Sunday, 24 November 2024

*****పునర్జన్మ ; A Muslim Rebirth Story 👺 In Telugu By Madan Gupta #rebirthstories

 పునర్జన్మ ; A Muslim Rebirth Story 👺 In Telugu By Madan Gupta #rebirthstories

Youtube video link - https://youtu.be/GlvO2OACKFo

It is part 2, part 1 is available in previous post : 

Transcript:

పునర్జన్మని నమ్మని వారు ఉంటే ఆ కుర్రవాడిని ప్రశ్నించి పరిశీలించి విషయం తెలుసుకోవచ్చు చనిపోయిన కల్పనా చార్ల గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను కొలంబోలో సెరూనా వీరసింహే అనే పిల్లవాడు పుట్టాడు తన పేరు కల్పనా చార్లా అని తను వ్యోమగామినని అంతరిక్షాన్ని గురించి చెప్పడమే కాకుండా సింహల భాష తప్ప వేరే భాషే తెలియని ఆ కుర్రవాడు ఇంగ్లీష్ హిందీ భాషలో అలోకగా మాట్లాడు గురుప్రసాద్ రైదాస్ అనే ఆయనకు నరేష్ కుమార్ రైదాస్ జన్మించాడు ఆ పిల్లవాడు తరచుగా కాకోరి కాకోరి అంటూ అరిచేవాడు ప్రతి గురువారం ఒక ఫకీరు నరేష్ ఇంటికి భిక్షకు వచ్చేవాడు యాదృచ్చికంగా ఈ ఫకీరు కూడా కాకోరికి సంబంధించిన వాడు కావడం విశేషం ఒకరోజు నరేష్ ఈ ఫకీర్ చూడగానే నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడు ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మన మదన్ గుప్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి నమస్తే సదా వత్సలే మాతృభూమి నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త పునర్జన్మ పైన పరిశోధనలు చేసిన కొందరు పాశ్చాత్య సైంటిస్టుల గురించి కూడా తెలుసుకున్నాం కొన్ని రికార్డు అయిన పునర్జన్మ కేసుల గురించి కూడా తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ లో ఒక ముస్లిం బ్రాహ్మణ బాలకుడుగా జన్మించినటువంటి సంఘటన తెలుసుకుందాం ముస్లింలు క్రిస్టియన్లు నమ్మనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు కొన్ని విశ్వ సిద్ధాంతాలు నియమాలు అలానే ఉంటాయి అవి మీ నమ్మకాలకు మీ అపనమ్మకాలకు అతీతంగా ఉంటాయి అనేది వాస్తవం అలాంటి సిద్ధాంతాలే మన సనాతన ధర్మంలోని కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతాల వల్ల ఉన్న ఉపయోగం ఏమిటంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది నువ్వు చెడు చేస్తే నీకు చెడే ఎదురవుతుంది విత్తనం ఒకటి నాటి చెట్టు మరొకటి వస్తుందా బంతిని గోడకు కొడితే అది తిరిగి నీ దగ్గరికే వస్తుంది కాబట్టి జీవితాన్ని మంచిగా జీవించమని చెప్పే సిద్ధాంతం కర్మ సిద్ధాంతం నీవు మంచి చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ మోక్ష సాధనకు కృషి చేయాలి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉంటారు నీవు చేసిన కర్మ నిన్ను ఉన్నత జన్మకో లేక నీచాతి నీచమైన జన్మకో బాటలు వేస్తుంది కార్యకారణ సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది నువ్వు సత్కర్మలు చేస్తే మంచి జన్మలలో జన్మిస్తావ్ మోక్ష పదంలో ముందుకు సాగుతావు దుష్కర్మలు చేస్తే నీచమైన జన్మలలోకి వెళ్లి పతనం అవుతావు ఇది సనాతన ధర్మం చెప్పే సిద్ధాంతం ఇక పునర్జన్మ ఉన్నది అనే విషయం అర్థం చేసుకుంటే ప్రకృతితో కలిసి జీవించే మనస్తత్వం అలవడుతుంది దేనికి భయపడని మనస్తత్వం అలవడుతుంది వేదాలు ఉపనిషత్తులు చెప్పే అద్భుత సిద్ధాంతం ఒక్కటే నిర్భయంగా ఉండు నీవు చేసే ధర్మ కార్యాల ఫలితాన్ని మరో జన్మలో అనుభవిస్తావు ఈ శరీరం నీవు ధరించే వస్త్రం లాంటిది వస్త్రం చిరిగితే ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తావో జీర్ణమైన ఈ శరీరాన్ని వదలి నీవు కూడా నీవు చేసిన కర్మల ఫలితాలను అనుభవించడానికి 64 లక్షల జీవరాశులలో ఏదో ఒక జీవిగా పుడతావు మానవ జన్మ ఎత్తాలి అంటే ఖచ్చితంగా నువ్వు సత్కర్మలు ఆచరించి తీరవలసిందే కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు సత్కర్మలు చేస్తూ మోక్ష మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే మోక్ష మార్గం సుగమం అవుతూ ఉంటుంది సరే ఇప్పుడు ఒక ముస్లిం బ్రాహ్మణ బాలకుడిగా జన్మించిన సంఘటనను చూద్దాం ఈ కేసు జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ అనే సైంటిఫిక్ జర్నల్ వాల్యూమ్ నెంబర్ 14 నెంబర్ టు 1990 1990 వర్జినియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆంటోనియో మిల్ చేత వ్రాయబడింది ఫకీర్ అలీ షా పెద్ద కుమారుడు ముషీర్ అలీషా ఫకీర్ అలీ షా రెండవ భార్య నజీమా ద్వారా జన్మించాడు వీరు లక్నోకు దగ్గరలోని కాకోరిలో నివసించే వాళ్ళు ముషీరు గుర్రంపు బండి తోలేవాడు కాకోరి నుండి లక్నో వరకు పండ్లు తన గుర్రపు బండిలో తీసుకువెళ్లేవాడు 306 1980 న అతని బండిని ఒక ట్రాక్టర్ వచ్చి గుద్దింది ఈ యాక్సిడెంట్ లో ముషీర్ అక్కడికక్కడే మరణించాడు 1981 ఏప్రిల్ లో లక్నో కు దగ్గరగా ఉన్న బజ్జి నగర్ లో గురుప్రసాద్ రైదాస్ అనే ఆయనకు నరేష్ కుమార్ రైదాస్ జన్మించాడు నరేష్ రెండేళ్ల వయసులో మోకాళ్ళ మీద కూర్చొని నమాజ్ చేసే విధానంలో చాప పైన వంగేవాడు ఎవరైనా చూడగానే చటుక్కుని పైకి లేచేవాడు ఆ పిల్లవాడు తరచుగా కాకోరి కాకోరి అంటూ అరిచేవాడు ప్రతి గురువారం ఒక ఫకీరు నరేష్ ఇంటికి భిక్షకు వచ్చేవాడు నరేష్ ఫకీర్ అలీని అబ్బా అని పిలిచేవాడు మామూలుగా ఫకీర్లను బాబా అని పిలుస్తారు ముస్లిం ట్రెడిషన్ లో తండ్రిని ఉర్దూలో అబ్బా అని పిలుస్తారని మనందరికీ తెలుసు నరేష్ తండ్రి గురుప్రసాద్ అనేకసార్లు ఫకీర్ ను బాబా అని పిలవాలి అబ్బా అని కాదు అని చాలాసార్లు చెప్పాడు యాదృచ్చికంగా ఈ ఫకీరు కూడా కాకోరికి సంబంధించిన వాడు కావడం విశేషం ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నరేష్ తన పూర్వజన్మ గురించి వివరాలు చెప్పడం మొదలు పెట్టాడు తాను కాకూరికి చెందిన ఒక ముస్లిం అని ఒకరోజు నరేష్ ఈ ఫకీర్ చూడగానే నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడు మా ఇంట్లో ఐదు వేప చెట్లు ఉండేవి నన్ను ఒక ట్రాక్టర్ గుద్దింది నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళమని ఫకీర్ ని కోరాడు కానీ ఫకీర్ అంగీకరించలేదు ఈ సంఘటన తర్వాత ఫకీర్ చాలా ఇబ్బందికి గురైనాడు ముస్లిం ట్రెడిషన్ లో పునర్జన్మ అనేది లేదు ఇంటికి వెళ్ళిన ఫకీర్ అల్లా ఏమిటి విచిత్రం అని ప్రార్థించాడు నరేష్ తన తల్లిని కాకోరికి తీసుకువెళ్ళమని బలవంతం చేశాడు తన తల్లికి కాకోరికి వెళ్ళే మార్గం నరేషే చూపించాడు ఆమె ఎప్పుడూ ఆ దారిలో ప్రయాణించి ఉండలేదు ఆమెకు ఆ దారి కూడా తెలియదు కాకోరి చేరగానే నరేష్ ఫకీర్ ను చూపించి ఇతను నా తండ్రి అని నజీమాను చూపించి ఈమె నా తల్లి అని చెప్పాడు నరేష్ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచాడు అతని తమ్ముళ్ళు చెల్లెళ్లు అందరిని వాళ్ళ పేర్లతో పిలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది నీకు ఎంతమంది సోదరులు ఎంతమంది చెల్లెళ్లు అని అడిగిన ప్రశ్నకు తనకు ఐదుగురు తమ్ముళ్ళు ఆరుగురు చెల్లెళ్లు అని సమాధానం ఇచ్చాడు నజీమా తన ఆరు సంవత్సరాల కూతుర్ని చూపించి ఈమె ఎవరో అని అడిగింది నరేష్ ఆ ఆరు సంవత్సరాల సబీహాను గుర్తుపట్టలేకపోయాడు సబీహా ముషీరా అలీ చనిపోయిన మూడు నెలల తరువాత పుట్టింది నేను చనిపోయే నాటికి నువ్వు ఆరు నెలల గర్భంతో ఉన్నావు అని నరేష్ సమాధానం చెప్పాడు అక్కడ ఉన్న ఐదు ట్రంక్ పెట్టెలలో నరేష్ తన పూర్వజన్మలోని తన ట్రంక్ పెట్టెను గుర్తించాడు అంతేకాకుండా ఆ ట్రంకు పెట్టెలో ఏమేమి వస్తువులు ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాడు నరేష్ కాకోరిలోని అనేకమందిని పేరుతో సహా గుర్తించాడు నరేష్ ఒకాయన భార్య ఆమె పేరు జహీదా ఆమె దగ్గరకు వెళ్లి నేను నీ దగ్గర దాచుకున్న 300 తిరిగి ఇచ్చావా అని అడిగాడు జహీదా ముషీరాలి తన దగ్గర 300 దాచుకున్న విషయం నిజమే అని నిర్ధారించింది నరేష్ తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళని అడిగాడు నాకు టీ గుడ్లు ఇవ్వరా అని అడిగాడు ముషీర్ కు టీ గుడ్లు అంటే చాలా ఇష్టం అని ప్రతిరోజు ముషీర్ ఉడికిన గుడ్లు తిని టీ తాగేవాడని వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి నరేష్ ఇంటి వారు పూర్తిగా శాఖహారులు గుడ్లు తినే అవకాశమే లేదు అటువంటిది ఆ ఇంట్లో పుట్టిన నరేష్ గుడ్లు ఇవి అడగడం అనేది పూర్వజన్మ వాసనే కొంతమంది అనొచ్చు హిందువుల్లోని పునర్జన్మ సిద్ధాంతాన్ని నిరూపించడం కోసం ఈ అబద్ధం ప్రచారం చేస్తున్నారు అని ఇది నేను చెప్పింది కాదు ముందే చెప్పాను వర్జినియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆంటోనియో మిల్స్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ అనే సైంటిఫిక్ జర్నల్ లో రాసిన తన రీసెర్చ్ కి సంబంధించిన వ్యాసం కాబట్టి దీనికి కాషా రంగు పొలంకండి ఓకే ఎప్పుడో ఎక్కడో ఏవో జరిగాయి ఏవో పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు రాసిన వాడు మాత్రం కరెక్ట్ అనేటటువంటి నమ్మకం ఏంటి మనకు తెలిసేది ఎలా మనం నమ్మేది ఎలా ఇప్పుడు మీకు మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి జరుగుతున్నటువంటి ఒక సంఘటనను గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను చనిపోయిన కల్పనా చావ్లా గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను మన దేశం చెందిన అమ్మాయి ఆస్ట్రోనాట్ హర్యానాలో చిన్న గ్రామంలో పేరు కర్ణాల గ్రామం పేరు 1962 మార్చ్ 17న పుట్టింది 2003 లో నాసావారి ఏటిఎస్ 107 అనే వ్యోమ నౌకలో అంతరిక్ష ప్రయాణం చేసి తిరిగి వస్తుండగా ఆ నౌక ఒక ఎడారి ప్రాంతంలో క్రాష్ అయింది కల్పనా చావ్లా తో పాటు మరో ఆరు మంది వ్యోమగాములు మరణించారు కొలంబోలో ఒక సాధారణ కుటుంబంలో సెరూనా వీరసింహే అనే పిల్లవాడు పుట్టాడు అతను ఇప్పుడు ఏడు సంవత్సరాల వయసు ఈ వయసులో ఆ కుర్రాడు తన పేరు కల్పనా చాల అని తను వ్యోమగామినని అంతరిక్షాన్ని గురించి చెప్పడమే కాకుండా సింహల భాష తప్ప వేరే భాషే తెలియని ఆ కుర్రవాడు ఇంగ్లీష్ హిందీ భాషలో అలవోకగా మాట్లాడుతాడు అనేకమంది అతన్ని పరిశీలించి అతను చెబుతున్నది నిజమే అని నిర్ధారించారు పునర్జన్మని నమ్మని వారు ఉంటే మీరు కూడా వెళ్లి ఇప్పుడు ఆ కుర్రవాడిని ప్రశ్నించి పరిశీలించి విషయం తెలుసుకోవచ్చు అసలు కొందరు పిల్లల్ని మీరు గమనిస్తూనే ఉంటారు వాళ్ళ కుటుంబంలో ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో ఎవరికీ లేని ప్రత్యేక లక్షణం లక్షణాలు ఆ పిల్లలకు ఉంటాయి ఆ పిల్లలకు ఆ ప్రత్యేక లక్షణాలు ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నారు దానికి ఏమైనా ఒక రీసన్ ఉందా చాలా చిన్న వయసులోనే అసాధారణమైనటువంటి ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళు సరే అలాంటి పిల్లవాడిని ఒకడిని నాకు తెలిసినటువంటి పిల్లవాడిని ఒకడి గురించి మీకు చెప్తాను 1969 ఫిబ్రవరి 28న పుట్టాడు ఉప్పలపు శ్రీనివాస్ ఆ కుర్రవాడు తన ఏడవ ఏట సంగీతకి చేశాడు త్యాగరాజ కృతులు మాండలిన్ పై వాయించాడు మహా మొహులు ఉద్దండులైనటువంటి సంగీత విద్వాంసుల చేత ప్రశంసలు అందుకున్నాడు ఏడేళ్ల వయసు మామూలుగా సంగీత సాధన చేసే వాళ్ళని అడిగితే ఏడేళ్ల వయసులో సరిగమ నేర్చుకోవడం కూడా కష్టమే అటువంటి వయసులో సంగీత కచేరి అందులో మన భారతీయ భాజ్యం కాదు అది మ్యాండలిన్ మ్యాండలిన్ మీద త్యాగరాజ కృతులు వినిపించి పెద్దలను మెప్పించాడు అని అంటే ఆ కుర్రవాడి అసాధారణ ప్రజ్ఞ ఆ ఏడేళ్ల వయసులో ఆ కుర్రాడికి ఎలా వచ్చింది అతన్ని మాండలిన్ శ్రీనివాస్ అని పిలిచేవాళ్ళు మాండలిన్ శ్రీనివాస్ గా అతను ప్రసిద్ధి చెందాడు సరే ఇంకొక చిన్న సంఘటన కూడా చూద్దాం ఈయన మనందరికీ తెలిసినటువంటి వాడు సుపరిచితుడు ఉదయాన్నే కొంచెం సంగీతం అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే ఈయన సంగీతాన్ని వింటూ ఉంటారు ఆయన పేరు మంగళంపల్లి బాలమురళి కృష్ణ ఆయన చాలాసార్లు చాలా సభల్లో చెప్పాడు తన 10 సంవత్సరాల వయసులోనే సంగీత కచేరీలు చేసేవాడిని అని సరే ఆయన సంగతి కూడా అటు పక్కన పెడితే హ్యూమన్ కంప్యూటర్ గా అతి చిన్న వయసులోనే అతి పెద్ద మ్యాథమెటిక్స్ థియరంస్ ని సాల్వ్ చేసిన వారు చేస్తున్న వారు ఉన్నారు అంత చిన్న వయసులో వాళ్ళకి అంత ప్రజ్ఞ ఎలా వచ్చింది సంవత్సరాల తరబడి సాధన చేసిన సాధించలేనటువంటి విషయాలను అంత చిన్న వయసులో ఎలా సాధించగలిగారు అనే విషయం మనం ఒక్కసారి ఆలోచిస్తే వారి పూర్వజన్మ వాసనలు అవి అని అర్థం ఉంటాయి అదొక్కటే సమాధానం మనం చెప్పుకోగలం ఈనాటికి ఈ రోజుకి అటువంటి ప్రతిభ ఉన్న పిల్లలను మనం చూస్తూనే ఉంటాం వాళ్లకు పూర్వజన్మ స్పృహ లేకపోవచ్చు కానీ ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి జ్ఞానం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పటివరకు మీతో పంచుకున్న సంఘటనలన్నీ భారతీయులు వ్రాసినవి కావు అన్ని పాశ్చాత్యులు రీసెర్చ్ చేసి వ్రాసినవే ఇంకా పునర్జన్మ సిద్ధాంతం తప్పు అని మీకు అనిపిస్తే ఇక మీ కర్మ మిమ్మల్ని దేవుడు కూడా ఒప్పించలేడు కాబట్టి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మన మదన్ గుప్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవ మరి జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త [సంగీతం] 

Tuesday, 19 November 2024

 శ్రీమద్రామాయణము.

(257  వ ఎపిసోడ్),

"" లోకప్రవాదస్సత్యో~యం  పండితైస్సముదాహృతః,,
అకాలే దుర్లభో మృత్యుః స్ర్తియా  వా పురుషస్య వా ||

స్ర్తీ పురుషులలో ఎవ్వరికైనను తాము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించ వచ్చనే భావన యుండుట సహజము.కానీ ఎటువంటి పరిస్థితులలో అలా వారు కోరుకుకున్నప్పుడు  మరణము సంభవింపదనేది నిజము.అదే ప్రాజ్ఞుల నిర్ణయము.

రామాయణము సుందరకాండములో సీతామాత తాను చేసిన ప్రారబ్ధకర్మల ఫలితాల వల్ల తనకు మిక్కిలి దారుణమైన పరిస్థితులు ఏర్పడినవని దుఃఖిస్తు,

"" జీవితం త్యక్తుమిచ్ఛామి శోకేన మహతా వృతా,
రాక్షసీభిశ్చ రక్ష్యంత్యా  రామో నాసాద్యతే మయా||,(25-19),

ఈ అశోకవనములో ఈ రాక్షస స్ర్తీల మధ్యయున్న నేను రాముని చేరజాలను. ఇలా అంతులేని శోకములో జీవించి యుండుటకంటే ఇక నా జీవనాన్ని చాలించుటయే యుక్తమైన విషయమని నిర్ణయించుకుంటుంది.

"" అంతకు మునుపే మన హనుమంతుల వారు కూడ ఈ విధముగనే భావన చేసి దేహత్యాగామునకు ఆలోచన చేసారు.

"సాగరనూపజే  దేశే బహుమూలఫలోదకే,
చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్దమరణీసుతమ్"(13-41),

సీతామాత జాడ కనిపెట్టలేని నేను జీవించిన అనేక అనర్థములేర్పడగలవని ఊహించి, ప్రాయోపవేశమును బూని గానీ యోగసాధన ద్వారా గానీ ఈ శరీర సంబంధములను త్యజించి ప్రాణములను వదిలెదను.అప్పుడు కాకులు,వ్యాఘ్రములు నా శరీరాన్ని భక్షించగలవని ఆత్మహత్యా సంకల్పము చేస్తారు.జానకిని దర్శించలేకపోతే జలసమాధి ద్వార మహర్హులు అంగీకరించిన దేహత్యాగ మార్గాన్ని ఆశ్రయించి అసువులు వీడాలనే  భావన చేస్తారు.

ఇలా ఆలోచించిన సీతామాతగానీ అంతకుమునుపు హనుమ గానీ వారనుకున్నట్లు జీవితాన్ని చాలించాలనుకున్నా వారిద్దరిలో ఏ ఒక్కరు ప్రాణత్యాగము చేయలేక పోయారు.

ఆంజనేయులవారు "'వినాశే బహనో దోషా జీవన్ భద్రాణి పశ్యతి" ప్రాణత్యాగమువలన ఉపయోగములు శూన్యము.బ్రతికియున్న ఏనాటికైనను అనుకున్నది సాధించవచ్చని ప్రాణాలను నిలుపుకున్నారు.మరి సీతామాత,

"" ధిగస్తు ఖలు మానుష్యం  ధిగస్తు పరవశ్యతామ్,
న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మచ్ఛందేన  జీవితమ్"",(26-20),

నేను ఆత్మహత్య చేసుకొనుట అవివేకము ఈ నా జీవితము రాముని ఆధీనము.దీనిని త్యజించుటకు నాకు అధికారము లేదని భావించి "మనుష్యత్వము పాపపుణ్య విచక్షణ చేయాల"ని భావన చేసి ఆత్మహత్య అనే తలంపును విరమించుకుంటుంది.

కనుక స్ర్తీలైనా పురుషులైన వారు భావించిన విధముగ తాము కోరుకోగానే ప్రాణములను విడువలేరనే ప్రాజ్ఞుల మాట సత్యదూరము గాని విషయమని రామాయణము మనకి తెలియచేస్తున్నది.

జై శ్రీరామ్,  జై జై శ్రీరామ్.
 *🕉️ధర్మసందేహాలు!!!🙏*
                 
*#ప్ర: పూజాదికాలు చేస్తున్నప్పుడు మధ్యలో తుమ్మువంటివి వస్తే, పూజ నిష్ఫలమా?*

జ: శాస్త్రరీత్యా పూజాదికాల సమయంలో కన్నీరు కారినా, క్రోధం కలిగినా, అపాన వాయువు, తుమ్ము వంటివి కలిగినా, అశౌచులను చూసినా ఆచమనం చేస్తే ఆ దోషాలు పోతాయి. అదే విధంగా కుడి చెవిని కుడిచేతితో తాకాలి.

*#ప్ర: మనం రోజును ఎలా లెక్కిస్తాం? అర్ధరాత్రి 12 తరువాత తేదీ మారినట్లు, అప్పుడే మనకి రోజు మారుతుందా?*

జ: మనకి సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు ఒకరోజు క్రింద లెక్క,   అర్ధరాత్రి లెక్కకి లేదు. సూర్యోదయమే ప్రధానం. 'ఉదయాదుదయం వారం' అని శాస్త్రం. 

*# ప్ర: ‘ప్రాతఃస్మరణీయులు' అంటే ఏమిటి? వారెవరు?*

జ: ప్రాతఃకాలాన్నే నిద్ర లేస్తూ పవిత్రమైన, దివ్యమైన వస్తువుల్నీ, మహాపురుషుల్ని స్మరించుకోవడం భారతీయ సనాతన ధర్మం. ఉదయానికి పూర్వకాలం ఆ రోజు ఆరంభం. ఆ సమయంలో 'మంచి'ని తలచుకుంటే దినమంతా మంచే జరుగుతుందని భావన. ప్రాతఃకాలాన ముందుగా, శయ్యమీదే కూర్చొని అరచేతిలో ముగ్గురమ్మలనీ భావనచేసి నమస్కరించి, ఆ తరువాత ఇష్టదైవాన్నీ, దేవతలనీ స్మరించాలి. అటు పిమ్మట వసిష్ఠాది మహర్షులనీ పృథు మాంధాత రఘు మొదలైన మహాచక్రవర్తులనీ ప్రహ్లాదాది పరమ భాగవతులనీ, హిమవత్పర్వతాది పుణ్యగిరులనీ, గంగాది పావన నదులనీ తలంచుకొని నమస్కరించాలి. అటుతరువాత భూమాతకి నమస్కరించి శయ్య నుండి దిగాలి. ఇలా ప్రాతఃకాలంలో స్మరించదగినవారిని 'ప్రాతఃస్మరణీయులు' అంటారు. అలాంటి పుణ్యచరిత్ర గలవారిని కూడా ఆ పేరుతో గౌరవించడం సంప్రదాయం.


*# ప్ర:  నది- నదం ఈ రెండింటికీ తేడా ఏమిటి?*

జ: తూర్పు దిక్కు వైపు ప్రవహిస్తూ పోయి, తనంత తానే సముద్రంలో కలిసేది - నది. (కృష్ణ,గోదావరి మొ॥నవి)
పడమటి దిక్కున ప్రవహిస్తూ వెళ్ళి, అక్కడ నదితో చేరి, సముద్రంలో కలిసేది 'నదం'.(నర్మద,తపతి మొ॥నవి)

*#మా ఇంట్లో బోర్వెల్ సదుపాయంగానీ, నుయ్యిగానీ లేదు. మున్సిపల్ పంపుల మీదనే ఆధారపడవలసి వస్తోంది. ఆ నీరునే పట్టి    సంపులలో దాచుకోవాలి. మరి పూజలకి నీళ్లు వాడుకోవాల్సినప్పుడు, శుచిగా ఎలా సాధ్యం? నిత్యకర్మలు చేయడం ఎలా కుదురుతుంది?*

జ:  మనకి దొరికే నీటినే పూజలకు వినియోగించుకోవాలి. 'సాధ్యమైనంత వరకు' శక్తివంచన లేకుండా నియమాలను పాటించాలి. సాధ్యం కానిది ఎలాగూ చేయలేం. సాధ్యమైన మేరకు శుచిగల జలాన్ని సేకరించి, ఆ దొరికిన దానిలోనే 'గంగ, యముగా, గోదావరి' లాంటి పుణ్యనదుల్ని భావనచేసి, ఇష్టదేవతా స్మరణ చేసి వినియోగించాలి. అంతేగానీ నిత్యకర్మానుష్టానం మానరాదు.

*# కొత్త తులసి మొక్కను పాతడానికిగానీ, మార్చి వేయడానికి గానీ మంచి రోజులు చూడాలా?*

జ. శాస్త్రరీత్యా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి, కార్తిక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలంటారు. ఆ రోజుల్లో కొత్తగా తులసి మొక్కను మార్చి పాతడం కూడదు. ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య, శుక్రవారాలలో తులసిని కోయరాదు.

*#నాకు పీడకలలు ఎక్కువ వస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే, వాటి ప్రభావం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? అసలు కలలు నిజమౌతాయా? పగటి నిద్రలో కలలు నిజమౌతాయంటారు కదా!*

జ: "దుస్స్వప్నే స్మర గోవిన్దం'' అంటారు. గోవింద నామస్మరణ చేసి, నిద్రపోతే పీడకలలు రావు. వచ్చినా వాటి ప్రభావం ఉండదు. గజేన్ద్రమోక్ష ఘట్టాన్ని, త్రిమూర్తులనీ తలచుకొని నిద్రించడం, తిరిగి లేస్తూనే వాటిని స్మరించడం చేస్తే దుస్స్వప్న ప్రభావం ఉండదు. ఉదయానే దూర్వాలతో గణేషుని అర్చించినా మేలుకలుగుతుంది. 
"పుణ్యో దుస్స్వప్న నాశనః" నారాయణుడు దుస్స్వప్ననాశకుడని విష్ణు సహస్రనామాలలోనే పేర్కొన్నారు. పగటి నిద్రలో, వాతప్రకోపాలలో వచ్చే కలల వల్ల ప్రయోజనం లేదు.


*#నవబ్రహ్మలు అంటే ఎవరో వివరిస్తారా?*

జ: బ్రహ్మదేవుని నుండి ఉద్భవించిన ప్రజాపతులు తొమ్మిది మంది.  వీరు సృష్టి విస్తరణకై   బ్రహ్మ ద్వారా కలిగినవారు.      వీరినే ప్రజాపతులు అంటారు.  
మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వసిష్ఠ, దక్ష. 

*#మంగళవారం వంటి రోజుల్లో తలస్నానం చేయరాదనీ, నూతన వస్త్రాలు ధరించరాదని అంటారు కదా? మరి పర్వదినాలు ఆ రోజుల్లో పడితే ఏం చేయాలి?*

జ: పర్వదినాలు పడిన ఏ రోజైనా 
ఆ నియమం వర్తించదు. మంగళవారమైనా ఆ రోజు తలస్నానం చేయవచ్చు. నూతన వస్త్రాలు ధరించవచ్చు.

*#‘విశ్వేదేవతలు' అంటే ఎవరు? వీరి ప్రత్యేకత ఏమిటి? వీరెంతమంది?*

జ: విశ్వేదేవతలు పదిమంది. 'విశంతి కర్మసు - ఇతి విశ్వే' - ఆయా కర్మానుష్టానాలలో ఆరాధింపబడేవారిగా ప్రవేశమును పొందినవారు. వీరు 'విశ్వా' అనే ఆమెకు పుత్రులు. కర్మానుష్ఠానాలలో వీరిని ఆరాధిస్తారు. 

“వసుః సత్యః క్రతుర్దక్షః 
కాలః కామో ధృతిః కురుః
పురూరవా మాద్రవాశ్చ 
విశ్వేదేవా దశస్మృతాః ||”
          
“వసువు, సత్యుడు, క్రతువు, దక్షుడు, కాలుడు, కాముడు, ధృతి, కురు, పురూరవుడు, మాద్రవుడు... ఇవీ వారిపేర్లు.

*#జన్మనక్షత్రంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?*

జ: జన్మనక్షత్రంలో యాగం, చౌలకర్మ, అన్నప్రాశన, వ్యవసాయం, ఉపనయనం, భూసంపాదన, అక్షరాభ్యాసం చేయవచ్చు. శుభకరం. సీమంతం, గర్భాధానం, క్షౌరకర్మ, ఔషధసేవారంభం, ప్రయాణం చేయరాదు. అశుభం. 
స్త్రీలకు జన్మనక్షత్రంలో వివాహం చేయడం మంచిదే. పురుషులకు జన్మనక్షత్రాన వివాహం పనికిరాదు.

*# ప్ర: శివాలయానికి వెళ్ళేటప్పుడు నంది కొమ్ముల నుండి శివుని చూడాలంటారు. ఆ విధానం, చెప్పవలసిన స్తోత్రం ఏమిటి?*

జ: నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమచేయి ఉంచి, వెనుక భాగంలో కుడిచేతితో స్పృశించడం చేత అతడు శిరసు వంచుతాడు. అప్పుడు కొమ్ముల నుండి శివుని చూడాలి. పశుపతి అయిన శివుడు, పశువులైన జీవులకు ప్రభువు. ఆ పశుత్వాన్ని దాటి శివుని చూడాలి. 

మరియొక భావంలో - నంది ధర్మస్వరూపుడు. ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, ధర్మం ద్వారానే దైవాన్ని దర్శించాలనే సంకేతం కూడా ఇందులో దాగి ఉంది.

“శాంతానంద ప్రదాయక!
మహాదేవస్య సేవార్థం
అనుజ్ఞాం దాతుమర్హసి॥”
         - అనే శ్లోకాన్ని పఠిస్తూ
 "హర హర - శివశివ" అనే శివ నామాన్ని పలుకుతూ, నంది కొమ్ముల మధ్య నుండి శివ లింగాన్ని దర్శిస్తే - వేదపఠనం చేసిన ఫలం, సప్తకోటి మహా మంత్ర జపఫలం లభిస్తాయని, పాప పరిహారం అవుతుందనీ పురాణాలు చెబుతున్నాయి.

*#అమ్మవారి* *అష్టోత్తరశతనామాలలో*
*“భక్త హంసపరీముఖ్య* *వియోగాయైనమోనమః” అని 83వ నామం. ఈ నామానికి అర్థం ఏమిటి? కొన్ని* *పుస్తకాలలో 'పరీముఖ్య' బదులుగా 'పరాముఖ్య' అని ఉంది. ఏది సరియైన పాఠం.*

జ: 'పరాముఖ్య' అనేదే సరియైన పాఠం. దీని అర్థం- 'పరాఙ్ముఖత్వం'. అంటే- 'పెడమొగముతో ఉండుట' (విముఖత్వం). భక్తులైన హంసల (పరమహంసలు - యోగులు) పట్ల అమ్మవిముఖంగా ఉండడంలో వియోగం కలది. అంటే విముఖత్వాన్ని కలిగి ఉండదు. భక్తయోగుల పట్ల సుముఖురాలు. ఈ మాటని ఈ విధంగా చెప్పడంలో ఒక అందముంది. ఏ మాత్రము భక్తుల పట్ల విముఖంగా ఉండని తల్లి. యోగుల హృదయంలో అమ్మయే యోగము. అక్కడ వియోగం లేదు. భక్తవాత్సల్య స్వరూపిణి. పరమహంసలలో భాసించే జ్ఞానానందతత్త్వం. 

*#ప్ర. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు - అని అంటారు కదా! అవి ఏమిటి? వివరించ ప్రార్థన.*

జ. ఒకటే జాతిలో రెండు వస్తువులకు గల భేదము 'సజాతీయ భేదం'. ఉదాహరణకు రెండు రాతి వస్తువులు. ఒక రాతికీ మరో రాతితో గల భేదమిది. వేరు వేరు జాతుల్లో రెండు వస్తువులకున్న భేదం - విజాతీయ భేదం. 
ఉదా: ఒక రాతికి ఒక చెట్టుతో గల భేదం. 
ఒకే వస్తువులో ఉన్న భేదం విగత భేదం. తనయందే ఉన్న భేదం.
ఉదా: ఒకే చెట్టులో కొమ్మ, రెమ్మ, ఫలం - వంటి భేదాలు. ఈ మూడు రకాల భేదాలు నామరూపాత్మక ప్రపంచంలోని ఉపాధులలో ఉన్నాయి. ఈ భేదాలు లేని అభిన్న స్వరూపుడు సర్వవ్యాపకుడైన పరమాత్మ. వేదాంత శాస్త్రంలో పరమాత్మ తత్త్వాన్ని తేటపరచే సందర్భంలో ఈ మాటలను వివరించారు.

*#ప్ర: 'ఏడుగడ' అనే మాట ప్రాచీన తెలుగు సాహిత్యంలో కనిపిస్తోంది. ఆ 'ఏడు' సంఖ్య దేనికి వర్తిస్తుంది? ఆ పదానికి అర్థం ఏమిటి?*

జ: 'ఏడుగడ' అనే మాటకి 'ఆధారము, ఉనికి' ప్రధానార్థం. వ్యక్తి ఏడు రకాల ఆధారాల వలన తన జీవితాన్ని నిర్వహించగలడు. తల్లి, తండ్రి, గురువు, పురుషుడు (జీవ చైతన్యం), విద్య, దాత, దైవము - ఈ ఏడు ఉనికికి, మనిషికి కావలసినవి. కనుక వీటిని 'ఏడుగడ' అంటారు. ఒక శక్తి గానీ, వ్యక్తి గానీ ఈ ఏడురకాలుగా సహకరించినప్పుడు ఆ శక్తినీ, వ్యక్తినీ 'ఏడుగడ' అనడం సంప్రదాయం.


*#ప్ర: దీపం పెట్టేటప్పుడు వత్తి ఏ  ముఖంగా ఉండాలి. రాత్రి దీపం ఎంత వరకు ఉండాలి?*

జ: దీపం తూర్పుముఖంగా ఉంటే ఆయుష్షు, ఉత్తరముఖంగా వెలిగిస్తే ధనం లభిస్తుంది. పడమర ముఖంగా, దక్షిణముఖంగా వెలిగించరాదు. పడమర ముఖం దుఃఖాన్ని, దక్షిణముఖం కీడును కలిగిస్తాయి.

రవేరస్తం సమారభ్యయావత్ సూర్యోదయా భవేత్।
యస్య తిష్ఠేత్ గృహే దీపస్తస్య నాస్తి దరిద్రతా॥
సూర్యుడు అస్తమించినది మొదలు, మళ్ళీ సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతుండాలి. అలా దీపం వెలిగే ఇంట్లో దరిద్రం ఉండదు.

*#ప్ర: ఆబ్దికం చేసేటప్పుడు - చనిపోయినవారి తిథి ఆ రోజు పగలు పదిగంటలకు వచ్చి, మర్నాడు ఉదయం కొన్ని గంటలు మాత్రమే ఉన్నప్పుడు శ్రాద్ధకర్మ ఎప్పుడు చేయాలి?*

జ: ఇది జ్యోతిష - ధర్మ శాస్త్రాల సమన్వయంతో తేల్చ వలసిన అంశం. మీరు అనుసరించే పంచాంగ సంప్రదాయం ప్రకారం నిర్ణయించుకోవాలి. 
         అయితే అపరాహ్న (మధ్యాహ్నం 12 గం ॥) సమయంలో ఉన్న తిథినే గ్రహించాలి కనుక, 10 గంటలకు వచ్చిన తిథి ఉన్న రోజునే ఆబ్దికానికి స్వీకరించాలి.

*# ప్ర: మహాభారతంలో దుష్యంతుని పుత్రుడు భరతుడు అని ఉన్నది. ఆ భరతుని పుత్రుడు ఎవరు? అదే విధంగా - భీష్ముని తండ్రియైన శంతనునికి తండ్రి ఎవరు? 'కుఱువంశం' అనే పేరు ఎందువల్ల వచ్చింది?*

జ: భరతుని పుత్రుడు 'భుమన్యువు' - అని భారతం చెబుతోంది. తరువాత కొన్ని తరాల చక్రవర్తులు గడిచాక 'సంవరణుడు' అనే భారతవంశీయుని కొడుకు 'కుఱు'. సంవరణుని కాలంలో రాజ్యాధికార భ్రష్టమై అతడు పరివారంతో సహా పారిపోయి అరణ్యంలో తలదాచుకున్నాడు. తరువాత వసిష్ఠుని దీవెనల వల్ల తిరిగి శత్రువుల్ని జయించి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆతని పుత్రుడు 'కుఱు'. పోయిన రాజ్యం తిరిగి వచ్చాక, కలిగిన ఈతడు అనంతర రాజైన కారణంగా ప్రత్యేకించి ఈతని నుండి 'కుఱు' పేరుతో వంశ వ్యవహారం నడిచింది. ఈతని పేరుతో 'కుఱుజాంగలదేశ'మనే ప్రసిద్ధి కూడా వచ్చింది. 
వీరి తరువాత ఆరవ తరం వాడు శాంతనుడు. అతని పుత్రుడు భీష్ముడు. 'శాంతనుడు' అన్నా 'శంతన' చక్రవర్తి అన్నా ఒకడే. ఈతని తండ్రి పేరు ప్రతీపుడు.


*#ప్ర. పూజ అనే మాటకు అర్ధం ఏమిటి?*

జ. "పూః యేన జాయతే ఇతి పూజా” అని పురాణాల్లో నిర్వచనమిచ్చారు. 
పూః- అంటే ఇష్టసిద్ధి, భోగం అని అర్ధాలు. ఏ కర్మ వలన ఇష్టసిద్ధి లభిస్తుందో దానికి పూజ అని అర్ధం. భగవదర్చన వల్ల అభీష్టసిద్ధి లభిస్తుంది కనుక అర్చనకు 'పూజ' అనే శబ్దాన్ని వాడుతారు.


*#ప్ర: కార్తిక మాసంలో దీపారాధనకు అంత ప్రాధాన్యం ఎందుకుంది?*

జ: కార్తికమాసం అనగానే తెల్లవారుఝామున స్నానాలు, ఉభయసంధ్యల్లో శివకేశవాది ఆలయాలలో దీపారాధనలు, నదులలో, తటాకాలలో దీపాలను విడిచి పెట్టడం... చక్కని సందడి!
ఇందులో దివ్యత్వంతో పాటు ఒక ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయి.
చిరుచలిలో బద్ధకాన్ని వదుల్చుకొని చేసే స్నానం, చిరుదీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఉండే సౌందర్యం...
ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి ప్రదర్శించే  హైందవ మతంలోని దివ్యకళాచాతురిని కొనియాడవలసిందే.
కార్తికంలో దేశమంతా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ దైవాన్ని కొలుచుకుంటారు. కార్తికం దీపానికీ, మాఘం స్నానానికీ, వైశాఖం దానానికి ప్రాధాన్యం.

కృత్తికా నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడే మాసం కార్తికం.
కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్ని యందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధించడమే యజ్ఞం.
అందుకే వేదాలలో 'నక్షత్రేష్టి' అనేది - కృత్తికానక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. 
ఆ యజ్ఞతత్త్వానికి సంకేతంగానే 'దీపారాధన' అనేది కార్తికంలో ప్రధానమయ్యింది.
కార్తికంలో దీపార్చన, దీపదానం వంటివి - యజ్ఞఫలాలను ప్రసాదిస్తాయి.

భర్తృహరి తన శతకసాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.
జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునకు ప్రతీకగా ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ, విశ్వవ్యాపకమైన ఈశ్వరజ్యోతిని దర్శించి ఉపాసించమని ఉపదేశించే మాసమిది.
"ఆనందాలకు ఆహ్వానాలు - ఈ కార్తిక​దీపాలు"
   *శ్రీ సాయిశ్వరర్పణమస్తు.*
 *🦅సర్ప(నాగ)దోషాలు పోగొట్టే గరుత్మంతుడు* 

🙏🦅🙏మహోన్నతమైన శక్తికి, అచంచలమైన భక్తికి ప్రతీక గరుత్మంతుడు🙏🦅🙏

*🙏🦅 పక్షుల్లో గరుత్మంతుడు నేనే🦅🙏* 
అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పిన మాట ఇది

🐍🦅ఇంతకుమించి గరుత్మంతుడి ఘనత చెప్పడానికి మరొక ఉదాహరణ అవసరం లేదు.

 🐍🦅శ్రీమహావిష్ణువు వాహనం గరుత్మంతుడు ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమన్నారాయణుడు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుడు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు.

🐍🦅మరెవ్వరితో పోల్చలేనంత బలం గరుత్మంతుడి సొంతం. కేవలం తన రెక్కలు విసిరి రాక్షసుల ప్రాణాలు సంహరించే మహత్తరశక్తి అతనికి ఉంది. గరుడవేగం అందుకోవడం మరే ఇతర ప్రాణికీ సాధ్యం కాలేదని పురాణవచనం.
 
🐍🦅శ్రీహరి వాహనంగా, దాసుడిగా మాత్రమే కాదు... తల్లిని దాస్యం నుంచి విడిపించిన గొప్ప పుత్రుడు గరుత్మంతుడు

🐍🦅ఒకరోజున ఇంద్రసభలో రకరకాల ఉత్పాతాలు ఎదురయ్యాయి. 
‘‘ఏమైంది? ఏమిటి ఈ అపశకునాలు?’’ అడిగాడు ఇంద్రుడు దేవగురువుని ఆందోళనగా. 

🐍🦅ఆయన దివ్యదృష్టితో చూసి ‘‘తల్లి దాస్య విముక్తి కోసం కద్రువ పుత్రులైన పాములు తమకి అమృతం కావాలన్నారు. ఎలాగైనా సరే అమృతాన్ని తీసుకువెళ్లి తన తల్లిని దాస్యం నుంచి బయట పడేయాలని గరుడుడు వస్తున్నాడిక్కడికి. మహాబలుడు, వీరుడు అయిన గరుత్మంతుడు నీకు తమ్ముడైనా నువ్వు అతన్ని గెలవలేవు’’ అన్నాడు బృహస్పతి.

🐍🦅గురువు మాటలతో అంతా అప్రత్తమయ్యారు. కవచాలూ, ఆయుధాలూ ధరించి, అమృత భాండం చుట్టూ రక్షక వలయంలా నిలిచారందరూ. అంతలో అక్కడకి రానే వచ్చాడు గరుత్మంతుడు. 

🐍🦅నేరుగా అమృత భాండం దగ్గరే వాలి దాన్ని అందుకోబోయాడు. రకరకాల ఆయుధాలతో అతనిమీద దాడి చేశారు రక్షకులు. గరుత్మంతుడు రెక్కలొక్కసారి బలంగా జాడించాడు. ఆ గాలి ఉధృతికి దేవసైన్యమంతా ఎండుటాకుల్లా ఎగిరి అల్లంతదూరాన పడ్డారు. గరుడుని మీదికి ఉరికిన అగ్ని వాయు యమ కుబేర వరుణాది దిక్పాలురు కూడా పక్షీంద్రుని పరాక్రమానికి తల వంచక తప్పలేదు. అదను చూసి అమృత కలశాన్ని అందుకునేందుకు ప్రయత్నించాడు పక్షీంద్రుడు.
🐍🦅అయితే భాండం చుట్టూ ఆకాశాన్నంటేలా మహాగ్ని కీలలు లేచాయి. రివ్వున వెళ్లి నదుల నీళ్ళన్నీ పుక్కిట బట్టి వచ్చి ఆ నీటిని ఆ అగ్ని మీద కుమ్మరించడంతో ఆరిపోయింది. అంతలో అమృతం చుట్టూ తిరుగుతూ కత్తులు దూస్తున్నట్టుగా యంత్రచక్రం కనిపించడంతో గరుడుడు వెంటనే సూక్ష్మదేహం ధరించి చక్రం రేకుల్లోంచి దూరి లోపలకి ప్రవేశించాడు. భాండాన్ని చుట్టుకుని రెండు మహాసర్పాలు పడగ విప్పి, కోరలు సాచి పైకి లేచాయి. రెండు పాములమీదా చెరో పాదం వేసి వాటి శిరస్సులను కాళ్లతో నొక్కిపెట్టి, ముక్కుతో అమృతభాండాన్ని అందుకుని ఆకాశానికి ఎగిశాడు.

🐍🦅ఇదంతా చూస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. పాములు అడిగినందుకు అమృతం తీసుకుని వెళ్తున్నాడు పక్షీంద్రుడు. రుచి చూద్దామన్న తలంపు కూడా లేదు. ఎంత బలవంతుడో అంతటి నీతిమంతుడితను అనుకున్నాడు విష్ణువు. వెంటనే అతని ముందు సాక్షాత్కరించాడు.

🐍🦅”ఓయి గరుత్మంతా! నీవు ఈ అమృతాన్ని చేజిక్కించుకుని సేవించకుండా ఎక్కడికి వెళుతున్నావు? అని అడిగితే నాకు ఈ అమృతం వద్దు కాని మా అమ్మ దాస్య విముక్తి కోసం నాగులకు ఇవ్వడం కోసం తీసుకువెళ్తున్నాను.” అని చెప్పాడు. మహావిష్ణువు గరుత్మంతుని మాతృభక్తికి మెచ్చి నీకు ఏమివరం కావాలో కోరుకోమన్నాడు. గరుత్మంతుడు ”స్వామి నీ దర్శనం లభించింది. చాలు. ఇంక ఏ వరాలు నాకు వద్దు. కాని నీవు ఇస్తానంటున్నావు కనుక నేను సదా నీ సేవలో ఉండే భాగ్యాన్ని కలుగచేయి” అని అడిగాడు.

🐍🦅‘ఖగరాజా ‘‘నాకు వాహనంగానూ, నా రథానికీ పతాకం గానూ ఉండు ’’ అన్నాడు అనుగ్రహ పూర్వకంగా చూస్తూ.నారాయణుడు

 *‘‘ధన్యుణ్ణి స్వామీ!’’ అంటూ కైమోడ్చాడు గరుత్మంతుడు.* 

🐍🦅గరుత్మంతుడి పేరుతో అధర్వణవేదంలో ప్రత్యేకంగా 'గరుడోపనిషత్తు’ ఉంది. ఇందులో గరుత్మంతుడిని ‘విషదహారి’ అనే పేరుతో ప్రత్యేకంగా వివరించారు. గరుత్మంతుడి విగ్రహ స్వరూపం కూడా ఇందులో ఉంది. దీని ప్రకారం...

🐍🦅గరుత్మంతుడు తన కుడిపాదాన్ని స్వస్తికంగా, ఎడమపాదాన్ని కుంచితంగా ఉంచి విష్ణువుకు నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు. సర్పజాతికి అంటే పాములకు గరుత్మంతుడు అంటే భయం .గరుత్మంతుడు ఆభరణాలుగా శ్రేష్ఠమైన జాతికి చెందిన నాగుల్ని ధరిస్తాడు. 

🐍🦅వాసుకి అనే సర్పాన్ని యజ్ఞోపవీతంగా, తక్షకుడిని నడుముకు సూత్రంగా, కర్కోటకుడిని మెడలో హారంగా ధరిస్తాడు. కుడిచెవికి పద్ముడిని, ఎడమచెవికి మహాపద్ముడిని కుండలాలుగా పెట్టుకుంటాడు. శిరస్సుపై శంఖుడు, భుజాల మధ్య గుళికుడు అలంకారాలుగా ఉంటారు. ఇతర ఆభరణాలు కూడా సర్పాలే. అతడికి పొడవైన బాహువులు, పెద్ద మూపు, వంద చంద్రుల కాంతివంతమైన ముఖం ఉంటాయి. గరుత్మంతుడిని ధ్యానించడం, అర్చించటం వల్ల కలిగే ఫలితాలు ఈ ఉపనిషత్తులో ఉన్నాయి.

🐍🦅సర్పాలకు (నాగులకు) గరుత్మంతుడు అంటే భయం అందువలన గరుత్మంతుని, ధ్యానిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, నీతి, నిర్భయం, ధైర్యం కలుగుతాయి. మృత్యు భయం ఏమాత్రం ఉండదు. సర్వత్రా విజయం కలుగుతుంది.

నాగదోషములు కాలసర్పదోషములు ఉంటే అవి హరించి పోతాయి.రాత్రిపూట భయంగొలిపే కలలు రావటం,కలలో నాగులు (పాములు) కనిపించటం వంటివాటికి దోష నివృత్తి కలిగి కలలురావటం నిలిచి భయం తొలగి పోతుంది.
 
🐍🦅గరుత్మంతుడికి ఘనత అతని పేరుతోనే ఒక పురాణం ఉంది  వ్యాసమహర్షి రాసిన 18 పురాణాల్లో గరుడపురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఉపదేశించిన ధర్మ రహస్యాలన్నీ ఇందులో ఉంటాయి. ఇలా ఒక సేవకుడు, పక్షిజాతికి చెందిన వ్యక్తిపేరుతో ఉన్న ఒకే ఒక పురాణం ఇది.

🐍🦅గరుత్మంతుడి పరాక్రమానికి, శక్తికి ప్రతీకగా నిలిచే ఘట్టం రామాయణంలో ఉంది. ఇంద్రజిత్తు నాగాస్త్ర ప్రయోగంతో రామలక్ష్మణులిద్దరూ మూర్ఛపోతారు. 
నాగపాశాల నుంచి వారిని విడిపించటం ఎవరివల్లా కాలేదు. ఇంతలో గరుత్మంతుడు మహాప్రభంజనంగా దేవలోకం నుంచి వస్తాడు. అతడు వస్తున్నప్పుడు వీచిన గాలికి సముద్రం అల్లకల్లోలమవుతుంది. అతడు రామలక్ష్మణులను సమీపించటంతోనే వారిని బంధించిన నాగపాశాలన్నీ విడిపోతాయి. గరుడుడి స్పర్శతో క్షణకాలంలో గాయాలు మాని, వారిద్దరికీ దివ్యతేజస్సు కలుగుతుంది. గరుత్మంతుడే ఆదుకోకపోతే రామాయణం ఏ మలుపు తిరిగేదో?

🐍🦅తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అగ్రతాంబూలం గరుత్మంతుడిదే. శ్రీవారి ఉత్సవాల ప్రారంభసూచకంగా గరుడ చిత్రం ఉన్న పతాకాన్ని అర్చకస్వాములు ఎగురవేస్తారు. ఉత్సవాలకు రావాల్సిందిగా ముక్కోటి దేవతల్ని ఆయనే ఆహ్వానిస్తాడు. అలాగే, బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహనసేవల్లో గరుడ వాహనసేవ ఎంతో ప్రత్యేకమైంది. దాసుడిగా మిత్రుడిగావిసనకర్రగా ఆసనంగా ఆవాసంగా ధ్వజంగా... ఇలా తన జీవిత సర్వస్వాన్నీ శ్రీహరి సేవకు అంకితం చేసిన దాసోత్తముడైన ఆయనను వైష్ణవ సంప్రదాయంలో గరుడాళ్వార్‌ పేరుతో కొలుస్తారు. అన్నమాచార్యులు  తన సంకీర్తనల్లో అనేక చోట్ల ఈ పక్షీశ్వరుని స్తుతిస్తా *‘గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పురుషులదివో వచ్చి పై పై సేవించెను’* అంటూ నల్లనిస్వామి వివాహ వేడుకల వైభవానికి గరుడుడు కూడా ఓ కారణమంటాడు అన్నమయ్య.

ప్రతి వ్యక్తీ రాత్రి నిద్రపోయే ముందు
 
🐍🦅 *రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం।*
*శయనే యఃపఠేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ।।* 

🐍🦅అనే శ్లోకాన్ని చదువుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. రాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు వీరిని తలుచుకుంటే దుస్వప్నాలు కలగవని దీని భావం. మనిషికి కలిగే బాధను తీర్చే శక్తి పక్షికి ఉండటం గమనించదగిన విశేషం.

🐍🦅ఆయన పైన ఎక్కి కూర్చోవాలి అంటే అది లక్ష్మీ నారాయణులు లేదా శ్రీమన్నారాయణుడి అవతారాలు మాత్రమే 

🐍🦅చేతిలో డబ్బులు ఉన్నాయి
చెయ్యడానికి పనివారు వున్నారు అని ఎవ్వరికి పడితే వారికి గరుత్మంతుడుని వాహనంగా ఉపయోగిస్తే వంశక్షయం తప్పదు.
 *నక్షత్రములు ...!!*

[౧] అశ్వని-అధికమైన బుద్ది ,ధనము,వినయము ,ప్రజ్ఞ, కీర్తి ,సుకము గలవాడగును.అందరికి ఆకర్షినియముగా ఉండును.ప్రేమ స్నేహ భావము గలవాడగును .ఎక్కువ గవురవము పొందగలడు.

[౨] భరణి -కోరికలు ఎక్కువ పరస్త్రీ వ్యామోహం కృతజ్ఞుడు ధనము కలవాడు తేజోవంతుడు అగును.సంతోషముగా నున్డువాడునుఆతిధ్యము వేడుక వినోదము గలవాడును పెద్దవాటికై అపెక్షిన్చువాడును, కామము మోహము కలవాడును అత్యాస కాల వాడును అగును .

[౩] కృత్తిక – ప్రభువులతో సమానుడును, ముర్కుడును,విద్యావంతుడు అగును.మంచి ఆరోగ్యము భలము సంతోషము ,ముందుకు సాగిపోయే స్వభావము గలవాడును, అదికారము చలాయిన్చువాడును నాయకత్వము వహించు స్వభావము గల వాడును పోటి తర్కించు స్వబావము గలిగి ఉండును మంచి శారిర కాంతి కీర్తి వాక్చాతుర్యము బందు ప్రీతి సుక సంపదలు కాల వాడగును.

[౪] రోహిణి -పరుల దోషములు తెలిసినవాడు,కృశించిన శరీరము ,జ్ఞానము ,పరస్త్రీ వ్యామోహము ,మంచి అలవాట్లు, మంచి స్వభావము ,మంచి వాక్కులు పలుకు వాడును సంగీతము ,కళ నాటకములందు అభిరుచి కలవాడును సమర్ధత ,సంపాదన, జనాకర్షణ ,కలిగి ఉండును.

[౫] మ్రిగసిర -మంచి మనస్సు ,దేశాటన చేయువాడును, కుటిల చూపు గల వాడును ,క్కమతురుడును , అనారోగ్యము కలవాడు అగును హాస్య స్వభావము కళ వాడును మనోశక్తి గలవాడును చురుకు తొందర కలవాడును ధైర్య సహసమును పాపా బీటి మాతృ భక్తీ ,శాస్త్ర విజ్ఞానము ,విపుల భుజములు ,ఉస్తహాముగా పనులు నిర్వాహించును .

[౬] ఆరుద్ర -క్రయ విక్రయ ములందు రానిన్చిను.చిత్ర సీమలో కలలలో రానిన్చును మంత్ర శాస్త్ర సాహిత్యములు అనుకులించును.ప్లాన్లు ,డిజైన్లు ,పుస్తకముల వ్యాపారము ,రవాణా,వ్రుత్తి మందులు ,వేలిముద్రల నిపుణులుగా రానిన్చును.

[౭] పునర్వసు -మంచి తెలివి తేటలు ,ధర్మ బుద్ది అవుదార్యము.దైవభక్తి ,శాస్త్ర విజ్ఞానము ,న్యాయ దృష్టి ,సత్య శీలము ,సుగుణ సంపద, పరోపకార గుణము గలిగి అభి వృద్దికి రాగలరు.ప్రజాకర్షణ ,ప్రసిద్ది ,శన బలము ,కవి,కాముకుడు అగును .

[౮] పుష్యమి -దేవ బ్రాంహనులకు ప్రియుడును, ధనము కీర్తి గల వాడును. రాజప్రియుడును. బందువులు కళ వాడును అగును. పొడుపు చేయువాడును ,సంప్రదయములపై పట్టుదల కలవాడును దీక్షతో పని చేయు వాదు.

[9] ఆశ్రేష – మాటలలో మంచి నేర్పరి ,రహస్యముగా అదికారము చేయగలుగును.స్వమి కార్యము చేయగలుగుటలో ఆసక్తి చాతుర్యము చూపించును .పెద్ద మన్ననలను ఆదరణ పొందును .రహస్యమైన బుద్ది గలవాడును కృతజ్ఞ వచనము గలవాడును,కామగుణము అధికము.దురాచారము కాలవదగును. సుక్ష్మ బుద్ది గల వాడును ,న్యాయము గలవాడును ,అనేకవిషయములలో ప్రావిన్యము గలవాడును అగును.

[౧౦] మక -తేజోవంతుడై తండ్రిని మించిన వాడై ఉందును.గురు భక్తి, దైవ భక్తి,కలిగి ఉండును.కోపము ఎక్కువ వాదిన్చ్గలదు బండువర్గమునకు ఉపకారిగా ఉండును భార్యకు లోబడి ఉన్డువాడుగా ఉండును. ధనము గలవాడగును జీవితమూ సుకముగా గడుపు కొను వాడగును

[౧౧] పుబ్బ [పుర్వపాల్గుని] – త్యాగ గుణము గలవాడును ,దృడమైన వాడును ,కాముకుడు, లోభి ,ఉదారస్వభావము,కవి ,మంచి హృదయము గలవాడును ,విదేయుడును ,సుకము కోరువాడును ,విలాసము ,సత్యము ,తనకోరికలు సాదించు వాడగును.

[౧౨] ఉత్తర [ఉత్తరపల్గుని] – మానియును,క్రుతగ్నుడును, విద్వాంసుడును అగును.విద్యయందు ఆసక్తి గలవాడును బుద్ది బలము గలవాడును ,గణిత శాస్త్రము లేక ఇంజనీరింగ్,జ్యోతిష్య శాస్త్రము ఖగోళ శాస్త్రము తెలిసికోనును,కీర్తి గావురవములందు ఆపేక్ష మహిళలకు ఇష్టుడు కాగలడు.

[౧౩] హస్త -మంచి కీర్తి, గవురవము,గామ్బిర్యము, విద్య ,సంపద, పెద్దల వాళ్ళ గవురవము ,దైవ భక్తీ ,ఉపకార గుణము ,మహిళలకు ఆనందము కలిగించే స్వభావము ,వ్యాపారస్తుడు, వాళ్ళు వంచి పని చేయువాడు అభిరుచి గలవాడు ,కనికరము లేను అగును .

[౧౪] చిత్త -సత్య భావమునందు ఆసక్తి గలవాడు.మనము గలవాడు,వ్యాపార సరళి గలవాడు .ఆనందముగా ఉండును .ధైర్యవతుండు ,శక్తివంతుడు ,ఎత్తిపొడుపు మాటలు గలవాడును ,రసాయన్ శాస్త్రములందు ప్రీతి ,సర్వజన ప్రియుడు, సహజ జ్ఞానము గలవాడు ,సుగంద ద్రవ్యములు ,పుష్పములు ,అలంకారము పై ఆసక్తి దుండును

[౧౫] స్వాతి -స్వతంత్రుడు ,బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు ,పెద్దల పట్ల గవురవము ,అనేక భోగ బాగ్యములు అనుభవించగలడు .బందు ప్రేమ కీర్తి విశాల హృదయము, దేవ బ్రంహనులకు ప్రియము చేయువాడును ,బోగము ధనము గలవాడగును ,మందబుద్ది ఉండును

[౧౬] విశాక -గర్వము, భార్యకు లోబడువడుగాను,శత్రువులను జైన్చువాడును ,దేహకర్షణ్,దేవుళ్ళ యందు భక్తీ ,సోదరులు గలవాడును,నిజైతి గలవాడును,ధర్మమూ గలవాడును మంచి పరిజ్ఞానము గలవాడగును

[౧౭] అనురాధ -రాజకియాసక్తి ,మంచి రూపము ,సవుర్యము ,పాప భీతి,మహిళల అభిమానము ,సుకమునందాసక్తుడు,ధన వంతుడు ,విభుడు అగును

[౧౮] జేష్ఠ -అధికమైన కోపము ,పరస్త్రీ ఆసక్తి ,విద్యాసక్తి, మాటలతో పోట్లాటకు వెనుదీయని వాడు ,యుక్తాయుక్తముగా నటించు నేర్పు గలవడుగాను ,విద్యావంతుడు,పుత్రసంతతి ఉండును

[౧౯] మూల -సమర్ధమైన వాక్కులు గలవాడును ,కుశలుడు,దుర్తుడు,ధనము గలవాడు,నిజాయితి ,ఇతరులయొక్క గవురవము కాపాడు వాడు ,ఆచరావంతుడు,రహస్యములను పసి కట్టి వివక్షత లేకుండా అన్ని పదార్దములు బుజించును .

[౨౦] పూర్వాసాడ -సుకము గలవాడు .శాంతి బుద్ది గలవాడగును .ఇతరులను ప్రేమించువాడు ,బోగావస్తు ప్రీతి,ప్రసన్న ముకము ,దానగుణము తల్లి మీద ప్రేమ మంచి పేరు ఉండగలదు.

[౨౧] ఉత్తరాషాడ -మాన్యుడు,శాంతి గుణము ,ధనము ,కర్చు పెట్టు మనస్సు గల ,హాస్యము ,ఉల్లాసము ,ఉస్ట్చాహము ,నమ్మకము ,సర్వము మంచి కొరకు ఉన్నదనే ఆశయము ,ఇతరులు చేసిన మేలు మరువడు.

[౨౨] శ్రవణ -పండితుడును ,దేవ బ్రమహనులందు భక్తీ ,రాజునూ,ధన వంతుడును ,పొడుపు గలవాడు ,దాన్యపరుడును ,విసుగు చెందని వాడు,పట్టుదలగలవాడు అగును .

[౨౩] ధనిష్ఠ -దాతృత్వము ఉపకార గుణము రోష పవురుశము అదిక సంపాదనభిరుచి,క్రీడలలో ఆసక్తి శ్రమ పడే స్వభావము ,సుకము గల వాడును ఉద్రేకము కొన్ని సమయము లలో అదిక వ్యేయము ,ఆస గలవాడు అగును .

[౨౪] శతభిష -బందు ప్రీతి ,గావురవ మన్ననలు,శాంతి స్వభావము ,లవుకిక పరిజ్ఞానము ,దైర్య సాహసము,భార్య పట్ల అభిమానము .దీర్గాయువు ,కాల జ్ఞానము గలవాడగును .

[౨౫] పూర్వాబద్ర -ప్రవుడముగా మాట్లాడు వాడు,వేదాంతి ,సర్వము మంచికోరకు ఉన్నదనే ఆసతో గూడా కలిగి ఉండును .విదేయత, నిజము,నమ్మ దాగిన వాడు ,తత్వ శాస్త్రము ,కగోళ,విద్య ,విమర్శ,ఉండును .

[౨౬] ఉత్తరాబద్ర -దైర్యము ,నీటి ,నిజాయితి ,చాపల్యము,నెమ్మది,ఆలస్య భావము ,అభి వృద్ది ,ఏదో ఒక అనారోగ్యము ఉండును త్యాగ బుద్ది ధనము గలవాడు ,పండితుడు అగును పేద సాదలకు సహాయము చేయువాడునగును.

[౨౭]రేవతి -గొప్పదగు లాన్చనము గలవాడు,కామాతురుడు ,సుందరుడు,మంత్రి ,స్తిరమైన సంపద యందు ఆసక్తి ,నీటి మంతుడు గావురవ నీయుడు ,విద్యాసక్తి ,మనోనిగ్రహము ,స్తిర బుద్ది,పాండిత్యము .సామర్ద్యము ,న్యాయముకోరకు ఎక్కువ శ్రద్ద చూపు వాడగును.
 *సత్ సంతానం:*

సత్ సంతానం కావలసిన భార్యాభర్తలు ఈ పద్ధతిని అవలంబిస్తే మంచి సంతానం గ్యారంటీ.  భార్యాభర్తలలో కనీసం ఒకళ్ళైనా  మనస్ఫూర్తిగా  దీనిని చేస్తే సత్ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. *సూర్యుడు ఎర్ర రంగులో ఉన్నప్పుడు స్నానం చేసి, కటి ప్రదేశం కన్నా క్రిందన తడి ఉండాలి బట్టకి. కటి ప్రదేశంలో తడిపిన వస్త్రాన్ని చుట్టబెట్టుకుని అతి శాంతగా ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. ధ్యాన స్థితి అంటే ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఓ ఐదు పది, సెకండ్ల పాటు ఉండాలి . తర్వాత గాయత్రీ మంత్ర జపం చేసుకుంటూ యోని మార్గంగా గర్భంలోకి సూర్యుడి యొక్క కిరణాలు, తేజస్సు ప్రవేశిస్తున్నాయి   అవి గర్భధారణకు అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నాయి అనే భావన చెయ్యాలి.  ఇష్టం ఉన్నవాళ్ళు బీజాక్షరాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. బీజాక్షర సహిత మంత్రం ఇలా ఉంటుంది. ఓం  భూర్భువఃస్వః యం యం యం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్* 

*కుంతీదేవి కర్ణుడిని పొందినటువంటి సాధన ఇదే. అందుచేత కన్యలు ఈ సాధన చెయ్యకూడదు. అయోనిజలు పుట్టవచ్చు.*

ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళకి గర్భం ఇష్టం లేదు, abortion చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. అడిగితే  ఇలా చేసుకోమని చెప్పా. విశ్వ ప్రయత్నం చేశారు వాళ్ళు. గర్భం స్థిరపడింది. ఇప్పుడు 12 ఏళ్ళు వాడికి. వాళ్ళమ్మ వాడిని పిడుగు అని పిలుస్తుంది. 

*సాధన అనంతరం ఈ అద్భుతమైన సాధనను మనకు అందించిన పరమపూజ్య శ్రీరామశర్మ ఆచార్య  గురుదేవులకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం కోరండి. మీ సాధన తప్పక ఫలిస్తుంది.*