Tuesday, 9 September 2025

 *సుమతీ శతకము*

*మంత్రిగలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలుచు దఱచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీలూడినట్లు జరుగదు సుమతీ!*

భావం: సమర్ధుడైన మంత్రి కలిగిన రాజుయొక్క దొరతనం ఉపాయములు(సామ, దాన, భేద, దండములు) పాడుకాకుండా సాగిపోవును. అట్టి మంత్రిలేని పాలనను కీలూడిపోయిన యంత్రమువలె సాగిపోనేరదు.

*మాటకు బ్రాణము సత్యము, కోటకు బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్‌ బోటికి బ్రాణము మానము, చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!*

భావం: నోటిమాటకు సత్యమును, పెద్ద దుర్గమునకు గొప్ప సైన్య సమూహమును, స్త్రీకి అభిమానమును, పరమును చేవ్రాలును ముఖ్యమైన ఆధారములు.

No comments:

Post a Comment