🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ఉపాధ్యాయుడు*
➖➖➖✍️
*మన జీవితంలో ఉపాధ్యాయుని స్థానం ఏమిటి?*
1994, భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ అధికారిక పర్యటన నిమిత్తం మస్కట్ కు వెళుతున్నారు.
ఎయిరిండియా విమానం ఒమన్ లో దిగినప్పుడు మూడు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
**మొదటిది :*
ఒమన్ దేశ సుల్తాన్ ఏ దేశంలోని ప్రముఖులను స్వాగతించడానికి ఎప్పుడూ విమానాశ్రయానికి వెళ్లడు, కానీ ఆ రోజు సుల్తాన్ రాష్ట్రపతిని స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్లాడు.
**రెండవది :*
ఫ్లైట్ ఆగినప్పుడు, మనఅధ్యక్షుడు విమానం నుండి క్రిందకు దిగలేదు, కానీ ఒమన్ సుల్తాన్ తన స్థానం నుండి వచ్చి, రాష్ట్రపతిని తీసుకెళ్లడానికి విమానం మెట్లు ఎక్కాడు.
ఇలా జరగడం కూడా ఒమన్ చరిత్రలో మొదటిసారి!
**మూడవది :*
విమానం దిగిన తర్వాత, ప్రముఖుల కోసం డ్రైవర్లు వేచి ఉంటారు.
మన రాష్ట్రపతి కోసం ఒక కారు అక్కడ నిలబడి ఉంది, కానీ ఒమన్ సుల్తాన్, ప్రధాన డ్రైవర్ ను దూరంగా వెళ్లమని సంకేతాలు ఇచ్చాడు.
భారత రాష్ట్రపతి కూర్చున్న కారును సుల్తాన్ తానే స్వయంగా నడిపాడు.
తరువాత, విలేకరులు సుల్తాన్ ను, ఇన్ని ప్రోటోకాల్ ( గౌరవ నియమాలను) ఎందుకు ఉల్లంఘించాడని అడిగారు.
ఒమన్ సుల్తాన్ ఇలా సమాధానమిచ్చాడు,
"నేను శ్రీ శంకర్ దయాళ్ శర్మను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్ళినది ఆయన భారత రాష్ట్రపతి అయినందుకు కాదు, ఆయన నా ఉపాధ్యాయుడు కాబట్టి!
*నేను భారతదేశంలో చదువుకున్నాను. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను పూణేలో చదువుతున్నప్పుడు, డాక్టర్ శర్మ నా ప్రొఫెసర్, అందుకే ఇదంతా చేశాను."*
మిత్రులారా, ఇది ఉపాధ్యాయునికి ఉన్న గొప్ప శక్తి. ఉపాధ్యాయుడిగా ఉండటం, దానికదే చాలా గర్వకారణమైన విషయం.
♾️♾️ ♾️♾️ ♾️♾️
*ఈ గ్రహం మీద మానవజాతి నేడు అభివృద్ధి పథంలో, విద్యలో ముందంజలో ఉందనుకుంటే, దాని ప్రతిష్ట అంతా ఈ గురు-శిష్య* *సంప్రదాయం, జ్ఞానం - నైపుణ్యం, వ్యాప్తి చెందుతున్న ప్రేమ - కరుణ, ప్రాణశక్తి - ఆనందం - ఇవన్నీ ఉన్న ఈ వ్యవస్థకు చెందుతుంది.* ✍️
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment