గొప్పవాడు ఎప్పుడూ ఏ పనిని అయినా చిన్నగానే ప్రారంభించి, క్రమంగా 'ఇంతింతై వటుడింతయై' అన్నట్లు ఎదుగుతూ- మొదట వామనుడివలె ఉండి, చివరికి త్రివిక్రముడై విశ్వమంతా వ్యాపిస్తాడు. నీచుడు మాత్రం అట్టహాసాలతో, ఆర్భాటాలతో గొప్పలకుపోయి అరుపులతో ప్రారంభించి, చివరికి చతికిలపడతాడు.
ఇతరులకు నీతులను ఉపదేశించే పాండిత్యం ఎంతైనా ఉండవచ్చు. ఆ ఉపదేశించే విషయాలను తాము ముందు .ఆచరించాలని చాలామంది అనుకోరు. నిజంగా గొప్పవాడు మాత్రం తాను ఆచరించే నీతులనే ఇతరులకు చెప్పాలనీ, ఇతరులకు చెప్పినవన్నీ తాను కూడా ఆచరించాలని దృఢంగా భావిస్తాడు. 🙏Good night 🙏
No comments:
Post a Comment