పక్షులు సైతం...
మన పురాణాలు, కావ్యాల్లో వివిధ పక్షులు కీలక పాత్రలను నిర్వహించాయి. శ్రీమద్రా మాయణం అవతరణకు క్రౌంచపక్షి దంపతుల వియోగం కారణమైంది. సీతను అప హరించి తీసుకుపోతున్న రావణుణ్ని ఎదుర్కొని పోరాడి ప్రాణాలు కోల్పోయాడు జటా యువు. సీత జాడ తెలియక నిర్వేదంలో ఉన్న వానర వీరులకు రావణుడి వైనం తెలిపి ఎంతో మేలుచేశాడు సంపాతి.
గొప్ప రెక్కల బలం గల గరుత్మంతుణ్ని సుపర్ణుడంటారు. ఇంద్రుడి ఆధీనంలో ఉన్న అమృతభాండం తెచ్చి తల్లి వినతకు దాస్యవిమోచనం కలిగించాడు. విష్ణుదేవుడికి వాహనమయ్యాడు. కృష్ణయజుర్వేదాన్ని తైత్తిరీయం అంటారు. వైశంపాయనుడి శిష్యు డైన యాజ్ఞవల్క్యుడు ఒక సందర్భంలో గురువు ఆజ్ఞను మన్నించకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. తాను నేర్పిన యజుర్వేదాన్ని వదలి వెళ్లిపొమ్మన్నాడు వైశం పాయనుడు. గురువు ఆదేశానుసారం నేర్చు కున్న విద్యను వమనం చేసి వెళ్లిపోయాడు యాజ్ఞవల్క్యుడు. వేదవ్యాసుడు తన శిష్యులు తొమ్మిదిమందిని తిత్తిరిపక్షులుగా మార్చి వాంతి రూపంలోని ఆ వేదవిద్యను వారు గ్రహించేలా చేశాడు. దాన్నే తైత్తిరీయో పనిషత్తు అంటారు.
రామాయణ భారతాల్లో ఇంద్రుడి కుమారుడు జయంతుడు వాయసరూపంలో చేసిన పనుల ప్రస్తావన ఉంది. అరణ్య వాసంలో ఓరోజు సీతాదేవి ఒడిలో తలవాల్చి రాముడు నిద్రిస్తుండగా కాకి రూపంలో జయం తుడు ఆమెను గాయపరిచాడు. రక్తం కారి రాముడి ముఖంపై పడింది. మేలుకున్న రాముడు కోపంతో ఒక దర్భను కాకిపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. అది శరణు వేడుకోగా రామబాణం వ్యర్థం కాకూడదు గనక కాకి కుడి కంటిచూపు కోల్పోయింది. అందుకే కాకి ఒకేసారి రెండు కళ్లతో చూడలేదం టారు. మహాభారతంలో కాలవృక్షేయుడనే ముని క్షేమదర్శనుడనే రాజుకు స్నేహితుడు. ఆయన ఒక కాకిని పంజరంలో ఉంచుకొని రాజ్యమంతా పర్యటించి వచ్చి తాను చూసిన ప్రజల కష్టాలను, మంత్రులు ప్రజల్ని పెడుతున్న బాధలను కాకి ద్వారా వినమని రాజుకు చెప్పాడు. అది తెలిసి ఒక మంత్రి ఆ రాత్రి పంజరంలోని కాకిని చంపేశాడు. రాజుకు విషయం తెలిసి వంచకులైన మంత్రుల్ని శిక్షించి సవ్యంగా పాలిస్తాడు.
ఒక వేటగాడు పక్షుల్ని వేటాడుతూ కుంభవృష్టిలో చలికి వణికిపోతూ ఒక చెట్టు కింద కూలబడిపోయాడు. అదే సమయంలో ఆహారం కోసం బయటకు వెళ్లిన ఆ చెట్టుమీది ఆడపక్షి తిరిగొస్తూ వేటగాడికి దొరికిపోయింది. తనకోసం విలపిస్తున్న మగపావురాన్ని చూసి వేటగాడి దుస్థితి చెప్పి అతడికి ఆతిథ్యం ఇవ్వమంది. మగపక్షి ఎండుపుల్లలు తెచ్చి మంటపెట్టి వేటగాడు చలి కాచుకునే ఏర్పాటుచేస్తుంది. తరవాత తన మాంసం తిని ఆకలి తీర్చుకోమంటూ ఆ మంటలో దూకుతుంది. ఇది చూసిన వేటగాడి మనసు కరిగి పంజరంలోని పక్షుల్ని వదిలిపెడతాడు. భర్తను కోల్పోయిన ఆడపక్షి తానూ మంటలో పడి ప్రాణాలు అర్పిస్తుంది. శాంతిపర్వంలోని ఈ కపోతో పాఖ్యానం ఆదర్శమైన త్యాగమయ గాథ.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
No comments:
Post a Comment