Tuesday, 9 September 2025

 *ఒక మంత్రం పరిహారం గా ఎన్ని సార్లు జపించాలి?*
✍️ మాధవి లత
అందరికి అర్థం అయేలా చెప్పుకుందాము..

ఒక వ్యక్తికి జబ్బు చేసింది వైద్యుడు ని కలిశారు అదే జబ్బుతో ఇంకొకరు వచ్చారు వారి ఇరువురి కి ఒకే రకం మందు ఇవ్వరు వారి వయసు శరీర తత్వం వ్యాధి తీవ్రత అలవాట్లు.. ఇలా ఎన్నోరకాల పరీక్షలు అన్ని చేసి వారికి తగిన ఔషదం ఇస్తారు.. మరి ఎన్ని రోజులు మందులు వాడాలి అంటే కొందరికి నెల రోజులు, కొందరికి 3 నెలలకు తగ్గుతుంది కొందరికి రోగం ఒక స్థాయి దాటాక మందులు పెంచడం తగ్గించడం పత్యం మార్చడం అధికంగా డోస్ పెంచడం చేసి జబ్బు తగ్గిస్తారు.. కానీ కొన్ని జబ్బులు జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి అలా వాడుతూ ఉంటేనే వారు ఇబ్బంది లేకుండా బతుకుతారు.. అలానే మంత్రం కూడా వారి వారి పరిస్థితి ని బట్టి కొంత కాలం చేయాలా ఎక్కువ కాలం ఎక్కువ సార్లు చేయాలా లేక. కొన్ని రకాల పరిహారాలు జీవితాంతం జపం చేస్తూనే ఉండాలి అంటే అవును కొన్ని రకాల మంత్రాలు కొన్ని సమస్యలు జీవితాంతం పారాయణ చేస్తూనే ఉండాలి. అప్పుడు వారికి అంతా మంచిగా సాగుతుంది. 

ఉదయం తిన్నాక కూడా మళ్లీ మధ్యాహ్నం కి ఆకలి వేస్తుంది.. రోజుకు మూడు పూటలా తిన్నా మళ్ళీ ఆకలి వేస్తుంది ఎంత ఖరీదు అయిన తిండి తిన్నా మళ్ళీ మరుసటి రోజు ఆకలి వేస్తుంది .  ఒక్కసారి అయినా ఎన్ని సార్లు తిన్నా రోజూ ఆకలి వేస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు అని తినాలి అని ఎప్పుడు అయినా అనుకుంటున్నారా లేదు అక్కడ మీకు ఆహారం యొక్క అవసరం తెలుసు రుచి తెలుసు కనుక ఆసక్తి ,అలాగే సాధన కూడా ఆహారం కన్నా ఎక్కువగా సాధన చేయాలి అంటే దాని రుచి తెలిసి ఉండాలి తెలుసుకోవాలి అంటే ముందు పూజ అనే విధంలో ముందు కళ్ళతో చూస్తే తర్వాత మనసులో మనో నేత్రం తో చూడ గలరు. 

బ్యాంక్ లో చాలా బాలన్స్ ఉంది అది అయిపోయే వరకు లోటు ఉండదు బాగా ఖర్చు చేస్తూ జీవితం గడిచిపోతుంది ఒకనాటికి బాలన్స్ అయిపోతుంది అప్పుడు కష్టపడే  శక్తి లేదు అవకాశం లేదు ఏమీ చేస్తారు ఈ పుణ్యం అనే బాలన్స్ అకౌంట్ లో ఉండటం వల్ల ఎటువంటి దైవ ఆరాధనలు , పుణ్య కార్యాలు,  జపాలు ఏమీ చేయకున్న హాయిగా బతుకుతారు చూసే వాళ్ళు వాళ్ళు ఏమీ చేయకున్న హాయిగా బతుకు తున్నారు మేము ఇన్ని చేస్తున్న మాకు ఏమి మేలు చేసాడు అనుకుంటారు..కొందరు చేసిన పుణ్యం ఎప్పుడూ  నీళ్లు ఇచ్చే భావి లాంటివి, చేరువులాంటిది ఆ పుణ్యం వాళ్లకు తరాలకు ఉపయోగ పడుతుంది కొందరికి వారి పుణ్యం తరిగి పోగానే కళ్ళకు కట్టిన పొరలు తొలగి దేవుణ్ణి వెతుక్కుంటారు కొందరు.

 వాళ్ళు ఎప్పుడో విత్తనం నాటి ఆ చెట్టుని పెంచి ఫలాన్ని అనుభవిస్తున్నారు, మీరు ఇప్పుడు నాటిన మొక్క కూడా చేట్టు అయితే అలానే మీరు ఫలాన్ని పొందుతారు మీరు పొందలేక పోయిన మీ పిల్లలు ఆ పండ్లను అనుభవిస్తారు దేనికి ఫలితం అనేది లేకుండా ఉండదు.

మనము ఎన్నుకున్న నాయకుడిని మనము కలవలేము ప్రోటోకాల్, మనము విరాళాలు ఇచ్చి పెంచిన పీఠాన్ని మనము స్వామిజీని కలవలేము అప్పుడు ఆ కుర్చీ సింహాసనం చేశాము కనుక కానీ దేవుడు మటుకు పిలవగానే వచ్చేయాలి. దేవుడికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది సాధన అనే పద్దతి ద్వారానే వెళ్ళాలి అప్పుడు సత్యం తెలుస్తుంది, మనల్ని సృష్టించిన అమ్మవారు మటుకు ఎప్పుడూ మనతోనే మనలోనే ఉంటుంది అది గుర్తించడం లేదు దెబ్బ తగిలితే బాధ ఉంటుంది కానీ దెబ్బతగిలిన చోట బాధ రూపంలో నీ ప్రాణాలను కాపాడుతుంది, దెబ్బ తగిలిన చోట నొప్పి అనేది లేకపోయినా ఆ బాధ అనేది తెలియని స్థితికిలో ఉంటే ఇంక ఆ మనిషి బతకరు అని అర్థం. 108 సార్లు మంత్రం చదివేసాను ఇంక నా పని అయిపోతుంది అనుకుంటే ఇంక ఏ గోడవకు పోలీసులు కోర్ట్ లు అవసరం లేదు తలా ఇక మంత్రం ఇచ్చేస్తాను వచేయండి. మంత్రం  అనేది ఒక అవిటి వాడు పడిపోకుండా తనకు తాను నడిచే ఊత కర్రలాంటిది.. కర్మను తప్పించు కుంటే అది ఎవరు అనుభవించాలి ఒక పదార్ధం అనేది తయారు చేశారు. పాపం రూపంలో పుణ్యం రూపంలో దాన్ని వినియోగం కూడా  ఉంటుంది. కానీ పశ్చాత్తాపం వల్ల మానసికంగా ఎంతో క్షోభని అనుభవిస్తే అది నీలోని భగవంతుడు గుర్తిస్తారు తప్పుని సరిచేసుకునే అవకాశం ఇస్తాడు అప్పుడు కూడా శిక్ష తగ్గుతుంది కానీ పుర్తిగా వదలదు ఎలా అంటే ఒక చీకటి గుహలో చిన్న దీపం పెడితే అది ఎంత వరకు కాంతిని పంచగలదో అంత వరకే కనిపిస్తుంది కానీ గుహ మిత్తం ఆ చిన్న వెలిగుకి చీకటి తొలగి పోదు. అందుకే జపం కానీ పరిహారం కోసం చేసే సాధన కానీ అధిక సంఖ్యలో చేయిస్తారు. ఒక్క హిందువుల సంప్రదాయం లొనే నియమాలు ఎక్కువ ఎందుకంటే ఇది శక్తి ఈ శక్తిని భరించాలి అన్నా ఫలితం పొందాలి అన్నా శక్తి కావాలి.. నీటి నుండి విద్యుత్తు ని తీసుకున్నాము దాన్ని ముట్టుకోగలమా లేదా నేరుగా వాడుకోగలమా లేదు కదా అది పవర్ దాన్ని నిలువ చేయగల పవర్ స్టేషన్ ఉండాలి అక్కడ నుండి మనకు పవర్ కనెక్షన్ ఉండాలి దాన్ని వినియోగించుకునే దానికి కావాల్సిన వైర్లు ఉండాలి ప్రతి నెలా దాని వినియోగదారులు రుసుము కట్టాలి.. అంటే సాధన  చేస్తూనే ఉండాలి అని అర్థం.

ఇక్కడ పవర్ అంటే అమ్మవారు ఆ పవర్ ని  నిలువ చేసే స్టేషన్ శివయ్య దాన్ని ఉపాసన అనే సాధనతో వినియోగించు  కోవాలి.. అయితే ప్రకృతి నుండి ఈ పవర్ ని తీ

సి అందరికి అంధించే వారే మార్గదర్శనం చేసే గురువులు. ఇప్పుడు మోడరన్ యుగంలో ఎవరికి వారు సోలార్ పెట్టేసుకుని పవర్ తీసుకుంటున్నారు కానీ అది కూడా పవర్ యే మన కరెంట్ ఏ కదా అని ప్లగ్ లో వేలు పెడితే షాక్ కొడుతుంది ఎలా పవర్ అనేది ఉన్నా జాగర్తగా ఉండాలి.. ప్రపంచాన్ని నడిపించే శక్తి అనేది ఎప్పుడూ ఉంటుంది నువ్వు ఫ్యాన్ ద్వారా తెచ్చే గాలి తాత్కాలికంగా తిరిగినంత సేపు కానీ దేవుడు ఇచ్చిన గాలి శాశ్వతంగా ఉంటుంది భగవంతుడు పెద్ద శాస్త్రవేత్త ఆయన్ని కనిపెట్టాలి అనుకున్న వాళ్ళు ఆయనలోనే కలిసి పోయారు అదే మోక్షం. నీ కంటికి కనిపించని శక్తి సృష్టిని నడిపిస్తుంది అన్నది ఎంత సత్యమో నీచుట్టూ నీలో భగవంతుడు ఉన్నాడు అనేది కూడా అంతే సత్యం నీలో ఉన్న పవర్ ని ఎలా వినియోగించు కుంటావు అనేది నీ ఇష్టం.. అందరిలో అదే శక్తి ఉందా అంటే అందరిలో అదే శక్తి ఉంది నీచేతికి నిప్పు అనే పవర్ ఇచ్చారు అనుకోండి దాంతో వంట చేసుకుంటావా దీపం పెట్టుకుంటావా ఇల్లు తగల బేట్టుకుంటావా నీ బుద్దికె వదిలేస్తారు భగవంతుడు ,దాని పరిణామం నువ్వే అనుభవిస్తావు వాడికి మంచి అగ్ని ఇచ్చి నాకు చెడ్డ అగ్ని ఇచ్చాడు దేవుడు అంటే వాడు ముర్కుడు అంతే. నీలోనే శివుడు అనే పవర్ స్టేషన్ ఉంటుంది, ఉపాసించే  సాధకుడు ప్రకృతి అనే పవర్ ని అందులో నింపుకోవాలి తర్వాత ఆ పవర్ ని వినియోగించే తెలివి ధ్యానం ద్వారా  పొందాలి. అందరికి అర్థం అవ్వాలి అని ఇలాంటి ఉపమానాలతో చెప్పాను.

No comments:

Post a Comment