Saturday, 23 May 2026

 ప్రపంచంలో ప్రేమకు చాలా నిర్వచనాలు ఉన్నాయి…  
కానీ కన్న కూతురిపై తండ్రి ప్రేమకు మాటలు సరిపోవు.  

రోజూ చిన్న చిన్న విషయాలకే కోప్పడే తండ్రి,  
ఆ కోపం వెనుక దాగి ఉన్న ప్రేమ  
పెళ్లి రోజు కట్టలు తెంచుకుని కన్నీళ్లుగా బయటపడుతుంది.  

నిన్నటిదాకా చేతి పట్టుకుని నడిపిన కూతురు కోసం,  
ఈ రోజు పరిచయం లేని చిన్న వయసు అల్లుడి కాళ్లు పట్టుకుంటాడు తండ్రి.  

మనతో సమాన వయసున్న వియ్యంకుడి ముందు కూడా,  
తన పరువు, ప్రతిష్ట, గౌరవం అన్నీ పక్కన పెట్టి  చేతులు పట్టుకుని బ్రతిమలాడతాడు కాళ్లు పట్టుకుని మరియు వేడుకుంటాడు
“నా బిడ్డను చక్కగా చూసుకోండి” అని వేడుకుంటాడు.  

ప్రతి మనిషికి గౌరవం ఉంటుంది…  
పౌరుషం ఉంటుంది…  
ఆత్మాభిమానం ఉంటుంది…  
కానీ కూతురు సుఖం ముందు అవన్నీ మౌనమవుతాయి.  

ముక్కు ముఖం తెలియని వాళ్ల కాళ్లపై పడటం  
బలహీనత కాదు…  
తండ్రి ప్రేమ యొక్క అత్యున్నత రూపం.  

కూతురు పెళ్లి అంటే ఆభరణాలు కాదు…  
అప్పగింత.  
ప్రాణం పెట్టి పెంచిన జీవితాన్ని  
విశ్వాసంతో ఇంకో ఇంటికి అప్పగించటం.  

కాళ్లు పట్టుకున్నది ఆడబిడ్డ తండ్రి కాదు…  
ఆ తండ్రి గుండె.
ఎంతైనా మగపిల్ల తల్లిదండ్రులు అదృష్టవంతులు ఆడపిల్ల కోడలు రూపంలో వాళ్లకి జీవితాంతం సేవలు చేయటానికి మంచి చెడులు చూడటానికి మరియు బాధ్యతలు నిర్వర్తించటానికి వాళ్ల సంతాన అభివృద్ధి కోసం వాళ్లతోనే 80 సంవత్సరాలు ఉంటుంది వాటితో పాటు కట్నాలు కానుకలు ఇవన్నీ సాంప్రదాయంగా వచ్చేవైనా తీసుకొస్తూనే మంచిగా ఉంటూనే ఉంటుంది అదే కన్న తల్లిదండ్రుల దగ్గర మాత్రం కేవలం పెళ్లయ్యే వరకు సుమారు 20 సంవత్సరాలు ఉంటుంది అబ్బా ఎంత అదృష్టవంతులు అండి మగపిల్లల కనుగొన్న వాళ్లు అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది దయచేసి మరోలా అనుకోకండి ఇది మనసులో నుంచి వస్తున్న మాటలు కేవలం అభిప్రాయం మాత్రమే ఎవర్ని ఉద్దేశించి కాదు ఇంకోలాగా కాదు ఈ వీడియో చూడంగానే ఇలా స్పందించాలని   అంతే దయచేసి మరోలా అనుకోవద్దు  🙏🏻
సుధీర్

No comments:

Post a Comment