Saturday, 23 May 2026

 [5/1, 11:16] +91 99597 98384: *_🦚  శ్రీరమణమహర్షి  🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 మహర్షి : మౌనం అనేది ఒక ఎడతెగని మాటల ప్రవాహం. మాటలు దానికి అడ్డు కట్టలు. వాక్కులు ఆ మౌనభాషకు అవాంతరాలు కల్పిస్తాయి._*
*_తీగలో విద్యుచ్ఛక్తి ప్రసారమౌతున్నది. ఆ ప్రసారం ఆపితే ఒక బల్బును వెలిగించేదిగానో, ఫ్యాన్ ను కదలించేదిగానో మారుతుంది. అలాగే మౌనం అడ్డేలేని భాషాస్రవంతి. మాటలు దానికి ఆనకట్టలు._*
*_ఏండ్ల తరబడి వాదాలలో తెలియని భావం.... మౌనంలోనో, వారి నల్వురు (సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు) శిష్యులకు శ్రీదక్షిణామూర్తి ప్రసాదించిన మౌనసన్నిధిలోనో ఒక్క క్షణంలో అర్థమవుతుంది. మౌనం అత్యుత్తమమూ, శక్తివంతమూ అయిన భాష !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍
[5/1, 11:17] +91 99597 98384: *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏻 భక్తుడు : మెలకువగా ఉన్నప్పుడు కంటె, సుషుప్తిలో శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటామా ?_*
*_🦚 మహర్షి : సుషుప్తి, స్వప్నం, మెలకువ - ఇవన్నీ ఆత్మపై ఏర్పడే తాత్కాలిక స్థితులు. ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఆత్మ కేవలం ఎరుకే. ఆత్మనుంచి ఎవరైనా, ఎప్పుడైనా వేరవగలరా ? అది సాధ్యమైతేనే, ఈ ప్రశ్న ఉదయిస్తుంది !_*
*_🧘🏻 భక్తుడు : అయినా, సుషుప్తిలో మెలకువలో కంటె శుద్ధ చైతన్యానికి ఇంకా చేరువగా ఉంటామంటారే ?_*
*_🦚 మహర్షి : “సుషుప్తిలో, మెలకువలో కంటె నాకునేను దగ్గరగా ఉంటానా ?”అని అడిగినట్టే ఉంది ఈ ప్రశ్న._*
*_ఆత్మే శుద్ధ చైతన్యం. ఎవ్వరూ ఆత్మకి దూరం కాలేరు._ _ద్వయీభావముంటేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. శుద్ధ చైతన్య స్థితిలో ద్వంద్వమంటూ ఏమీ లేదు._*
*_నిద్రపోయినా, కలకనినా, మేల్కొన్నా- ఒక్క మనిషే, మెలకువ స్థితే ఎంతో అందంగానూ ఆసక్తి_*
*_దాయకంగానూ ఉందను కుంటారు. అటువంటి అనుభూతి ఏమీ లేకపోవటం వల్ల సుషుప్తి అవస్థ ఏమీ ఆసక్తి దాయకంగా ఉండదంటారు._*
*_ఇక్కడ ఆగి, ముందుకుపోయే ముందు, ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందాం. సుషుప్తి అవస్థలో నీవున్నావని ఒప్పుకుంటావా లేదా ?_*
*_🧘🏻 భక్తుడు : ఒప్పుకుంటాను._*
*_🦚 మహర్షి : ఇప్పుడు మేల్కొని ఉన్నదీ నీవే కదా._*
*_🧘🏻 భక్తుడు : అవును._*
*_🦚 మహర్షి : అంటే, సుషుప్తీ, మెలకువా అవిచ్ఛినంగా కొనసాగుతున్నట్టే కదా. ఆ అవిచ్ఛిన్నత ఏమిటి ? ఆ స్థితి, స్వచ్ఛమైన ఉనికే. అయినా, రెండు స్థితులకీ భేదముంది. ఆ భేదమేమిటి ? శరీరమూ, ప్రపంచమూ, వస్తుజాలమూ మెలకువలో ఉంటాయి. కాని సుషుప్తిలో మాయమవుతాయి !!_*
*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_* 
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

No comments:

Post a Comment