🕉️💜🕉️💜🕉️💜🕉️💜🕉️
*క్షేత్రపాలకుడు*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
క్షేత్రపాలకుడు అంటే క్షేత్రాన్ని పాలించే వాడు, రక్షించే వాడు.
ప్రతి ఆలయానికి ఆయనే ప్రధాన రక్షక దేవుడు. భక్తులు ముందుగా ఆయనను దర్శించి, తర్వాతే ప్రధాన దేవుని పూజ చేస్తారు.
శైవాగమాల ప్రకారం క్షేత్రపాలకుడు శివుడే.
వైష్ణవ ఆలయాల్లో కూడా దండపాణిగా శివుడే దర్శనమిస్తాడు.
శివాలయాల్లో ఆయన ఆగ్నేయదిక్కున ఉంటాడు.
అర్చకులు కూడా ముందుగా ఆయన అనుమతి తీసుకుని మాత్రమే శివార్చన ప్రారంభిస్తారు.
ఆలయ తాళాలు ఆయన వద్దే ఉంచి, ఉదయాన్నే అనుజ్ఞ తీసుకుని ద్వారాలు తెరుస్తారు.
సుప్రభేదాగమం ప్రకారం ఈశ్వరుడి వెయ్యో అంశంగా క్షేత్రపాలకుడు ఉద్భవించాడు.
ఆగమ నియమాల ప్రకారం గ్రామం ఈశాన్యంలో ఆయన ఆలయం ఉండాలి.
*ఆయన స్వరూపాలు :*
• నల్లని శరీరంతో, గుండ్రటి కన్నులతో, కపాలమాలతో భైరవవాహనంపై ఉగ్ర రూపం.
• సాత్త్విక – శాంతముఖం, అభయ–వరద ముద్రలు.
• రాజసిక – ఎర్రవర్ణం, ఉగ్రముఖం, ఆరు చేతులు.
• తామసిక – నల్లవర్ణం, మూడు కన్నులు, ఎనిమిది చేతులు.
*శ్రీవిద్యార్ణవ తంత్రం ప్రకారం ఆయనకు ఎనిమిది కింకరులు ఉన్నారు :*
*అనల,*
*అగ్నికేశ,*
*కరాళ,*
*ఘంటికారవ,*
*మహాకోప,*
*పిశితాశ,*
*పింగాక్ష,*
*ఊర్ధ్వకేశ.*
క్షేత్రపాలకుడు ఆలయానికి, గ్రామానికి ప్రధాన రక్షకుడు.
తొలుత ఆయన పూజ చేసి తర్వాతే ప్రధాన దేవుని పూజ చేయాలి.
కొన్ని క్షేత్రాల్లో శివుడికి విష్ణువు, విష్ణువుకు శివుడే క్షేత్రపాలకుడిగా ఉంటారు.
తిరుమలలో రుద్రశిల,
పంచారామాల్లో విష్ణువు,
భద్రాచలంలో ఆంజనేయుడు,
శ్రీశైలంలో వీరభద్రుడు,
బద్రీనాథ్‌లో ఘంటాకర్ణుడు,
వారణాసి–శ్రీకాళహస్తి–ఉజ్జయినిలో కాలభైరవుడు *క్షేత్రపాలకులు.*
క్షేత్రపాలకుడి దర్శనం, పూజ విశేష ఫలితాలను ప్రసాదిస్తాయి.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
No comments:
Post a Comment