*☘️🌹🙏దక్షిణాయన పుణ్యకాలం🙏🌹☘️*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
మంచి కాలాలను రెండు రకాలుగా చెపుతారు.
ఒకటి శుభకాలం.
రెండు పుణ్యకాలం.
ఏదైనా ఒక కార్యం తలపెట్టేప్పుడు పంచాంగం చూసి మంచి తిధి,వార, నక్షత్రాలను చూసి నిర్ణయించేది
శుభ కాలం.
శుభకాలం అనేది మనం చూసి ఎన్నుకునేది.
అలా కాకుండా గ్రహాల సహజ స్ధితిగతులను బట్టి ఏర్పడే కాలాన్ని పుణ్యకాలం అంటారు.
సూర్యగ్రహణం
చంద్రగ్రహణం మనం చూసి
ఎన్నుకొన్నందువలన రావు.
గ్రహణాలు గ్రహస్ధితి వలన సహజంగా ఏర్పడతాయి.
అందువలన గ్రహణాలు పుణ్యకాలాలుగా పిలువబడుతున్నాయి.
సూర్యుడు ఉత్తర దిశగా పయనం మొదలుపెట్టిన నాటినుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
పుష్య మాసంలో మొదలయ్యే
ఉత్తరాయణం పుష్య,
మాఘ , ఫాల్గుణ, చైత్ర, వైశాఖ , జ్యేష్ట ఆరు మాసాలపాటు కొనసాగుతుంది.
అషాఢమాస శుధ్ధ పాడ్యమి నుండిసూర్యగమనం ఉత్తరదిశ నుండి దక్షిణానికి మళ్ళుతుంది. అప్పటినుండి అది దక్షిణాయనం.
ఆషాఢం, శ్రావణం, భాద్రపదం
ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, ఆరు మాసాలు సూర్యుడు
దక్షిణ దిశగా పయనిస్తాడు.
ఉత్తరాయణ, దక్షిణాయన
రెండు కాలాలు కలసి మనకు ఒక సంవత్సర కాలం అయితే ఆ కాలం దేవతలకి
ఒక రాత్రి ఒక పగలుగా
భావింపబడుతున్నది.
దీనికి విజ్ఞాన పూర్వకంగా
ఒక వివరం చెప్తారు.
దేవలోకం ఆనేది భూమి కి ఉత్తర ధృవాన పైన వున్న
మేరు పర్వతం లో వున్నదని శాస్త్రాలు తెలుపుతున్నవి.
ఉత్తరాయణకాలం ఆరు మాసాలు ఉత్తరధృవం సూర్యుని దిశగా వున్నందున
ఆ ధృవ ప్రాంతంలో ఆరుమాసాల కాలం పగలుగా
వుంటుంది.
దక్షిణాయన కాలంలో ఆరు మాసాలు దక్షిణ ధృవం సూర్యుని దిశగా వుంటుంది.
ఆ సమయంలో ఉత్తర ధృవం రాత్రిగా వుంటుంది.
దక్షిణాయనం ప్రారంభమయ్యే ఆషాఢమాసంలో
పాడ్యమి తిధినాడు పితృ దేవతలకు తర్పణాలు యిస్తారు.
ఉత్తరాయణ పుణ్యకాలంలో
పగలు పొద్దు ఎక్కువగాను
రాత్రులు కొంచెం తక్కువగాను
వుంటాయి.
ఉష్ణోగ్రత ఎక్కువగా వుండే కాలంగా ఉత్తరాయణం వుంటుంది. పుష్యమాసం మొదటి రోజు పాలు పొంగించి సూర్యుని ఆరాధించి
ఉత్తరాయణం కాలం ఆరంభిస్తారు.
దక్షిణాయన కాలంలో
పగటి పూట కంటే రాత్రి
ఎక్కువగా వుంటుంది.
శీతాకాలం దక్షిణాయనంలోనే గడుస్తుంది.
దక్షిణాయనం ఆషాఢ మాస ప్రధమ దినమున గృహిణులు కొబ్బరి పాలతో భగవంతునికి నివేదనలు చేస్తారు.
ఈ సమయంలో పగటిపూట
కంటే సాయంకాల సమయమే ఉత్సవాలకి తగిన కాలంగా
వుంటుంది. దేవతల సాయంకాలం దక్షిణాయనంలో రావడం వలన అనేక పండుగలు
దక్షిణాయనంలోనే రావడం గమనించవచ్చును.
శుక్రవార వ్రతాలు, ముఖ్యంగా,
అంబిక, మహాలక్ష్మి ,ఆండాళ్
కళ్యాణం, వరలక్ష్మీ వ్రత పూజలు, దేవీ
నవరాత్రుళ్ళు ,
మొదలైన స్త్రీ దేవతల పండుగలు ఈ కాలంలోనే వస్తాయి.
ఉత్తరాయణ ,
దక్షిణాయనకాలాలకి అధిదేవతలు
వున్నారు. ఆ దేవతలకి
ప్రత్యేకలోకాలు వున్నవని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
భగవద్గీతలోని 8వ అధ్యాయం లో నాలుగవ
శ్లోకంలో కృష్ణుడు వివరించాడు.
కాంతి లోకం, పగటి దేవత లోకం.శుక్లపక్ష దేవత లోకం.
ఉత్తరాయణ దేవత లోకం దాటి వెళ్ళే బ్రహ్మజ్ఞానులు
పరబ్రహ్మాన్ని చేరుకుంటారు.
వారు తిరిగి భూలోకంలో జన్మించరు. తరువాత వచ్చే 25 వ శ్లోకంలో కృష్ణుడు
వివరించాడు. పుణ్యం చేసుకున్న సజ్జనులు
వెళ్ళే లోకం , రాత్రి దేవత లోకం. బహుళ పక్ష దేవతలోకం. దక్షిణాయన దేవత లోకం. ఆ లోకాలు దాటి
వెళ్ళి చంద్రునికి సంబంధించిన
కాంతిని పొంది భూలోకంలో
తిరిగి జన్మిస్తారు.
ఈ విధంగా వైకుంఠం చేరుకునేవారు ఉత్తరాయణకాల దేవతా లోకం ద్వారా సద్గతులు పొందుతారు...
సేకరణ..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment