Tuesday, 9 September 2025

 ☘️🍁 *అవునా... ఈ బ్లడ్ గ్రూపు వారి లక్షణాలు ఇలా ఉంటాయా!!!* 🍁☘️

☘️🍁 O Blood Group 🍁☘️

"0" గ్రూపు రక్తంగల మానవుల స్వభావం ఇలా ఉంటుంది....

"0" గ్రూపు రక్తం కలిగిన మానవుల యొక్క పూర్వీకులు పోరాట యోధులుగా ఉండి ఉంటారని గుర్తించాలి. వీరిలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. బలమైన నిర్ణయాలు
తీసుకుంటారు. వీరిలో సృజనాత్మకత అధికంగా ఉంటుంది. వీరు వాస్తవ దృక్పధాన్ని కలిగి ఉంటారు. వీరిలో ఉన్నత ఆశయాలు, మొండితనం, ఏ పని మొదలుపెట్టినా అది పూర్తిచేసేవరకు నిద్రపోని తత్వం, ఎప్పుడు ఎలా
ప్రవర్తిస్తారో? అంచనాకు అందకుండా ఉండటం, ప్రతి నిర్ణయాన్ని తన ఇష్ట ప్రకారం తీసుకోవటం - ఈ లక్షణాలలో ఎక్కువ భాగం "0" గ్రూపు రక్తం కలవారిలో కనిపిస్తాయని చెప్పవచ్చు. "0" గ్రూపు రక్తం కలవారు నాయకులుగా రాణిస్తారు.మొత్తం నాలుగు రక్త వర్గాలలో "0" గ్రూపుకి చెందినవారు చాలా శక్తివంతులుగా, చలాకీగా ఉండేవారుగా, ఇతరులతో చాలా సులువుగా కలిసిపోయేవారుగా ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం అత్యధికంగా ఉంటుంది. 

"0" గ్రూపు రక్తానికి  చెందిన వ్యక్తులకు "0" గ్రూపు మరియు "AB" గ్రూపులకు చెందిన వ్యకులతో సంబంధాలు (వివాహం,బంధుత్వం) చాలా అనుకూలంగా ఉంటుందని గుర్తించాలి.

"0" గ్రూపు రక్తం కలిగిన వ్యక్తికి (స్త్రీ/పురుషుడు) "A" గ్రూపు కు చెందిన  వ్యకి అద్భుతమైన జీవిత భాగస్వామి కావటం జరుగుతుంది.

☘️🍁 A Blood Group 🍁☘️

"A" గ్రూపు రక్తంగల మానవుల స్వభావం ఎలా ఉంటుందంటే 

" A" గ్రూప్  రక్తం కలిగిన మానవుల యొక్క పూర్వీకులు ఏదో ఒక దశలో తప్పనిసరిగా వ్యవసాయదారులుగా ఉండి ఉంటారని గుర్తించాలి. వీరిలో జాగ్రత అధికంగా ఉంటుంది. వీరు అంతర్ముఖులుగా ఉంటారు. వీరిలో ఓర్పు, కష్టపడి పనిచేసే స్వభావం, అతి సున్నితత్వం,జాలి, గంభీరంగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.ఒకరకంగా చెప్పాలంటే వీరిని 'ప్రజలమనిషి' అని భావించవచ్చు వీరు ఇతరులతో కలసి ఓర్పుగా పనిచేసి విజయాలు సాధించగలరు. వీరిలో ఉన్న ముఖ్యలోపం ఏమంటే, కొన్నిసార్లు వీరు మూర్ఖంగా ప్రవర్తిస్తారు.వీరు పోటీపడే స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు.

"A" రక్త వర్గానికి చెందిన వారు విపరీతమైన గుండె నిబ్బరాన్ని కలిగి ఉంటారని గుర్తించాలి. ఒక క్లిష్ట సమయంలో, ఇతర రక్త వర్గానికి చెందినవారు భయంతో లేదా ఆందోళనతో గజగజలాడిపోతూ ఉంటే "A" రక్త వర్గానికి చెందినవారు చాలా
ప్రశాంతంగా ఉండి, సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కరిస్తారు. ఇతర మూడు గ్రూపులకన్నా కూడా "A" గ్రూపుకి చెందినవారు కళల పట అత్యధిక అభిమానం కలిగి ఉంటారు. వీరు ఎ విషయాన్ని అయినా అంకిత భావంతో నిర్వహిస్తారని చెప్పక తప్పదు.

"A" గ్రూపు రక్తానికి చెందిన వ్యక్తులకు "A" గ్రూపు మరియు "AB" గ్రూపులకు చెందిన వ్యక్తులతో సంబంధాలు (వివాహం, స్నేహం, బంధుత్వం) చాలా అనుకూలంగా ఉంటుందని గుర్తించాలి."A" గ్రూపు రక్తం కలిగిన వ్యక్తికి (స్త్రీ/పురుషుడు) "0" గ్రూపుకు చెందిన వ్యక్తి అద్భుతమైన జీవిత భాగస్వామి కావటం జరుగుతుంది.

☘️🍁 B Blood Group 🍁☘️

"B" గ్రూపు రక్తంగల మానవుల స్వభావం ఎలా ఉంటుందంటే...

"B"గ్రూపు రక్తం కలిగిన మనుషుల యొక్క పూర్వీకులు తప్పనిసరిగా సంచార జీవులుగా జీవించి ఉంటారని గ్రహించాలి. "B" గ్రూపుకి చెందినవారు స్వార్థపరులు, బాధ్యతారహితులు,చురుకైనవారు, ఆశావాదులు, బహిర్ముఖులు (Extrovert), తమ వ్యక్తిత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అందరూ తమ చుట్టూ తిరగాలని ఆశించేవారు అయి ఉంటారు. ఈ వర్గానికి చెందినవారు ముక్కుసూటిగా ప్రవర్తిస్తారు. ఏదైనాసరే, ఇతరులపై ఆధారపడకుండా తామే స్వయంగా చేసుకోవాలని భావిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకోగల శక్తి వీరికి ఉంటుంది. వీరు చాలా ప్రశాంతంగా మరియు పోటీకి దూరంగా ఉంటారు.
మొత్తం నాలుగు రకాల రక్త గ్రూపులలో "B" గ్రూపుకి చెందినవారు చాలా వాస్తవిక దృక్పధాన్ని కలిగి ఉంటారని చెప్పక తప్పదు. వారు ఏదైనా చేపడితే దాంట్లో అసాధారణమైన నైపుణ్యాన్ని సంపాదించేవరకు నిద్రపోరని గుర్తించాలి. ఈ "B" గ్రూపుకి చెందిన వ్యక్తులు, తమ మనసుకంటే బుద్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పక తప్పదు.

"B" గ్రూపు రక్తానికి చెందిన వ్యక్తులకు "B" గ్రూపు మరియు "AB" గ్రూపులకు చెందిన వ్యక్తులతో సంబంధాలు (వివాహం, స్నేహం, బంధుత్వం) చాలా అనుకూలంగా ఉంటాయని గుర్తించాలి. 

" B" గ్రూప్  రక్తం  కలిగిన వ్యక్తికి (స్త్రీ/పురుషుడు),"AB" గ్రూప్ కు చెందిన వ్యక్తి, అద్భుతమైన జీవిత భాగస్వామి కావటం జరుగుతుంది.

☘️🍁 AB Blood Group 🍁☘️

"AB" గ్రూపు రక్తం గల  మానవుల స్వభావం ఏలా ఉంటుందంటే...  

"AB" గ్రూపు రక్తం కలిగిన వారియొక్క పూర్వీకులు మానవతా వాదులుగా ఉండి ఉంటారని అర్థంచేసుకోవాలి. గూఢ స్వభావం గలవారు,  తార్కికంగా ఆలోచించేవారు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు, బలమైన ఆధ్యాత్మిక స్వభావం గలవారు, బాధ్యతలు స్వీకరించనివారు, ఎప్పుడు ఎలాప్రవర్తిస్తారో అంతుపట్టనివారు అయి ఉంటారు. జన్మతః వీరు ఇతరులను సంతోషపరచగల లేదా వినోదపరచగల స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు తమ చుట్టూ ఉండేవారితో చక్కగా  ప్రవర్తిస్తారు. ఇతరులతో ఎలా పనులు చేయించుకోవాలో వీరికి బాగా 
తెలుసు. ఒక్కో సమయంలో వీరు మొరటుగా మాట్లాడటం లేదా ప్రవర్తించటం జరుగుతుంది. కొన్ని సమయాలలో వీరు నిర్ణయాలు తీసుకోవటం చాలా ఆలస్యం అవుతుంది.

"AB" గ్రూపు వారు పైపైన చూసినప్పుడు దయ, సానుభూతి లాంటి మంచి లక్షణాలు
లేనివారుగా కనిపిస్తారు. కానీ వారిలో మంచితనం, క్షమాగుణం చాలా అధికంగా ఉంటుందని తరువాత తెలుస్తుంది. మొత్తం నాలుగు రక్త వర్గాలలో "AB" గ్రూపుకి చెందినవారిని చాలా విచిత్రమైన మరియు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేనివారుగా గుర్తించక తప్పదు.  కారణం వారిలో కనీసం రెండు, మూడు వ్యక్తిత్వాలు,(split 
Personalities) దాగి ఉంటాయని చెప్పక తప్పదు. అది ఎలాగంటే వీరు  ఒక సమయంలో నలుగురిలో కలవటానికి జంకుతారు.  ఇంకో సమయంలో నలుగురిలోకి చొచ్చుకుని వెళ్ళిపోతారు. అనగా ఒక  సమయంలో ఏవిధమైన గుణాలు ప్రదర్శిస్తారో, ఆ తరువాత సమయంలో  అందుకు పూర్తిగా భిన్నమైన లక్షణాలను ప్రదర్శిస్తారు. సాధారణంగా "AB" గ్రూపు రక్తానికి చెందినవారు విశ్వాసపాత్రులుగా, బాధ్యతావంతులుగా ఉంటారు. అయితే విపరీతమైన బాధ్యతలను వారు మోయలేరని గుర్తించాలి. సాధారణంగా ఈ గ్రూపుకి చెందినవారికి కళలపట్ల, ఆధ్యాత్మిక శాస్త్రాలపట్ల ఆసక్తి అధికంగా కలిగి ఉండే అవకాశాలు
ఉంటాయి.

"AB" గ్రూపు రక్తానికి చెందిన వ్యక్తులకు "AB" గ్రూపు, "B" గ్రూపు, "A" గ్రూపు మరియు "0" గ్రూపులకు చెందిన వ్యక్తులతో సంబంధాలు
(వివాహం, స్నేహం, బంధుత్వం) చాలా అనుకూలంగా ఉంటాయని గుర్తించాలి

"AB" గ్రూపు రక్తం కలిగిన వ్యక్తికి (స్త్రీ/పురుషుడు) "AB" గ్రూపుకు చెందిన వ్యక్తి అద్భుతమైన జీవిత భాగస్వామి కావటం జరుగుతుంది.

ఇక్కడ ఏ ఏ బ్లడ్ గ్రూప్స్ వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో నేను ఒక పుస్తకం లో చదివాను చదివితే సరదాగా అనిపించింది , అందుకే ఇక్కడ పోస్ట్ చేస్తున్న మీరు చదువుకోని మీ గురించి అక్కడ ఎంత వరకు సరిగ్గ చెప్పారో లేదో సరదాగా చూసుకోండి            

No comments:

Post a Comment