Thursday, 26 March 2026

 ఊరకరారు మహాత్ములు అని ఎవరున్నారు ఏ సందర్భంలో అన్నారు?
ఊరకరారు మహాత్ములు అని ఎవరున్నారు ఏ సందర్భంలో అన్నారు?
,ఈ మాట తెలుగునాట సుప్రసిద్ధం కదూ
కాస్త వ్యంగ్యం కూడా తగిలిస్తారు కొందరు
కానీ
దీని మూలం పోతన గారి భాగవతంలో ఉంది
కృష్ణ జననం తరువాత గర్గ మునిపుంగవుడు నందుడి ఇంటికి వస్తాడు
అప్పుడు నందుడంటాడు ఊరకరారు మహాత్ములు
వారు అధములఇండ్లకు వచ్చుట కారణము మంగళము మహాత్మా
అని
గర్గుడు నిస్సందేహంగా మహాత్ముడు మహర్షి .. ఎప్పటి వాడూ
అంతటి వాడు తమలాంటి సామాన్యుడి ఇంటికి రావడమంటే ఏదో విశేషమే మంగళమే కదా
మరి ఏమిటిది
అయినా తనను తాను సామాన్యడనడం ఆయన భక్తికి వినయానికీ గుర్తు
ఇంతకీ ఇంతటి ఋషి ఎందుగొచ్చాడంటే మనల్నందరినీ తరింపజేయడానికి
అదేమిటా
కృష్ణస్వామి కి నామకరణం చేయడానికి వచ్చాడు
కృష్ అంటే నిరతిశయ ఆనందం
ఆ నామం పలకడం ఎంత సుకృతం
అది మనకిచ్చింది మనం తరించడానికే కదూ

డా సూర్యనారాయణ వెన్నేటి

No comments:

Post a Comment