🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
*#ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటము......!!*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శ్రీరామ పట్టాభిషేకం మూర్తి లేని ఇల్లు ఉండకూడదు.
#ఉండి తీరాలి.
ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు.
#కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం.
#పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు –
సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ.
#రాముడు అకారానికి ప్రతినిధి,
యో వేదాదౌ స్వరఃప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!.
అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ.
’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ.
#అకార ఉకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది. #ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా? వీళ్ళు చేయవచ్చా? అని అభ్యంతరం ఉండదు. #కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది.
#రాముడికి ఒక్కడికే రెండు పేర్లు ఉంటాయి. వీర రాఘవ, విజయ రాఘవ.
#ఆయన ఎప్పుడూ కోదండం చేత్తో పట్టుకుంటాడు. #అపజయం అన్నది రాముడికి లేదు.
రాముడు ఆర్తత్రాణపరాయణుడు.
అటువంటి రాముడు ఇంట్లో ఉంటే…
అన్నిటా విజయమే..!✍️
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
No comments:
Post a Comment