Saturday, 23 May 2026

 *మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మహిమలు* 

పూర్వం కరువు కాటకాలతో తంజావూరు రాజు మనస్సు తీవ్ర అలజడికి లోనవుతుంది. పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో పాటు వర్షాలు కురవని కారణంగా బావులు, చెరువులు ఎండిపోవడంతో తాగునీరు లభించడమే కష్టంగా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి రాఘవేంద్రస్వామి గుర్తుకువస్తాడు.

చనిపోయినవారిని రాఘవేంద్రస్వామి బతికించిన సందర్భాలు వున్నాయి. అలాగే ఆయన మోడువారిపోయిన చెట్టును చిగురింపజేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటాడు. అలాంటి రాఘవేంద్రుడే తంజావూరును ప్రస్తుతమున్న పరిస్థితి నుంచి గట్టెక్కించగలడని ఆయన భావిస్తాడు.

అనుకున్నదే తడవుగా తానే స్వయంగా వెళ్లి, స్వామిని వెంటబెట్టుకు వచ్చి పరిస్థితిని వివరిస్తాడు. వెంటనే వర్షాలు కురవకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు ఆయన ఏంచేస్తాడా అని ఆశగా ఎదురుచూడసాగారు.
పరిస్థితిని అర్థం చేసుకున్న స్వామి, తాను నిత్యం ఆరాధించే మూలరాముడిని మనసులో తలచుకుని ఆకాశం వంక చూస్తాడు. అంతే ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయి, వర్షధారలు నేలను తాకుతాయి. ప్రజలంతా ఆనందంతో పొంగిపోతూ ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటారు. ఆ తరువాత అక్కడి ఖాళీ ధాన్యపు గది నుంచి ధాన్యాన్ని సృష్టించి ఆయన ప్రజల ఆకలి తీరుస్తాడు.

అందుకే రాఘవేంద్ర స్వామి ప్రజల గుండె గుడిలో కొలువై బృందావనంలో నిత్యపూజలు అందుకుంటున్నాడు. అందుచేత రాఘవేంద్ర స్వామిని గురువారాల్లో స్మరించుకుని పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

మాంసపు ముక్కలను పండ్లు పుష్పాలుగా మార్చుట 

మాంసపు ముక్కలను పట్టువస్త్రం తో కప్పి, కానుకగా పంపించిన ఆదోని నవాబుకు జ్ఞానోదయమయ్యేటట్టు ,మంత్రించిన జలంతో మాంసపు ఖండాలను ఫల పుష్పాలుగా మార్చి, క్షమాపణ కోరిన నవాబు నుండి మంచాల గ్రామాన్ని జాగీరు గా పొందారు. ఆవుల కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహం తో విద్వాంసుడై, మఠాన్ని నిర్మించి, సేవించి. తరించాడు.

ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః

ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానెల్ ని ఫాలో చేయండి. 🙏

*Follow the లక్ష్మీ ఆధ్యాత్మిక గ్రూప్ channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb5IdHfJJhzWRuwuWE13*
`

నిరంతరం ధార్మిక సందేశాలను మీ ఫోన్ లో పొందండి...

No comments:

Post a Comment