Tuesday, 9 September 2025

 *సమాధి స్థితి అంటే ఏమిటి?* 
శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
పరమాత్మ యందు ప్రవర్తిస్తున్న మనస్సు యొక్క వృత్తి ప్రవాహము భగవంతుని కంటే వేరైన మరియొక విషయములందు ప్రసరించకుండా అన్ని విధాలుగా అన్ని సమయాలలో అన్ని స్థితులలో పరమాత్మ యందే నిలుపుట మరొక దానివైపు ప్రసరింపజేయకుండా భగవత్‌ తత్త్వము యందే ని లిపియుంచుట సమాధి అనబడును.
సమ్యక్‌ ఆధానం – చక్కగా ఉంచుట. ఎదురుగా పరమాత్మ రూపం కనపడుతున్నా మన మనస్సు మరో రూపాన్ని తలచినా, ఆలోచించినా సమాధి భంగమే. మరే చోటికి వెళ్ళకుండా, ఎటువంటి ఆలోచన రాకుండా ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఆ భగవంతుని యందే నిరంతరాయముగా ఉంచుటే సమాధి.

No comments:

Post a Comment