*_సామాజిక న్యాయమా.._*
*_కుళ్లిపోయిన కాయమా..!_*
✍️✍️✍️✍️✍️✍️✍️
*_ఈ దేశంలో_*
*_సామాజిక న్యాయమా.._*
అదెలా సాధ్యం..
కులాలు..మతాలు..
ఆర్థిక అంతరాలు..
*_ఇవన్నీ అంతరాయాలు..!_*
స్వతంత్రం వచ్చాక
ఎన్నో సాధించామని బీరాలు..
సామాజిక న్యాయంలో
మాత్రం బేరాలు..
చాలా చేశామని
చెప్పుకునే నేతల
విఫల రాయబారాలు!
నిన్ను కొట్టి నాకు..
నన్ను కొట్టి ఇంకొకరికి..
మనిద్దరి కడుపు కొట్టి
సొంత లాభం..
ఇది కొంతైనా మానడం
దుర్లభం...
ఇలాగైతే సామాజిక న్యాయం
ఎప్పటికీ అందని మావే..
అది సామాన్యుడికి
సదా పులుపే..
*_ఇదంతా చెవిటోడి ముందు_*
*_చేసే పిలుపే.._*
*_పెద్దోడి బలుపే..!_*
సొరాజ్యం వచ్చిన పొద్దు
చూస్తున్నది..చేస్తున్నది అదే..
పేదోడు అక్కడే ఉంటే..
పెద్దోడు ఎదిగిపోతున్నాడు..
అంతకంతకూ పెరిగిపోతూ..
*_అబ్బా అంటే అంబానీగా.._*
*_అదేంటంటే అదానీలా..!_*
అభివృద్ధి..
సామాజిక న్యాయం..
సమధర్మం..
అదేమి ఖర్మం..
నేతల మర్మం..
మొత్తమంతా మాయ..
మసిపూసి మారేడుకాయ..
యువకుల శక్తికి..
భవితవ్యానికి
ఇక్కడ తిలోదకాలు..
పేరుకే ప్రజలది రాజ్యం..
పెత్తందార్లదే భోజ్యం..
గాంధి పుట్టిన దేశం..
నెహ్రు కోరిన సంఘం..
సామ్యవాదం...రామరాజ్యం
సంభవించే కాలమా..!
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
7995666286
No comments:
Post a Comment