*ఆచార్య సద్భోదన*
➖➖➖✍️
```
ప్రార్ధన అంటే నోటితో అనేదీ కాదు. లోపల్లోపల అనుకునేదీ కాదు.
మనసుతో చేయాలి ప్రార్ధన. ప్రార్ధన మనసులో మెదలి నప్పుడు ప్రేమ జాలువారాలి. ఆర్ద్రమైన మనసులో భక్తి వెల్లువై కన్నీరు కాల్వలు కట్టాలి. గుండెగూడులో నుంచి చీకటి పారిపోవాలి. దివ్య కాంతితో నిండిపోవాలి. ఆ దివ్య ప్రభువు స్మృతితో, ఆయన కురిపించే కరుణామృత కాంతివర్షంతో నీ చిన్ని గుండె పులకించి నిండిపోవాలి. పండిపోవాలి.
నీ భవరోగాలకు, నీ మనసు గాయాలకు, నీ తీరని కోర్కెల బాధలకు ఏ మందు వేయాలో ఆయనకు తెలుసు. తీపి మందే కావాలని మారాము చేయకు. ఏదిచ్చినా స్వీకరించే దాసునిగా ఆ విశ్వప్రభుని ముందు వినమ్రతతో మోకరిల్లు.
నీ పాత్ర... నీగుండెపాత్రను ఆయన ముందు ఖాళీగా ఉంచడం వరకే సుమా!
ఇది కావాలి అని యాచించకు. ఇదే ఇమ్మని సూచించకు. ఆయన ఏది అనుగ్రహిస్తే అదే మహద్భాగ్యమనుకో.
అదిగో ఆ దివ్యభావనే ఒక కాంతి పుంజమై నీ గుండెగిన్నె నిండిపోతుంది. ఒళ్ళంతా పులకరించేలా ఆ దివ్యత్వం నిండడమే కాదు, పొంగిపొరలుతుంది. నీ చుట్టుపక్కలకూ వ్యాపిస్తుంది. అదే ఆలోచన, అదే ఆలాపన, అదే ధ్యాస. అదిగో అదే ధ్యానం. అదే ప్రార్ధన!!✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
No comments:
Post a Comment