*సుమతీ శతకము*
*పులి పాలు దెచ్చి యిచ్చిన, నలవడగా గుండె గోసి యఱచే నిడినన్, దలపొడుగు ధనము బోసిన, వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ!*
భావం: దుస్సాధ్యమైన పులిపాలు దెచ్చి యిచ్చినను, హృదయమును కోసి యామె అరచేతబెట్తినను, నిలువెత్తు ధనమును ముందు పోసినను వేశ్యకు నిజమైన ప్రేమ ఉండదు.
*పొరుగున బగవాడుండిన, నిరవొందక వ్రాతకాడె యేలిక యైనన్, ధర గాపు కొండెమాడిన, గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ!*
భావం: తన యింటి ప్రక్క శత్రువున్నను, బగుగా వ్రాయగలిగినవాడే ప్రభువైనను, గ్రామ పెత్తనదారు కొండెములు చెప్పువాడైఅను గ్రామ లేఖరుక్కు జీవితము జరుగదు.
No comments:
Post a Comment