Thursday, 26 March 2026

 *_హిమశైల శిఖరంపైకా.._*
*_పాతాళ కుహరంలోకా..?_*

++++++++++++++++++

   _ప్రేమి..కల దినోత్సవం_

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

వసుధైక కుటుంబం..
విశ్వమానవ ప్రేమ..
ఇవేగా మన మూలాలు..
మారుతున్న కాలాలకు
అనుగుణంగా 
అవి మారిపోతే ఎలా..!

ప్రతి మనిషిని ప్రేమించు..
ఇదీ మన సంస్కృతి..
ప్రేమికుల దినోత్సవమంటూ
విచ్చలవిడి విహారాలు..
అరువు తెచ్చుకున్న సంస్కారాలు..
భారతీయ ఉన్నత 
సంస్కృతీ సంప్రదాయాలకు
దహన సంస్కారాలు..!

ఎక్కడో..ఎప్పుడో
ఒక జంట విడిపోయిందట..
అది ప్రేమికుల రోజట..
నీకేంటి సంబంధం..
ఎవరో నాటిన బీజం..
ఆధునిక పోకడల పుణ్యమో..
నయా ప్రసార సాధనాల
ఫలితమో..
ఇటు చేరి 
ఎటు తీసుకుపోతోందో..!

అమ్మా..నాన్నా..
అక్కా..తమ్ముడూ..
వీళ్ళ పుట్టినరోజులే
గుర్తుండని కొత్త మోజులు..
అవసరమా..
ఈ వాలంటైన్స్ డేలు..
ముందు నుంచే హడావిడి..
ఇంట్లో ఏం చెప్పి 
బయటకి రావాలని ప్లానింగు..
గ్రీటింగు..గిఫ్టు..
ఇదంతా ఓ క్రాఫ్టు..
అబద్ధం చెప్పడమే
ఇప్పుడో పెద్ద ఆర్టు..!

మనకెందుకీ కొత్త పోకడలు..
ఆధునిక రీతులు..
అరువు సంస్కృతులు..
ఎంగిలి మూతులు..
మహోన్నత జాతి..
ఇప్పటికే పడుతోంది పెడత్రోవ
మారిపోతున్న కట్టుబొట్టు..
ఎక్కడ పెడితే అక్కడ
వికృతంగా పచ్చబొట్టు..
ఇది కాదు మన పద్ధతి..
ఈ మార్పు తగని వికృతి..!

***********************
            
*_సురేష్..9948546286_*
          *_..7995666286_*

No comments:

Post a Comment