_*తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం:--6*_
🕉️🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️
_*16. మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు?*_
సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరి తనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చెయ్యటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నియమం పనికి రాదు. ఇలా చెయ్యటం వల్ల మరింత ధనం పోతుంది.
_*17. అలిగి అత్తగారింటికి, చెడిపోయి చెల్లెలింటికి వెళ్ళకూడదని ఎందుకంటారు?*_
పూర్వం కొడుకుని సరయినదారిలో పెట్టలేకపోతే, సంవత్సరకాలం పాటు అత్తగారింటికి పంపేవారు. అంటే అప్పట్లో అది శిక్షతో సమానము., తన వారి మీద అలిగి అత్తగారింటికి వెళితే ఎవరైనా సరే తన ఆర్థిక స్వేచ్ఛను, సాంఘిక స్వేచ్ఛను, మానసిక ఆనందాన్ని కోల్పోతారు. అలాగే చెడిపోయి చెల్లెలింటికీ వెళ్ళరాదు. ఆడపిల్ల పుట్టింటి నుంచి ప్రేమానురాగం, ధనమూ ఆశిస్తుంది. అటువంటి చెల్లిలి ఇంటికెళ్ళి ఆ మూడు ఆమె నుంచి ఆశించటం వల్ల చులకనవుతారు. కాని వాస్తవానికి చులకనయ్యేది మనమే కాదు, అత్తగారింట్లో ఉన్న చెల్లి కూడా!
_*18. కుంకుడూ, మామిడీ, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?*_
ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు, నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్లు గృహ యజమాని జాతకానికి సరిపోవు. అందుకే సర్వసమ్మతమైనవీ, గృహావసరాలకి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు. పై చెట్లు పెంచాలనుకుంటే మీ మీ జాతకాల ప్రకారం నక్షత్రాలు ప్రకారం సరిచూసుకుని పెంచుకోండి.
_*꧁ॐ┈┉━❀꧁ॐ꧂❀━┅┈ॐ꧂*_
_*సర్వేజనా సుఖినోభవంతు-శుభమస్తు.*_
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
No comments:
Post a Comment