🙏 *ఓం నమో వెంకటేశాయ* 🙏
🌹 *తాళ్ళపాక పదకుసుమాలు* 🌹
*తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు*
꧁♾️•••••┉━❀🕉️❀┉┅•••••♾️꧂
2597. 27-6-23
శృంగార సంకీర్తన
రేకు: 238-6
సంపుటము: 8-228
రాగము: దేవగాంధారి
ఎట్టున్నదో నీ చిత్తము యెరఁగ విన్నవించేను
గుట్టున నేనుండితేను కోపముగాదు సుమ్మీ
॥పల్లవి॥
యెగ్గులేక పతితోడ నెటువంటి వేళనైనా
సిగ్గె మూలధనము చెలులకును
వొగ్గి నీవు సారె సారె నొడివట్టి తియ్యఁగాను
దగ్గర రానైతి నిది తప్పుగాదుసుమ్మీ
॥ఎట్టు॥
యివ్వల మగవారితోనె మాటలాడినాను
నవ్వె మూలధనము నాతులకును
మవ్వపు సరసమున మానము సోఁకనాడఁగా
రవ్వగాఁ గేరితి నిది రాఁపుగాదుసుమ్మీ
॥ఎట్టు॥
సారెఁ గొప్పంటిన ప్రాణసఖునితోఁ జెనకఁగ
వోరుపె మూలధనము వువిదలకు
కోరిక శ్రీవెంకటేశ కూడి నన్ను మెచ్చఁగాను
ధీరతనుండితి నంతదిట్టఁగాను సుమ్మీ
॥ఎట్టు॥
꧁♾️•••••┉━❀🕉️❀┉┅•••••♾️꧂.
No comments:
Post a Comment