*జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది*.. *అర్థమయ్యే వయసులో కన్నీళ్ళు తెప్పిస్తుంది*...
*మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు*..
*ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ,ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు*...
*ఒకరిని బాధపెట్టి మనం ఆనందపడటం కాదు*..
*జీవితం అంటే మనం బాధలో ఉన్నాఇంకొకరిని* *సంతోషపెట్టడమే*
*నిజమైన జీవితం*...
*మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, వదులుకున్న అవకాశం,ఈ నాలుగు తిరిగి వెనుకకు తెచ్చుకోలేము*..
*అందుకని మాట్లాడే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుందాం, కాలం గడిచి పోకముందే వినియోగించుకుందాం, అవకాశం చేజారక ముందే ఉపయోగించుకుందాo*...
*మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు,నాణ్యమైన మట్టి .అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి సంపాదన కాదు సంస్కారంముఖ్యం*...
*నేడు మంచిని విమర్శించేవారు అడుగడుగునా ఉంటారు*.
*వెనక్కి లాగేవారు వెన్నంటే వుంటారు*...
*నీ మేలు కోరేవారు ఎక్కడో,ఒకరు మాత్రమే ఉంటారు..*
*అలాంటి స్నేహాన్ని,*
*నీ మాటలతో గాని,*
*చేతలతో గాని,దూరం చేసుకోకు*...
*నిజాయితీ లేని నూరు మంది వెనుక నడవడం కన్నా,*
*నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం*...
*దీపం నిశ్శబ్దంగా ఉంటుంది.కానీ ఇల్లంతా వెలుగు ఇస్తుంది*..
*గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు ,వారు చేసే పనులతో చుట్టూఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు*...
🌹🙏*శుభమధ్యహ్నం*🙏🌹
No comments:
Post a Comment