Thursday, 26 March 2026

 [2/17, 19:41] +91 94918 93164: మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు??

ఒకప్పుడు భారత సంస్కృతిలో సంవత్సరానికి 365 పండుగలు ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే ప్రతీరోజూ వేడుక చేసుకోవటానికి వారికొక సాకు అవసరమయ్యేది. ఈ 365 పండుగలు వేర్వేరు కారణాలకి ఇంకా జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం సూచించబడ్డాయి. వారు వివిధ చారిత్రక సంఘటనలు, విజయాలుకు సూచనగా లేదా విత్తనాలు నాటడం ఇంకా పంటకోత వంటి జీవితంలో కొన్ని సందర్భాలను వేడుకగా జరుపుకునేవారు. ప్రతీ సందర్భానికి ఒక పండుగ ఉండేది. కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రతి నెలా వచ్చే శివరాత్రిని ‘మాస శివరాత్రి’ అని పిలుస్తాము. కానీ, మాఘ మాసంలో వచ్చే ‘మహా శివరాత్రి’ కి ఉన్న ప్రత్యేకత అపారం. ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ఈ రాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విశ్వంలోని గ్రహాల అమరిక వల్ల ఈ రోజున మానవ శరీరంలో శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. అందుకే ఈ రాత్రి చేసే జాగరణ, పూజ కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని భక్తుల విశ్వాసం.

ప్రతీ చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి – మార్చ్ లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మిమల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే, ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ పరిస్థితులలో నివసించేవారు, మహాశివరాత్రిని శివుని పెళ్లిరోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు, ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు.
కానీ సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాష పర్వతంతో ఒకటయిన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో, పర్వతంలా అయిపోయాడు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు.
శాస్త్రీయ మరియు ఖగోళ విశిష్టత: ఖగోళ శాస్త్రం ప్రకారం, మహా శివరాత్రి నాడు భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో గ్రహాల స్థితి అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున భూమికి ఉండే అయస్కాంత శక్తి వల్ల వెన్నెముక నిటారుగా ఉంచి జాగరణ చేయడం వల్ల శరీరంలోని ‘కుండలినీ శక్తి’ అప్రయత్నంగానే మూలాధారం నుంచి సహస్రార చక్రం వైపు ప్రయాణిస్తుంది. ఇది మనిషిలో మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది.
ఉపవాసం, జాగరణ ప్రాముఖ్యత: మహా శివరాత్రి నాడు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా ‘శివనామస్మరణ’తో జాగరణ చేస్తారు. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. ఇతర శివరాత్రుల కంటే ఈ రోజున చేసే ధ్యానం పదివేల గంగా స్నానాలతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే రాత్రి కాబట్టి దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు.
మహా శివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మనల్ని మనం పునరుద్ధరించుకునే ఒక గొప్ప అవకాశం. భక్తితో శివుని కొలిచి, నియమ నిష్ఠలతో ఆ రాత్రిని గడపడం వల్ల మనసులోని అశాంతి తొలగి, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది.
ఇతిహాసాలను పక్కన పెడితే , ఈ రోజు ఇంకా రాత్రికి యోగ సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత , ఆధ్యాత్మిక సాధకునికి ఇది కల్పించే అవకాశాలు వలన వచ్చిందే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తరువాత ఈరోజున మనకు ఏమని నిరూపిస్తున్నారంటే – మనకు జీవంగా తెలిసిన ప్రతీదీ, మనకు తెలిసిన ప్రతీ పదార్థం ఇంకా ఉనికి, మనకు తెలిసిన జగత్తు ఇంకా పాలపుంతలు, ఇవన్నీ కూడా కేవలం ఒకే శక్తి వివిధ లక్షల రూపాల వ్యక్తీకరణ అని.
ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక అనుభవపూర్వక వాస్తవికత. “యోగి” అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని గ్రహించినవాడని. నేను “యోగ” అన్నప్పుడు, దానర్థం నేనేదో ఒక అభ్యాసమో లేక పద్ధతి గురించో మాట్లాడటంలేదు. అవ్యవస్థలో ఉన్న ఏకత్వం గురించి తెలుసుకోవాలనే అన్ని కోరికలు, ఈ ఉనికిలో ఉన్న ఏకత్వాన్ని గురుంచి తెలుసుకోవాలనే వాంఛలు ఉంటే అదే యోగ. దీనిని అనుభవపూర్వకంగా అనుభవించడానికి మహాశివరాత్రి ఓ అవకాశాన్ని అందిస్తుంది.
[2/17, 19:41] +91 94918 93164: శరణం శరణం... శంకరం

మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. 'శివ' అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం. లింగపురాణం ప్రకారం, శివుడు ప్రపంచాన్ని సృష్టించి, దివ్యశక్తితో నిలబెడతాడు.

శివలింగం పైన మూడు గీతలు ఆయన త్రిమూర్తి, త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనా థుడు అని సూచిస్తాయి. శ్రీరాముడు రామేశ్వరంలో, శ్రీకృష్ణుడు బృందావనంలోని గోపేశ్వర్లో శివుణ్ని ప్రార్ధించారని, అందుకు గుర్తుగా అక్కడ శివాలయాలు నిర్మించా రని చెబుతారు. భారతదేశంలోని పన్నెండు ప్రసిద్ధ శివాలయాలను జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పిలుస్తారు. చిదంబరంలో శివుడు నటరాజు. అనంత శక్తితో నృత్యం చేస్తాడు. అసాధారణ కదలికలతో చిరుత పులిలా కనిపిస్తాడు. పాములా జారిపో తాడు. ఉరుమవుతాడు. ఆ నటరాజే భారతీయ శాస్త్రీయ నృత్యాలకు ప్రేరణ.

s రమణ మహర్షి శివుణ్ని తండ్రిగా భావించి, ఆయనను వెతుకుతూ అరుణాచలం బయలుదేరారని అంటారు. వేదసార శివస్తోత్రం సూర్యుడు, చంద్రుడు, అగ్ని... శివుడి మూడు కళ్లు అని పేర్కొంటుంది. సూర్యుడు తేజోవంతంగా ఉంటాడు. కాంతి వస్తువులను ప్రకాశింపజేస్తుంది. దానికి విరుద్ధంగా చంద్రుడి కాంతికి చల్ల దనం, ప్రశాంతమైన గుణం ఉంటుంది. శివుడు తన మూడు కళ్లతో ప్రపంచాన్ని చూస్తాడు. బాధలో, దుఃఖంలో ఉన్నవారు సమీపించినప్పుడు ఆయన వారిని చంద్ర కాంతికి సమమైన ఆహ్లాదకరమైన, ఓదార్పు నిచ్చే దృక్కులను ప్రసరిస్తాడు. సూర్యరశ్మి ఒక్క క్షణంలో ప్రపంచాన్ని ప్రకాశింపజే స్తుంది. పరమశివుడి కరుణాకటాక్ష వీక్షణా లతో సమకూరే జ్ఞానం జీవితానికి కొత్త వెలుగును అద్దుతుంది. అగ్నికి దహించే శక్తి ఉంది. భగవంతుడి తపస్సుకు భంగం కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేసిన కామదేవుడు ఆయన కోపాగ్నికి బూడిదైన సంగతి తెలిసిందే.
శ్వేతాశ్వతర ఉపనిషత్ శివుణ్ని పరమపురుషుడిగా ప్రస్తావించింది. ఆయనే సర్వో న్నత గురువు, దక్షిణామూర్తి. తాను సృష్టించిన మాయకు అతీతంగా స్వయంగా నిర్దే శించిన నియమాలతో ఈ లౌకిక ప్రపంచంలో కర్తవ్యబద్దుడై ఉంటాడు. భక్తుడి చిన్న ప్రార్ధనకే సంతోషిస్తాడు. ఈ విషయం పార్వతి స్వయంగా గ్రహించింది. ఆమె కూడా తన చుట్టూ ఉన్న భౌతిక సృష్టికి అతీతంగా ఎదిగి, తీవ్రమైన తపస్సు, సాధనల ద్వారా మనసును ఆత్మలో విలీనం చేయాల్సి వచ్చింది.

శివుడి ఎనిమిది లక్షణాలు- స్వయం ఉనికి, పవిత్రత, ఆత్మజ్ఞానం, సర్వజ్ఞత్వం, అపా రమైన దయ, సర్వశక్తిమత్వం, ఆనందం, అనారోగ్యం లేకపోవడం అంటే మాలిన్యం లేకపోవడం. కరుణ ఆయన స్వభావం. ప్రేమ... అస్తిత్వం. ఆయనకు అనంతమైన పేర్లూ రూపాలూ ఉన్నాయి. శివస్తోత్రావళి- శివుణ్ని దక్షిణాచార, వామాచార మార్గాల సారాంశంగా వర్ణిస్తుంది. ఏ విధంగానైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ రూపంలోనైనా శివయ్యను పూజించవచ్చని ఇది స్పష్టం చేస్తోంది.

మంత్రవాది మహేశ్వర్
[2/17, 19:41] +91 94918 93164: లింగోద్భవ కాలం అంటే ఏమిటి? 
 శివుడు స్వయంగా లింగ రూపంలో అవతరించిన సందర్భాన్ని లింగోద్భవ కాలం అంటారు. స్కాంద పురాణ గ్రంథాలు ప్రకారం మాఘ మాసం కృష్ణ పక్షం, చతుర్దశి తిథి అర్థరాత్రివేళ లింగోద్భవం జరిగినట్లు చెబుతారు. అదే రోజును మహా శివరాత్రి పర్వదినంగా పాటించడం సంప్రదాయం. 
సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది. ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనేమాట వాస్తవమే. అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆ భవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది.
శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడినది. ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే  ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రాలను ప్రయోగించుకొన్నారు. 
పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవులాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం (లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు.
హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు.
భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.
మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థానమయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.
దీనిని గమనించిన పరమేశ్వరుడు మరో మారు ప్రళయం జరుగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేసి అందులో అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు.   పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి మహాగ్నిస్తంభాన్నిచల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుళ చతుర్దశినాడు అర్ధరాత్రి సమయంలో ఇది  జరిగింది. కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకొనేందుకు వెళ్లి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుడ్నే శరణు వేడుకొంటారు. అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు. శివరాత్రి నాడు ఈ లింగోధ్బవ కాలం ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగం దర్శనం, స్వామి వారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ సమయంలో స్వామి వారిని బిల్వ పత్రాలతో పూజించి, పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుందని అంటారు.

No comments:

Post a Comment