Tuesday, 9 September 2025

 ఓమ్ 

          *మన వేదాలే  ఈశ్వరీయ జ్ఞానం*

      *యజ్ఞవేది వద్ద పతీ పత్నుల స్థానాలు*

     అంతటి గౌరవపాత్రురాలైన గృహిణిని యజ్ఞవేదివద్ద పతికి కుడి వైపున కూర్చొని మంత్ర పూర్వకంగా ఆహుతులివ్వవలెనని ఋషులు నిర్దేశించారు. 

ఉదాహరణార్థం కొన్ని శ్లోకాలు, వాక్యాలు :

1) 
శ్రాద్దే యజ్జే వివాహే చ పత్నీ దక్షిణతః సదాI

2) 
కన్యాదానే వివాహేచ 
ప్రతిష్టా యజ్ఞకర్మణి I
సర్వేషు ధర్మకార్యేషు 
పత్నీ దక్షిణతః స్మృతాII

3) 
శ్లోII దక్షిణే వసతి పత్నీ 
           హవనే దేవతార్చనేI
           శుశ్రూషా రతికాలే చ 
           వామభాగే ప్రశస్యతే ॥

4) 
శ్లో|| శ్రాద్ధే పత్నీ చ వామాంగే.    
           పాదప్రక్షాళనే తథా I
           నాన్దీ శ్రాద్దే చ హోమేచ 
           మధు పర్కేచ దక్షిణే ॥

పై శ్లోకాలన్ని వ్యాఘ్రపాదస్మృతిలోనివి. వీటిలో "దక్షిణతః" అంటే కుడివైపు అని అర్థం.  "వామతః” అంటే ఎడమవైపు అని అర్థం.
        శ్రాద్ధ కర్మ అంటే మృతులకు పెట్టే తద్దిన మని కాదు. శ్రద్ధతో జీవిత మాతా పితరులకు సేవలు చెయ్యట మని అర్ధం.
  
     “పాదప్రక్షాళన క్రియ" అంటే జ్ఞానులకు, యోగులకు, నిజమైన సంన్యాసులకు చేసే అతిథి సేవ - అతిథి యజ్ఞం. రథారోహణ - రథము ఎక్కించేటప్పుడు మాత్రం ఎడమవైపు ఉండాలి. అప్పుడు అదే అనుకూలం. ముందు పతి రథం ఎక్కి
చెయ్యిసాయం ఆందించి పత్నిని పైకి తీసుకోవటం ఎక్కువ అనుకూలం కదా! 

                                                     ✍— సుమ్నార్థి.

No comments:

Post a Comment