విశ్వనాథ వారి ఉద్యోగం!
--
విశ్వనాథ సత్యనారాయణ గారి ఉద్యోగజీవితం గూర్చి నా చిన్నప్పుడు ప్రచారమైన ఒక ఇతివృత్తం.
ఆయన విజయవాడ యస్.ఆర్.ఆర్. కాలేజ్ లో ఉపన్యాసకుడుగా ఉన్నారు. ఆ కాలేజ్ నూజివీడు రాజా వారు
శ్రీM.R అప్పారావు గారుకట్టించినది.
.
విశ్వనాథ వారు చాలా ధీమాతో జీవించిన వ్యక్తి. ఆయన ఉద్యోగం లోని డిపార్ట్మెంటల్ హేడ్ కి ఆయన వైఖరి నచ్చేది కాదు. పాఠాలు చెప్పటం లోనే కానీ ఇతర విషయాలలో కానీ విశ్వనాథ వారు ఎవరినీ లెక్క చెయ్యని రీతి లో ఉండే వారు. వీరెవరైనా సలహా ఇవ్వబోయినా దానిని పాటించ వాచ్చు, పాటించక పోవచ్చు. నాకు ఈ మాత్రం తెలియదా ? అన్నట్లు ప్రవర్తించే వారట. దానితో ఆ కాలేజ్ లో ఒక అధికారి రాజా వారి వద్దకి వెళ్లి
.
"సత్యనారాయణ గారు ఎవరినీ లెక్క చెయ్యటం లేదని,పాఠాలు సరిగా చెప్పటం లేదనీ కంప్లైంట్ చేశారు.
దానికి రాజా వారు నవ్వి "అయ్యా ! ఇంతకీ మనం ఆయనకి దేనికి ఉద్యోగ మిచ్చినట్టు ? అన్నారట.
.
"దేనికేమిటి నాయన గారు ! అందరి లాగానే పాఠాలు చెప్పటానికి" అన్నారట. (నూజివీడు రాజాలని అందరూ నాయన గారు అంటారు లెండి)
.
"అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. పాఠాలు చెపటానికి విశ్వనాథ సత్యనారాయణ గారే కావాలా ?"అన్నారు రాజా గారు.
"మరి ఇంకెందుకండీ " అన్నారు పాపం ఆ అధికారి.
.
"అయ్యా ! పాఠాలు చెపటానికి మనకి యం.ఏ. చదివిన వారు ఎవరైనా చాలు. కానీ ఆయనకి దేనికి ఉద్యోగ మిచ్చామో తెలుసా ? విశ్వనాథ సత్యనారాయణ గారికి ఉద్యోగ మిచ్చిన కాలేజీ అనే గొప్పదనం మన కాలేజీకి దక్కాలి . అందుకోసమే కానీ కేవలం పాఠాలు చెప్పటం కోసం కాదు . ఆయన జోలికి పోకండి. ఆయనని గౌరవించి ఉపయోగించుకోండి" అన్నారట రాజా గారు.
No comments:
Post a Comment