*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼♂️ ఒక భక్తుడు : భగవాన్ ! నా మనసు నేను చెప్పినట్లు వినక, దాని ఇష్టం వచ్చినట్లు విహారం చేస్తుంది. అందువలన నాకు అశాంతి కలుగుతున్నది. మనసును నా స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఏమైనా మార్గం ఉన్నదా ? ఉంటే దయచేసి మార్గం చూపగలరు !_*
*_🦚 మహర్షి : జీవితంలో ఆధ్యాత్మిక సాధన చేసేవారు, వారు చేసే ప్రయత్నం అంతా మనసుని అరికట్టడానికే. జ్ఞాన, భక్తి, కర్మ మార్గాలు అన్నీ మనసును కట్టడి చేయడానికి సహాయం చేస్తాయి._*
*_జ్ఞాన మార్గం ద్వారా మనసును నేనుకాను అని తెలుసుకుని మనసును నిరోధించవచ్చును. కర్మ మార్గం ద్వారా ఎదో ఒక దైవకర్మ యందు మనసును లగ్నం చేయడం వలన మనసు నిలిచిపోతుంది._*
*_భక్తి మార్గం ద్వారా మనసును సర్వదా ఇష్టదైవం మీదకు పోనిచ్చి ప్రార్ధన, పూజ, ధ్యానం మొదలగు సేవలలో మనసుని ఉంచడం వలన కొంతకాలానికి ఆ మూర్తియందే మనసు లగ్నమై నిలబడిపోతుంది._*
*_కానీ అన్నిమార్గాలలో సులభమైనది భక్తి మార్గం. నీ ఇష్టదైవ పటంగాని, విగ్రహంగాని నీకు తీరిక కలిగిన సమయంలో నీ మనసులో ధ్యానించుకో. దానివలన నీ మనసు నిలబడిపోతుంది !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_*
*_🧘🏻 ఓం నమో భగవతే_*
*_శ్రీరమణాయ 🧘🏻♀️_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
No comments:
Post a Comment