Tuesday, 9 September 2025

 🌹 *గురువు సర్వదేవతా స్వరూపుడు*

🌺🌹భగవంతుడిని ఏ రూపం లో నైన ఉపాసన చెయ్యవచ్చు.ఒకే జీవితకాలం లో అనేక దేవతలను ఉపాసన చెయ్యవచ్చు .ఒకే పూజ లో అనేక దేవతల ఆవాహనము మన సంప్రదాయం లో ఉన్నది. ఉపదేవతలను, ,గ్రహాలను ,దిక్కులను పూజించి చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశము ఉన్నదని నిరూపించిన ధర్మం హైందవ ధర్మం.. కానీ,.. గురువును మాత్రం ప్రతి రోజు ధ్యానించాలి ,పూజించాలి .గురువు సర్వదేవతస్వరూపుడు .గురు అనుగ్రహం ఉంటే సర్వదేవత ల అనుగ్రం ఉన్నట్లే ,కాని.. ఎంత మంది దేవతల అనుగ్రహము ఉన్నా..గురు అనుగ్రహం లేకపోతే వాని సాధన పరిపూర్ణం కానట్లే 🌺
🌺🌹🕉️పూర్వము అంగీరస మహర్షి ఆశ్రమం లో వేదధర్ముడనే మహర్షి శిష్యులను పరీక్షించ తలచి ,వారితో ఇలా అన్నాడు .." నా తపస్సు ద్వారా చాలా వరకు పూర్వ జన్మ పాపమును పోగొట్టుకున్నాను ఇక మిగిలిన పాపమును అనుభవమున పోగొట్టుకోవాలని కాశీ వెళ్తున్నాను అక్కడ కర్మ శేషమును అనుభవిస్తాను ..ఈ క్రమం లో నేను కుష్టు రోగమును,గ్రుడ్డితనమును ,కుంటితనమును 21 సంవత్సరాలు అనుభవిస్తాను, నాతో నా సేవ చెయ్యడానికి ఎవరు వస్తారు.."- అని అడగ్గా దానికి బదులుగా ,దీపకుడను శిష్యుడు ,"గురుదేవ.. మీ పాపమును నేను అనుభవిస్తాను " అని ముందుకు రాగా గురువు తిరస్కరిస్తూ ,.." ఈ పాపమును నేను మాత్రమే అనుభవించాలి .." అని చెప్పగా,,.. దీపకుడు సేవ చెయ్యడానికి అంగీకరించి గురువు గారిని కాశీ నగరానికి తీస్కుని వెళ్ళగా ,కంబలాశ్వతర ప్రదేశం లో ఆశ్రమం నిర్మించుకున్నాక ,దీపకుని గురువుకి సంకల్పించుకున్న రోగత్రయము శరీరము పైకి రాగా ...దీపకుడు విసుగు ,విరామము లేక సేవ చేసాడు ...
గురు సేవ /తల్లిదండ్రుల సేవ శివునుకి ,విష్ణుమూర్తి కి చెందడం వలన శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా..." మీరు ఇవ్వగల అన్ని వరములు మా గురువులు ఇవ్వగలరు ..నాకెట్టి వరములు అవసరము లేదు "అని పలికినాడు దీపకుడు..కానీ ,,మీ వరము ద్వారా నా గురువుల పాపము పోగొట్టడము వారికి అంగికారమో..!! కాదో ..!! కనుక్కుంటానని వెళ్లి ,గురుదేవులను అడగ్గా ,వారు ఒప్పోకోలేదు. అదే విషయము వచ్చి శివునకు విన్నవించాడు దీపకుడు ,.. శివుడు తిరిగి వెళ్ళి ,దేవతల మధ్య ప్రస్తావన రాగా ,విష్ణుమూర్తులతో చెప్పాడు ..విష్ణుమూర్తి సంతోషించి దీపకుని జేరి ,..నీ గురువుల సేవలు నాకు అందినవి కావున వరము కోరుకో అనగా ,.." గురు అనుగ్రహము తప్పఇతరములు అవసరము లేదు కావున నా గురువుల అనుగ్రహము నా పై మరింతగా ఉండునట్లు వరమిమ్ము " అని అడిగాడు .. అప్పుడు విష్ణుమూర్తి ,.." నీవు తరించావు ,.. బ్రహ్మానందమును పొందగలవు ,..అట్లే లోకపూజ్యునివి కాగలవు " అని వరమిచ్చినాడు ...." మా త్రిమూర్తుల అనుగ్రహము ఉంటే తప్ప ఇంతటి గురుభక్తి రాదని చెప్పి అదృశ్యమైనాడు. ఈ వృత్తాంతము గురువులకు చెప్పుటకు దీపకుడు లోనికి వెళ్ళగా , గురువైన వేదధర్ముడు జరిగినదంతా దివ్య దృష్టి చే చెప్పుచుండెను ,అట్లే లేచి నిల్చొనగా సంపూర్ణ ఆరోగ్యము పొంది శిష్యుని ఆశీర్వాదము చేసెను 🌺🌹.      

No comments:

Post a Comment