Thursday, 26 March 2026

 _*వందే రేడియో..!*_
--------------------------------------
*నాలుగు తరాల నెచ్చెలి..*
*ఇంటింటి జాబిలి..*
*ఆట..పాట..*
*విజ్ఞానం..వినోదం..*
*ఎప్పటికప్పుడు* 
*తాజా వార్తలు*
*భక్తి...భుక్తి..యుక్తి..ప్రయోక్తి..*
*అన్నిటికీ ఆ బుల్లి పెట్టే సాధనం*
*చాన్నాళ్ల పాటు మానవ* *జీవితాన్ని నడిపిన ఇంధనం..!*

*నూటొక్క ఏళ్లకు మునుపు*
*1923 లో ఊపిరి పోసుకున్న* *రేడియో..ఇంటింటి రోమియో..*
*తెల్లోడి హయాంలో* 
*బొంబాయిలో పుట్టి*
*పదమూడేళ్ళ తర్వాత అయింది ఆలిండియా రేడియో*
*మరో రెండేళ్లలోనే కొట్టింది* 
*ఆకాశవాణి బోణి..*
*అప్పటి నుంచి మొదలైంది*
*సరికొత్త బాణి..*
*ఇంటింటా రేడియోనే రాణి..*
*అందర్నీ అలరించే అలివేణి!*

*ప్రతి భ్రాత రేడియో శ్రోతే..*
*ఎవరు చెప్పినా*
*మన్ కీ బాతే..*
*అమ్మ,అమ్మమ్మ*
*అందరూ రేడియో పిచ్చోళ్లే..*
*ఎవరి కోటా వారికి..*
*నీ టేస్టు..నా టేస్టు..*
*అందరికీ అన్నీ బెస్టు..*

*అసలు సుప్రభాత సంగీతమే*
*మధురానుభూతి..*
*ఇప్పటికీ మనసులను* *వెంటాడే సజీవ స్రవంతి..*
*విదేశీయుడు* *రూపొందించిన*
*_శివరంజని.._*
*రసధుని..మధురధ్వని*
*ఆ వెంటే ఓ భక్తి గీతం..*
*తదుపరి సూక్తిముక్తావళి..*
*ఆపై పొలం పనులు..*
*నిలయ విద్వాంసుల కచేరీలు..*
*కాసేపు అలరించే పాటలు..*
*ఆటలుంటే కామెంటరీ..*
*లేదంటే విరామం..*
*మధ్యాహ్నం వార్తలు..*
*ఆ వెంటే కార్మికుల* *కార్యక్రమంలో సందడి చేసే*
*చిన్నక్క,ఏకాంబరం..*
*అప్పుడప్పుడు సినిమాలు..*
*నాటకాలు...రూపకాలు..*
*ప్రముఖుల ఇంటర్వ్యూలు..*
*రాత్రి నిద్రపుచ్చే* 
*ఆపాతమధురాలు..!*

*మనం వినలేదు గాని*
*ఇదే రేడియోలో ఖంగుమన్న కొంగర జగ్గయ్య కంఠం..*
*మనకి తెలిసిన* 
*తిరుమలశెట్టి శ్రీరాములు..*
*అద్దంకి మన్నార్...*
*దుగ్గిరాల,కందుకూరి..* 
*ప్రయాగ రామకృష్ణ...*
*ఉదయాన పాటలు* 
*సమర్పించే కామాక్షి..*

*ఇక ఇతర భాషలూ*
*మన గుండె ఘోషలే..*
*హిందీ వార్తలు చదివే*
*బరున్ హల్దార్..*
*సుర్జిత్ సింగ్,సుశీల్ ఝవేరి..*
*పమెలా సింగ్,లుటిక రత్నం..*
*క్రికెట్ కామెంటరీ దంచేసే*
*జస్దేవ్ సింగ్,విజయ్* *డేనియల్*
*బాబూనద్కర్నీ విశ్లేషణలు..*
*చెవి దగ్గర రేడియో పెట్టుకుని ఆస్వాదించే క్రికెట్ ప్రేమికులు..*
*స్కోరెంత..!?*
*చెప్పగానే ఎన్ని ఓవర్లు..*
*ఇలా ప్రశ్నల పరంపర..*
*తామర తంపర..*
*అదో లోకం..రేడియో మైకం..*

*ఇక మరో రెండు కారెక్టర్లు*
*రేడియో సూపర్ స్టార్లు..*
*శ్రీలంక స్టేషన్లో* 
*తెలుగు పాటలు సమర్పించిన* 
*మీనాక్షి పొన్నుదురై..*
*ముద్దుగా మన భాషలో* *పలకరించిన ముద్దుగుమ్మ..*
*కనిపించకుండా వినిపించిన ఆరాధ్యదేవత..*
*పొంగిపోయిన ప్రతి శ్రోత..*
*అందరినీ మించి..*
*బుధవారం రాత్రి..*
*ఎనిమిది గంటకొట్టేపాటికి*
*లక్షలాది మందిని* 
*రేడియో ముందు చేర్చిన* 
*సుమధుర స్వరం..*
*అమీన్ సయాని..*
*మంత్రముగ్ధం..*
*పాటల కార్నివాలా..*
*_బినాకా గీత్ మాలా.._*
*హిందీ కొత్త పాటల రంగీలా..!*

*ఇలా ఎన్నో మధురానుభూతుల రేడియో..*
*టివి వచ్చాక* 
*తగ్గిందేమో నీ ఠీవి...*
*మొబైల్ రాకతో* 
*నీ పరిస్దితి మరీ ఎండమావి..*
*కానీ నువ్వున్నావు*
*ఎఫ్ ఎం రూపంలో*
*ఇంకా కొన్ని ఇళ్లలో పాతబడక*
*మూల పడక...*
*పాడుతూ..పాటుపడుతూ..*
*ఆలపిస్తూ..అలరిస్తూ..*
*ఆకాశవాణి..*
*నువ్వు ఎప్పటికీ ప్రకాశవాణి..*

*రేడియో దినోత్సవం సందర్భంగా* 
*ఆ బుల్లి పెట్టెతో* *అనుబంధాన్ని..*
*అనుభవాలను..!*

*అనుభూతులను* *నెమరువేసుకుంటూ..*

  _*ఎలిశెట్టి సురేష్ కుమార్*_
           విజయనగరం
           9948546286
           7995666286

No comments:

Post a Comment