Thursday, 26 March 2026

 *_కనిపించే..కని పెంచే_*
*_దేవుళ్ళకు వందనం..!_*

 _(Parents worship day)_

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

అమ్మ..నాన్న..
జగతిన ఇంతకంటే అందమైన పదాలున్నాయా..
ఆ ఇద్దరినీ మించిన దేవుళ్ళున్నారా..!

నీ తొలి అడుగులు 
నీకు తెలియవు..
కాని వాటికి మడుగులొత్తిన
అమ్మకి..నాన్నకి
అవి  జీవితకాలపు
మధురానుభూతులు..!

అమ్మా నీకేం తెలియదు..ఊరుకో..
ఇప్పుడెంత సులువుగా అనేస్తున్నావో..
నువ్వు మొదటి పలుకులు
నేర్చింది ఆ తల్లి ఒడిలోనే..
తొలి అక్షరాలు దిద్దింది
ఆ తల్లి బడిలోనే..
అక్షరం రాకపోయినా 
అమ్మ జ్ఞానసరస్వతి..
విజ్ఞాన విశ్వవిద్యాలయం..!

నాన్న చెయ్యి పట్టి
బడికి వెళ్లిన రోజు..
సువిశాల ప్రపంచం వైపు
నువ్వు వేసిన తొలి అడుగు..
అప్పుడు నాన్న
అందించిన ఆ చేయి
నీ జీవితానికి అదెంత ఆసరా..
నీ చుట్టూ పగలూ రేయి
ఆ తండ్రి పహారా..
నీ జీవితకాలపు సహారా..!
నీ ప్రతి గెలుపు..
నాన్నకు మలుపు..
ఆయన కష్టానికి ప్రతిఫలం..
ఆయన స్వేదాన్ని మరిచే
అద్భుత ఆస్వాదన..
నీ కోసం ఒళ్ళు మరిచి
మరింత సాధన..!!

ఎవరు ఎక్కువ..
ఎవరు తక్కువని ఎంచకు..
నీ విశ్వాసాన్ని 
ఎక్కువ తక్కువగా పంచకు..
నువ్వు ఆ ఇద్దరి ఉమ్మడి ఆస్తి
నీ ఉన్నతి 
ఆ ఇద్దరు పడిన కష్టం..
అది వారికెంత ఇష్టం..
ఇంతగా నీ కోసం పరితపించిన అమ్మానాన్నల్ని
మరచిపోయే..
వారి ప్రేమను గుర్తించని
నీ అహం.. 
దేశద్రోహాన్ని మించిన పాపం..
జీవితంలో నువ్వు చేసే
అతి పెద్ద నేరం..!

నీకు జన్మనిచ్చి..
నడక నేర్పి..
నడత అలవర్చి..
బువ్వ తినిపించి..
అక్షరం దిద్ధించి..
ముస్తాబు చేసి..
బడికి తీసుకెళ్ళి..
నీ కోసం ఇలాంటివి ఎన్నో చేసి

నీ జీవనానికి బాటలు వేసిన
ఎన్ని బాధలు పడినా
నీ జీవితానికి సరిపడా
బోధలు చేసిన..
అమ్మనాన్న..
వారు జీవించి ఉంటే
రోజూ మొక్కు..
మరణించి ఉంటే 
మనసులో
పూజించు..
క్షణక్షణం ధ్యానించు..

*_కనిపించని_* 
*_దేవుని కంటే కూడా.._*
*_కనిపెంచిన_*
*_అమ్మానాన్న మిన్న!_*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
        9948546286
        7995666286

No comments:

Post a Comment