🍀🌺🍀🌺🍀🕉️🍀🌺https://chat.whatsapp.com/HHchc4jJoPl4UlWJlrNlmg?mode=gi_t
*శ్రీరామాయణం*
➖➖➖✍️
(108 ప్రశ్నలు –జవాబులతో)
*రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..
1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
👉= వాల్మీకి.
2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
👉= నారదుడు.
3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
👉= తమసా నది.
4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
👉=24,000.
5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
👉=కుశలవులు.
6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
👉=సరయూ నది.
7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
👉=కోసల రాజ్యం.
8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
👉=సుమంత్రుడు.
9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
👉=కౌసల్య, సుమిత్ర, కైకేయి.
10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
👉=పుత్రకామేష్ఠి.
11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
👉= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.
12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?
👉=జాంబవంతుడు.
13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
👉= దేవేంద్రుడు.
14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
👉=హనుమంతుడు.
15. కౌసల్య కుమారుని పేరేమిటి?
👉=శ్రీరాముడు.
16. భరతుని తల్లి పేరేమిటి?
👉=కైకేయి.
17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
👉=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.
18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
👉=వసిష్ఠుడు.
19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
👉=16 సంవత్సరములు.
20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
👉=మారీచ, సుబాహులు.
21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
👉=బల-అతిబల.
22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
👉=సిద్ధాశ్రమం.
23. తాటక భర్త పేరేమిటి?
👉=సుందుడు.
24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
👉=అగస్త్యుడు.
25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
👉=భగీరథుడు.
26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
👉=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.
27. అహల్య భర్త ఎవరు?
👉=గౌతమ మహర్షి.
28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
👉=శతానందుడు.
29. సీత ఎవరికి జన్మించెను?
👉=నాగటి చాలున జనకునికి దొరికెను.
30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
👉=దేవరాతుడు.
31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
👉=విశ్వకర్మ.
32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
👉=మాండవి, శృతకీర్తి.
33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
👉=జనకుడు.
34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
👉=కుశధ్వజుడు.
35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
👉=వైష్ణవ ధనుస్సు.
36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
👉=యుధాజిత్తు.
37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
👉=మంధర.
38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
👉=గిరివ్రజపురం, మేనమామ యింట.
39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
👉=శృంగిబేరపురం.
40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
👉=గారచెట్టు.
41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
👉=భారద్వాజ ముని.
42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
👉=మాల్యవతీ.
43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
👉=తైలద్రోణములో.
44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
👉=జాబాలి.
45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
👉=నందిగ్రామము.
46. అత్రిమహాముని భార్య ఎవరు?
👉=అనసూయ.
47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
👉=విరాధుడు.
48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
👉=అగస్త్యుడు.
49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
👉=గోదావరి.
50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
👉=శూర్ఫణఖ.
51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
👉=జనస్థానము.
52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
👉=మారీచుడు.
53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
👉=బంగారులేడి.`
54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
👉=జటాయువు.
55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
👉=దక్షిణపు దిక్కు.
56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
👉=కబంధుని.
57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
👉=మతంగ వనం, పంపానదీ.
58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
👉=ఋష్యమూక పర్వతం.
59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
👉=హనుమంతుడు.
60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
👉=అగ్ని సాక్షిగా.
61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
👉=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.
62. సుగ్రీవుని భార్య పేరు?
👉=రుమ.
63. వాలి భార్యపేరు?
👉=తార.
64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
👉=కిష్కింధ.
65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
👉=మాయావి.
66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
👉=దుందుభి.
67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
👉=మతంగముని.
68. వాలి కుమారుని పేరేమిటి?
👉=అంగదుడు.
69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
👉=ఏడు.
70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
👉=ప్రసవణగిరి.
71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
👉=వినతుడు.
72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ’దక్షిణ’ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
👉=అంగదుడు.
73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం ‘పశ్చిమ’ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
👉=మామగారు, తార తండ్రి.
74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ‘ఉత్తర’ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
👉=శతబలుడు.
75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
👉=మాసం (ఒక నెల).
76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
👉=దక్షిణ దిక్కు.
77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
👉=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.
78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
👉=స్వయంప్రభ.
79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
👉=సంపాతి.
80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
👉=పుంజికస్థల.
81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
👉=మహేంద్రపర్వతము.
82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
👉=మైనాకుడు.
83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
👉=సురస.
84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
👉=సింహిక.
85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
👉=నూరు యోజనములు.
86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
👉=లంబ పర్వతం.
87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
👉=అశోక వనం.
88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
👉=పన్నెండు
89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
👉=త్రిజట.
90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
👉=రామ కథ.
91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
👉=చూడామణి.
92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
👉=ఎనభై వేలమంది.
93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
👉=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.
94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
👉=విభీషణుడు.
95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
👉=మధువనం.
96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
👉=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.
97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
👉=ఆలింగన సౌభాగ్యం.
98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
👉=నలుడు
99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
👉=నికుంభిల.
100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
👉=అగస్త్యుడు.
101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
👉=ఇంద్రుడు.
102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
👉=మాతలి.
103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
👉=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
👉=హనుమంతుడు.
105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
👉=శత్రుంజయం.
106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
👉=స్వయంగా తన భవనమునే యిచ్చెను.
107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
👉=బ్రహ్మ.
108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
👉= తన మెడలోని ముత్యాలహారం.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
.🙏
No comments:
Post a Comment