216 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకం 4
భవో$యం భావనామాత్రో న
కించిత్పరమార్థతః|
నాస్త్యభావభావానాం భావభావ విభావినాం||
ఈ ప్రపంచమంతా భావన మాత్రమే భావానికి వేరుగా ,నిజంగా ప్రపంచం లేనేలేదు. అస్తిత్వం కలిగి ఉన్న ఆత్మా,అభావమైన జగత్తు తమ స్వభావములో నిత్యము ఉంటాయి.
అష్టావక్ర గీతలోని అనేక వాక్యాలు అత్యంతమైన ఆదరణను పొంది అనేక తత్వశాస్త్రజ్ఞులు నాలుకపై చరిస్తూ ఉండటానికి కారణం పదాల కూర్పులోని పొందిక మాత్రమే కాదు. అనంత భావ అర్థ గంభీర సౌందర్యం ఆ వాక్యాలలో ఇమిడి ఉండి ఒకసారి విన్న మళ్లీమళ్లీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అందు కొక చక్కని ఉదాహరణ ఇక్కడ చూస్తున్నాం. "భవోయం భావన మాత్రః"ఈ ప్రపంచమంతా ఒక విధంగా భావనలు మాత్రమే. ఈ వాక్యాన్ని వేదాంత బోధకులు అందరూ తరచుగా వాడుతున్నారు. మనసులోని ఆలోచనలు అణిగిపోయి అనంత సత్యములోకి జాగృతమైనప్పుడు భావ ప్రవాహంగా నామరూపాలుగా తెలియపడే ప్రపంచమంతా అదృశ్యమైనప్పుడు సాధకుడు తప్పకుండా ఇలా అనుకుంటాడు. "నకించి పరమార్థతః"... నిజంగా ఇక్కడ ఏదీ లేదు ఆత్మలేని ప్రపంచం ఎప్పుడూ తమ స్వభావాలను మార్చుకోవు అనే వేదాంత సత్యాన్ని అష్టావకులు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు.
ఆత్మ సత్యమైనది, నిత్యమైనది, పరిణామరహితము, అనంతము, ఈ ప్రపంచము అసత్యము, అనిత్యము, నిత్య పరిణామశీలి, వాటి సహజ స్వభావాలను అవి ఎన్నడూ కోల్పోవడం లేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆత్మ మాత్రమే సత్యమైనది. ఇదే నిత్యంగా ఉంటుంది .ప్రపంచము ఉనికి కలిగి లేదు. వాటి స్వభావాలు మారకుండా ఎప్పుడు అలాగే ఉంటాయి.🙏🙏🙏
No comments:
Post a Comment