*మా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులకు శ్రావణమాస శుభాకాంక్షలు* *_మాధవ కొల్లి* అజ్ఞాన శోషణము- శ్రావణము
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే|
శరణ్యే త్య్రంబికే దేవి నారాయణి నమోస్తుతే ||
అని ముందుగా శ్రావణమాసానికి అధిష్ఠాన దేవత అయిన అమ్మవారిని స్తోత్రం చేసుకుందాం.
శ్రవణా నక్షత్రంలో పూర్ణిమ ఉంటే, పూర్ణిమ నాడు శ్రవణం అనే ఒక నక్షత్రం ఉంటే దానికి శ్రావణమాసం అని పేరు. దీనిని గురించి శౌనకసంహిత అనే సంహితలో శౌనకమహర్షి యిది శక్తిమయమని, అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసమని, ఈ కాలంలో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వర్ణించాడు. శ్రావణ మాసంలో ఇటు మహాలక్ష్మిని, మహాకాళిని యిద్దరినీ కూడా ఉపాసన చేయాలి. ఇలా చేస్తే ఏక కాలంలో సంపదలు, శారీరిక - మానసిక శక్తులు రెండూ కూడా వచ్చే పవిత్రమాసం శ్రావణ మాసం. శ్రావణమాసం ప్రారంభ మాసం. శ్రావణమాసం లక్ష్మీదేవికి, గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము.
శ్రావణమాసంలో భగవన్నామ స్మరణము వలన భయంకరమైన అజ్ఞానం తొలగిపోతుందని భవిష్య పురాణం చెపుతున్నది.
No comments:
Post a Comment