*అనుశాసన పర్వం 115 వ అధ్యాయము*
16) సర్వే వేదా న తత్ కుర్యుః సర్వే యజ్ఞాశ్చ భారత।
యో భక్షయిత్వా మాంసాని పశ్చాదపి నివర్తతే ॥
భారతా! ముందు మాంసాన్ని తింటున్నా, తరువాత దానిని విడిచిపెట్టినవాడు పొందే ఫలాన్ని సర్వవేదాలు కానీ,సర్వయజ్ఞాలు కానీ అందించలేవు.
17) దుష్కరం చ రసజ్ఞానే మాంసస్య పరివర్జనమ్ |
చర్తుం వ్రతమిదం శ్రేష్ఠం సర్వప్రాణ్యభయప్రదమ్ ॥
మాంసం రుచి చూసిన తరువాత దానిని విడిచిపెట్టడం, సర్వప్రాణులకు అభయదాయకమైన అహింసా వ్రతాన్ని పాటించటం ఎంతో దుష్కరమైన వ్రతం.
18) సర్వభూతేషు యో విద్వాన్ దదాత్యభయదక్షిణామ్ |
దాతా భవతి లోకే సః ప్రాణానాం నాత్ర సంశయః II
సర్వప్రాణులకూ అభయమిచ్చిన విద్వాంసుడు లోకంలో నిస్సంశయంగా ప్రాణదాత అవుతాడు.
19) ఏవం వై పరమం ధర్మం ప్రశంసంతి మనీషిణః।
ప్రాణా యథా2_2_త్మనో 2 భీష్టాః భూతానామపి వై తథా ॥
ఈ రీతిగా ధీమంతులు అహింసావ్రతాన్ని పరమ ధర్మంగా పరిగణిస్తారు. ప్రాణాలు తన కిష్టమైనట్లే సమస్త ప్రాణులకు కూడా ఇష్టమైనవే.
20,21) ఆత్మౌపమ్యేన మంతవ్యం బుద్ధిమద్భిః కృతాత్మభిః |
మృత్యుతో భయమస్తీతి విదుషాం భూతిమిచ్ఛతామ్ || 20
కిం పునర్హన్యమానానాం తరసా జీవితార్థినామ్ |
అరోగాణామపాపానాం పాపైర్మాంసోపజీవిభిః ॥ 21
బుద్ధిమంతులు, పుణ్యాత్ములు సమస్త ప్రాణులనూ తమవలెనే భావించాలి. తమ శ్రేయస్సును కోరుకొనే పండితులకు కూడా మృత్యువంటే భయమే. ఆస్థితిలో బ్రతుకు మీద ఆశ ఉండి కూడా మాంస జీవనులైన పాపాత్ములచే చంపబడే ప్రాణులకు భయముండదా? పైగా అవి ఏరోగమూ
లేనివి, ఏ తప్పు చేయనివి.
22) తస్మాద్ విద్ధి మహారాజ మాంసస్య పరివర్జనమ్
ధర్మస్యాయతనం శ్రేష్ఠం స్వర్గస్య చ సుఖస్య చ ||
కాబట్టి మహారాజా! మాంస పరిత్యాగం ధర్మానికి,
స్వర్గప్రాప్తికి, సుఖసిద్ధికి ఉత్తమ సాధనం.
39) అఖాదన్ననుమోదంశ్చ భావదోషేణ మానవః ॥
యోనుమోదతి హన్యంతం సోపి దోషేణ లిప్యతే ॥
మాంసాన్ని తినకపోయినా తినేవారిని ఆమోదించిన వాడు భావదోషం వలన మాంసభక్షణ పాపాన్ని పొందుతాడు. అలాగే చంపేవాడిని ఆమోదించినవానికి కూడా హింసాదోష మంటుతుంది.
41) హిరణ్యదానైర్గోదానైః భూమిదానైశ్చ సర్వశః |
మాంసస్యాభక్షణే ధర్మః విశిష్ట ఇతి నః శ్రుతిః ||
సువర్ణదానం కన్న, గోదానం కన్న, భూదానం కన్న మాంసాన్ని తినకపోవటం విశిష్ట ధర్మ మని మేము విన్నాం.
42) దకస్య కృతే జూన్ యో హన్యాత్ పురుషాధమః।
మహాదోషతరస్తత్ర ఘాతకో న తు ఖాదకః ॥
మాంసం తినేవారి కోసం పశుహత్య చేసేవాడు
నరాధముడు. మాంసంతినే వాని కన్న ఎక్కువ పాపం చంపిన వానికే చెందుతుంది.
43) ఇజ్యాయజ్ఞశ్రుతికృతైః యో మార్టెరబుదో 2 ధమః।
హన్యాజ్జంతూన్ మాంసగృధ్నుః స వై నరకభాజ్వరః ||
మాంసలోభియై, మూర్ఖుడై యజ్ఞయాగాది వైదిక మార్గాల పేరుతో ప్రాణిహింస చేసే వాడు అధముడు. వాడు నరకాన్ని పొందుతాడు.
44) భక్షయిత్వాపి యో మాంసం పశ్చాదపి నివర్తతే ||
తస్యాపి సుమహాన్ ధర్మః యః పాపాద్ వినివర్తతే ॥
ముందు మాంసం తినే అలవాటున్నా, తరువాత దానిని విడిచిపెట్టిన వానికి మహాధర్మఫలం లభిస్తుంది. అతడు పాపవిముక్తు డవుతాడు.
45) ఆహర్తా చానుమంతా చ విశస్తా క్రయవిక్రయీ |
సంస్క ర్తా చాపభోక్తా చ ఖాదకాః సర్వ ఏవ తే ॥
పశువును తెచ్చినవాడు, అనుమతించినవాడు, చంపినవాడు, అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, తిన్నవాడు వీరందరూ
మాంసం తిన్నట్లే.
49) శ్రూయతే హి పురా కల్పే నృణాం వ్రీహిమయః పశుః।
యేనాయజంత యజ్వానః పుణ్యలోకపరాయణాః ॥
పూర్వకల్పంలో మనుష్యులు యజ్ఞంలో అన్నాన్నే
(పురోడాశాదులు) పశువుగా వినియోగించేవారు.
పుణ్యలోక పరాయణులైన యజమానులు దానితోనే యాగం చేసేవారు.
50) ఋషిభిః సంశయం పృష్టః వసుశ్చేదిపతిః పురా |
అభక్ష్యమపి మాంసం యః ప్రాహ భక్ష్యమితి ప్రభో ॥
రాజా! గతంలో ఈ విషయమై ఋషులు చేదిరాజైన
వసువును తమ సందేహాన్ని గూర్చి అడిగారు. ఆయన తినదగని మాంసాన్ని తినదగినదనే చెప్పాడు.
51) ఆకాశాదవనిం ప్రాప్తః తతః స పృథివీపతిః |
ఏతదేవ పునశ్చోకా వివేశ ధరణీతలమ్ ॥
ఆ అనుచిత నిర్ణయం వలన ఆ రాజు ఆకాశం నుండి
నేలకు దిగజారాడు. మరలా అదే మాట అని, ఇక్కడ నుండి పాతాళానికి చేరుకొన్నాడు.
52) ఇదం తు శృణు రాజేంద్ర కీర్త్యమానం మయానఘ I
అభక్షణే సర్వసుఖం మాంసస్య మనుజాధిప ॥
అనఘా! రాజేంద్రా! మనుజాధిపా! నేను చెపుతున్నాను, విను మాంసాన్ని తినకపోవటమే సర్వసుఖం.
53) యస్తు వర్షశతం పూర్ణం తపస్తప్యేత్ సుదారుణమ్।
యశ్చైవ వర్జయేన్మాంసం సమమేతన్మతం మమ ॥
నిండు నూరు సంవత్సరాలు దారుణ తపస్సు నాచరించిన వాడు, మాంసభక్షణాన్ని పరిత్యజించినవాడు-ఇద్దరూ సమానమే అని నా అభిప్రాయం.
63-67) శ్యేనచిత్రేణ రాజేంద్ర సోమకేన వృకేణ చ
| రైవతే రంతిదేవేన వసునా సృంజయేన చ ॥
ఏతైశ్చాన్యైశ్చ రాజేంద్ర కృపేణ భరతేన చ
దుష్యంతేన కరూషేణ రామాలర్కనరైస్తథా ॥
విరూపాశ్వేన నిమినా జనకేన చ ధీమతా।
ఐలేన పృథునా చైవ వీరసేనేన చైవ హ ॥
ఇక్ష్వాకుణా శంభునా చ శ్వేతేన సగరేణ చ।
అజేన ధుంధునా చైవ తథైవ చ సుబాహునా ॥
హర్యశ్వేన చ రాజేంద్ర క్షుపేణ భరతేన చ
ఏతైశ్చాన్యైశ్చ రాజేంద్ర పురా మాంసం న భక్షితమ్ ||
రాజాఏంద్రా! శ్యేనచిత్రుడు, సోమకుడు, వృకుడు,
రైవతుడు, రంతిదేవుడు, వసువు, సృంజయుడు, ఇతర రాజులు, కృపుడు, భరతుడు, దుష్యంతుడు, కరూషుడు, *రాముడు* , అలర్కుడు, నరుడు, విరూపాశ్వుడు, నిమి, ధీమంతుడైన
జనకుడు, పురూరవుడు, పృథువు, వీరసేనుడు, ఇక్ష్వాకుడు, శంభువు, శ్వేత సాగరుడు, అజుడు, దుంధువు, సుబాహువు, హర్యశ్వుడు, క్షుపుడు, భరతుడు ఈ రాజులు, ఇంకా ఇతర రాజులు మాంసాన్ని తినలేదు. (63-67)
👆మహాభారతం లోని మాంసాహారం తినకూడదు అనటానికి రిఫరెన్స్ లు.
No comments:
Post a Comment