Thursday, 26 March 2026

 తమ పిల్లలకు వివాహ ప్రయత్నాలు చేస్తున్న అనేకమంది తల్లిదండ్రులు మంచి సంబంధాలు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు . 

వారి కోసం  ... 

రైలు ఎక్కoడి . రాజమండ్రి స్టేషన్ లో దిగండి . రాజమండ్రిలో అమలాపురం వెళ్లే బస్సు ఎక్కoడి . అమలాపురంలో ఆ ఊరికి ఆటో మాట్లాడుకొండి . విజయవాడ నుంచి వస్తున్న వారు వోపిక ఉంటే  అమలాపురం దాకా బస్సులో రావచ్చు . వైజాగ్ నుంచి వచ్చే వారు అమలాపురం బస్సు ఎక్కి గోదావరి బ్రిడ్జి దాటగానే దిగిపోoడి .

 ఆ ఊరు పేరు మురమళ్ల .

దశాబ్దాలుగా వివాహాలు జరగడం కోసం ఎక్కడెక్కడ నుండో ఆ ఊరు వస్తుంటారు  . 

ఆ ఊళ్లో ప్రసిద్ధి చెందిన భద్రకాళి సమేత వీర భద్ర స్వామి దేవాలయం ఉంది . అక్కడ నిత్య కల్యాణం జరుగుతూ ఉంటుంది . ఆ స్వామిని దర్శించుకుని , మీ సంతానానికి త్వరలో అన్ని విధాలా చక్కటి సంబంధం కుదిరేలా అనుగ్రహించమనీ , పెళ్లి అయిన తర్వాత వధూవరులను తీసుకుని వచ్చి  , నీకు కల్యాణం చేయిస్తామని మొక్కు పెట్టుకోవాలి . ఇక మీకు టెన్షన్ అక్కర్లేదు . అతి త్వరలో మీ ఇంట్లో కళ్యాణ భజంత్రీలు మ్రోగడం ఖాయo .  ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు వందల సంఖ్యలో వధూవరులు వచ్చి కల్యాణంలో పాల్గొంటారు . కల్యాణం పూర్తి అయిన తరువాత రాత్రి  9 గంటలకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం కూడా ఏర్పాటు చేస్తారు .  ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి రూమ్ లు కూడా ఇస్తారు . 

 మురమళ్ల వీరేశ్వరుడు తర తరాలుగా ప్రత్యక్ష దైవంగా లక్షలాది మందికి వివాహ యోగాన్ని ప్రసాదించిన దేవదేవుడు.

🙏🏻 ఓం నమః శివాయ.. శ్రీ మాత్రే నమః🙏🏻

No comments:

Post a Comment