*🧘♂️2-వేమన తత్వ పద్యము🧘♀️*
*చెప్పులోని రాయి చెవిలోని జోరీగ!*
*కంటిలోని నలుసు కాలిముల్లు!*
*ఇంటిలోని పోరు ఇంతింతగాదయా!*
*విశ్వదాభిరామ వినురవేమా!!*
*తత్వ వివరణ:-*
*భావము:- మానవుని శరీరము లోపల జీవుడు నివాసము ఉన్నాడు. లోపల నున్న జీవునికి బయటి ఇంద్రియముల ద్వార ప్రపంచ విషయములు తెలియుచున్నవి.*
*ఇంద్రియాలు మనస్సు ద్వారా ప్రతి విషయమును జీవునకు చేరవేయుచున్నవి. ఆ విధముగా విషయములు చేర వేయు ఇంద్రియ భాగములు ఐదు మాత్రము కలవు. వాటినే జ్ఞానేంద్రియములు అనుచున్నాము.*
*అవి 1.కన్ను, 2.చెవి, 3.ముక్కు, 4.నాలుక, 5 .చర్మము.*
*పంచ జ్ఞానేంద్రియముల ద్వారా వచ్చు విషయములను అనుభవించుచూ జీవుడు ఎడతెరపి లేని కర్మను అభవిస్తు తేనెలో చిక్కిన ఈగ మాదిరి అల్లాడు చున్నాడు.*
*పంచేంద్రియాల విషయాలు సుఖమును చూపి కష్టమును కలుగజేయునవి. జీవాత్మ పంచేంద్రియ విషయ వాసనలకు లోనై కర్మములను సంపాదించు కొనుచున్నాడు.*
*చర్మ స్పర్శ వలన కలిగెడి కర్మను.... చెప్పులోని రాయి అన్నారు. చెవి శబ్ద విషయము వలన కలిగెడి కర్మను... చెవిలోని జోరీగ అన్నారు. కంటి దృశ్య విషయము వలన కలిగెడి కర్మను.... కంటిలోని నలుసు అన్నారు.*
*ఇంద్రియ విషయములు మనస్సు వలననే అనుభవమునకు వచ్చును. కావున మనస్సును ముల్లుగా వర్ణించినారు. శరీరములో అన్నీ ఇంద్రియాల విషయములు అనుభవమునకు వస్తున్నాయి.*
*కావున శరీరమును ఇల్లుగా చెప్పి అనుభవములను పోరుగా పోల్చి ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అని అన్నారు.*
No comments:
Post a Comment