Tuesday, 9 September 2025

 *సుమతీ శతకము*

*మానధను డాత్మధృతి చెడి హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్‌ మానెడు జలముల లోపల నేనుగు మెయి దాచినట్టు లెఱుగుము సుమతీ!*

భావం: అభిమాన శ్రేష్టుడు మనోధైర్యముచెడి అల్పుని ఆశ్రయించుట మానెడు నీళ్ళలో ఏనుగు తన శరీరమును మఱుగు పరచినట్లుండును.

*రాపొమ్మని పిలువని యా భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే దీపంబు లేని యింటను జేపున కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ!*

భావం: దీపములేని గృహమునందు చేవుణికీళ్ళాట ఆడుకొనుట ఎట్లు నిశ్ప్రయోజనమో (ఆనంద ప్రదము ఎట్లుకాదో) ఆ విధముగనే రమ్మనిగాని, పొమ్మని కాని చెప్పని రాజును సేవించుటవలన జీవనమూ లేదు. మోక్షమూ లేదూ వట్టి నిశ్ప్రయోజనము.

*రూపించి పలికి బొంకకు, ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో, గోపించు రాజు గొల్వకు, పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ!*

భావం: సాక్షుల మూలముగా నిర్ధారణ చేసి అబద్ధమును నిజమని స్థిరపరచుట, ఆప్తబంధువులను నిందించుట, కోపినిని సేవించుట పాపభూమికి వెళ్ళుట ఇవి తగని పనులు. కాన ఈ విషయములలో జాగ్రత్త వహింపుడు.         

No comments:

Post a Comment