ఇల్లు నాది అన్నాం. *నేను ఇల్లా? కాదు గదా!* నా పుస్తకం అన్నాం. *నేను పుస్తకమా? కాదు గదా!* అలాగే నా శరీరం అన్నప్పుడు శరీరం నేనెలా అవుతాను? నా మనస్సు అన్నప్పుడు నేను మనస్సునెలా అవుతాను? *శరీరం కన్నా, మనస్సు కన్నా నేను వేరుగా ఉండి ఉండాలి గదా! ఎవరా నేను? అదే ఆత్మ. అంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి*.
అసలు ఈ శరీరం నాదని, మనస్సు నాదని, బుద్ధి నాదని, ఎలా తెలుసుకుంటున్నాం? ఆత్మవల్లనే తెలుసుకుంటున్నాం. నాది అనే వస్తువుకు నాకు మధ్య సంబంధం ఏమిటి? హక్కుదారుకు వస్తువుకు మధ్య ఉండే సంబంధం. ఇది నా ఇల్లు అంటే నేను ఇల్లు కాదు. ఇంటి యొక్క హక్కుదారును.
మరి 3 శరీరాలు నావి, పంచకోశాలు నావి, 3 అవస్థలు నావి అంటే అవన్నీ నేను కాదు. వాటి హక్కుదారును మాత్రమే. మరి హక్కుదారైన నేనెవరిని? *ఆత్మను. కనుక నేను ఆత్మను అని, నేను తగిలించుకున్న ఉపాధులే ఈ శరీరాలు, కోశాలు, అవస్థలు అని గ్రహించాలి*.
No comments:
Post a Comment