Thursday, 26 March 2026

 *_వీరమరణమే విజయం..!_*

_పుల్వామా.._
తీవ్రవాదాన్ని మించిన ఉగ్రవాదం..
ప్రాణాలు తియ్యడమే
ముదం..ఆమోదం..
పొరుగు దేశం పుట్టుకతోనే
నేర్చిన ఎడతెగని హింసావాదం..!

ప్రాణమంటే 
లెక్క చేయని
నైజం..
చంపడమే ఇజం..
దాయాదుల కర్కశత్వానికి
పరాకాష్ట..
భరతమాత ముద్దుబిడ్డలు
ఒకరు కాదు..ఇద్దరు కాదు
నలభై మంది ఒకేసారి
అసువులు బాసిన దుర్ఘటన..
అయితే..వారి భాషలో
అది త్యాగం..
వీరమరణం..
దేశం కోసం ప్రాణాలు
అర్పించిన గర్వకారణం
మాతృభూమి రక్షణే
శరణం..
జవానులూ..
మీ త్యాగానికి ఇదే ఇదే
మా అశ్రుతర్పణం..!

పుల్వామా అనే కాదు..
సరిహద్దుల్లో రోజూ
ఎక్కడో ఒక దగ్గర 
ఒకటే హింస..
కాశ్మీర్ పై కన్నేసిన 
దాయాది..
చంపడంలో ఉన్మాది..
శాంతి కోరే మన దేశంతో
నిత్యం కయ్యం..
ఎన్నిసార్లు బుద్ది చెప్పినా
మారని వైనం..
ఆ దుష్ట బుద్ధి ఫలితమే
ఈ దుర్దినం..!

ఎక్కడ నుంచి వచ్చిందో 
ఈ విషసంస్కృతి..
ఎవరి బుర్రలో పుట్టిందో
ఇలా మానవ బాంబులతో దాడి చెయ్యాలన్న ఆలోచన
అలాగే బలైతే రాజీవుడు
ఉలిక్కిపడింది జగతి...
ఇదేమి నీతి..ఇదేమి రీతని..
ఇలా చంపడం ఏంటని..
అప్పటి నుంచి అదే పంథా..
ఉగ్రవాదం యధా..
పాకిస్తాన్ తథా..
ఇది ఆగిపోని కధా..!?

ఔను..
పాకిస్తాన్ వంచనిది..
అయినా
నా దేశం 
తలవంచనిది..
పుల్వామా అనుభవంతో
జూలు విదిల్చిన 
భారత సింహాలు..
హద్దు మీరిన పాక్
సరిహద్దులు దాటి
తీవ్రవాద శిబిరాలు
విధ్వంసం..
బుసకొట్టిన
భారతీయ రోసం..
తిప్పింది మీసం..
ధర్మం తిరగబడితే..
న్యాయం గెలిస్తే..
ఎలా ఉంటుందో చవిచూసిన
పొరుగు దేశం తోడేళ్ళు
తోక ముడిచి దాసోహం 
అన్న విధం..
భారత్ విజయపథం..!

*_సురేష్..9948546286_*
             *_7995666286_*

No comments:

Post a Comment