*****
*పోదాం పదా*
========
(మినీ కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"బావా! మా ఫ్రెండొకడు ఓ వాట్సాప్ సమూహం కోసం, నలభై పదాలతో ఓ నానో కథ రాయాలిట. కథ ఎలా రాస్తే బాగుంటుందో చెప్పవా?" బావ తికమకరావుని అడిగాడు లోవకొండ.
"ఓసోస్! అదేమన్నా పెద్ద విద్య ఏట్రా? అయితే చెబుతున్నా రాసుకో" అంటూ కథ చెప్పడం మొదలెట్టాడు తికమకరావు.
"భార్యతో సినిమాకు వెళ్దామని టిక్కెట్లు తీసుకుని ఇంటికి వచ్చిన కుంచితపాదం, ఆమె ఇంకా తెమలక పోవడంతో
'ఏంటి? ఇంకా ఆలస్యం? త్వరగా పదా! నిన్నే త్వరగా పదా! పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా
పదా పదా పదా పదా పదా పదా పదా పదా పదా టైం లేదు పదా పదా లేట్ చేయకుండా పదా!' అంటూ హడావుడి చేయసాగాడు.
ఆ మాటలకు విసిగిపోయిన లంబోదరి 'నీ హడావుడి తగలెయ్యా! ఈ సినిమా టిక్కెట్లు ఈరోజువి కాదు, రేపటివి. నువ్వే ముందు ఇంట్లోకి పదా పదా!' అంటూ భర్తను ఇంట్లోకి ఒక్క తోపు తోసింది"
కథ చెప్పి,
"ఎలా ఉంది బామ్మర్దీ కథ? కథలో నలభై 'పదా'లూ వచ్చాయా? ఓసారి చూసుకో. పెద్దాళ్లతో ఎవహారం. నాకు మాట రాకూడదు మరి!" ఆనందంగా చెప్పాడు తికమకరావు, పళ్లు పిండుకుంటూ భార్య తలుపులమ్మా, ఆశ్చర్యంగా బామ్మర్ది లోవకొండా, చూస్తూండగా!.
***** **శుభం** *****
No comments:
Post a Comment