*🌹మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*
*🌈అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*
*🌹ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది.*
*ఆ తరువాత*
*అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*
*🌈కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే.*
*మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*
🌹*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైకల్యం కలుగుతుంది.*
*🌹మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము.*
*మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*
*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది.*
*సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.*
*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*
*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*
*ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు*.
*ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి*.
*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన*
*కురుక్షేత్రం,*
*ప్రయాగ,*
*కాశీ,*
*గయా,(*
*వంటి వాటిలో చేయాలి.*
*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము.*
*దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది.*
*వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.*
*🌹🌾పిండాలు ప్రేతాలకు వెళతాయా?*
*అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు*🌈.*
*🌈🌹నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు.*
*అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.*
*🌈అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు*.
*🌈వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు*.
*🌎గయలో ఎందుకు చేయాలి?*
*ప్రయాగలో ఎందుకు చేయాలి?*
*అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు*.
*🌈పుణ్యక్షేత్రాలుగా* *చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు.*
*ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.*
*ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.*
*వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.*
*వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు*.
*ఉదాహరణకు* *మాఘపౌర్ణమి చాలా మంచిది.*
*దాన్ని మాఘపౌర్ణమి,* *మహామాఘి అంటారు*.
*ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి.*
*🌹ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం*.
*🌈ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని, ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.*
*🌈ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.*