Tuesday, 9 September 2025

 *ఎవరు బ్రాహ్మణుడు?*                                  *మహాభారతం వన పర్వం 313 అధ్యాయము*

*యక్ష ఉవాచ*

107) రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా!
బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబ్రూహ్యేతత్ సునిశ్చితమ్ || 

యక్షుడిలా అన్నాడు.
రాజా! బ్రాహ్మణత్వం కుల, వృత్త, స్వాధ్యాయ,
పాండిత్యాలలో దేనివలన సిద్ధిస్తుంది. నిశ్చితంగా చెప్పు. 

యుధిష్ఠిర ఉవాచ

108) శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో న చ శ్రుతమ్ |
కారణం హి ద్విజత్వే చ వృత్తమేవ న సంశయః ॥
యుధిష్ఠిరుడిలా అన్నాడు.

నాయనా! యక్షా! విను. కులంగానీ, స్వాధ్యాయం కానీ, పాండిత్యం కానీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావు. వృత్తమే
దానిని కారణం. సందేహం లేదు. 

109) వృత్తం యత్నేన సంరక్ష్యం బ్రాహ్మణేన విశేషతః ॥
అక్షీణవృత్తో న క్షీణః వృత్తతస్తు హతో హతః ॥

బ్రాహ్మణుడు ప్రత్యేక ప్రయత్నంతో ఆచారాన్ని
కాపాడుకోవాలి. ఆచారం క్షీణించనివాడు క్షీణించడు. ఆచారం నశిస్తే ఆచారి నశించినట్లే. 

110) పాఠకాశ్చైవ యే చాన్యే శాస్త్ర చింతకాః ॥
సర్వే వ్యసనినో మూర్ఖః యః క్రియావాన్ స పండితః || 

చదివేవారు కానీ, చదివించేవారు కానీ శాస్త్రవిచారం  చేసేవారు కానీ  అంతా వ్యసనపరాయణులూ,మూర్ఖులే.ఆచరించేవాడే పండితుడు 

111) చతుర్వేదో 2 పి దుర్వృత్తః స శూద్రాదతిరిచ్యతే!
యోగ్నిహోత్రపరో దాంతః స బ్రాహ్మణ ఇతి స్మృతః

*నాల్గువేదాలు చదివిన వాడైనా ఆచరణ సరిగా లేకపోతే శూద్రునికన్నా హీనుడే. అగ్నిహోత్రతత్పరుడై, జితేంద్రియుడైనవాడే బ్రాహ్మణుడు.*

No comments:

Post a Comment