*🎻🌹🙏నేటి నుండి శ్రావణ మాసం ప్రారంభం...*
*(నేడు తొలి శ్రావణం శుక్రవారం )...!!*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿మన సనాతన హిందూ ధర్మంలో చాంద్రమానం ప్రకారం మన కున్న పన్నెండు మాసాల్లో ఐదవది
మరియు...ఎంతో పవిత్రత కల్గినటు వంటి మాసం శ్రావణ మాసం...
🙏🌹శ్రావణ మాసం🌹🙏
🌸 శ్రావణ మాసం అంటే శుభ మాసం
శ్రావణ మాసాన్ని
నభో మాసం అని కూడా అంటారు.
నభో అంటే ఆకాశం అని అర్ధం.
🌿ఈ నెలలో వచ్చే..._ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్ర మైనవి.
🌸ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు.
శ్రావణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మనక్షత్రం కూడా...
🌷‘శ్రవం నయ తీతి శ్రేణ నీయత ఇతివా శ్రవణం’ వేద వాఙ్మయం🌷
🌿హయ గ్రీవుడనే రాక్షసుడు
వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి హయగ్రీవుడిగా
వచ్చి వేదాలను సంరక్షించాడు.
హయగ్రీవుడు అవత రించింది శ్రావణ మాసం.
🌹శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడే🌹
🌸జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి,
పోలాల అమావాస్య, నాగ చతుర్థి ,
నాగ పంచమి పుత్రదా ఏకాదశి ,
దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి
ఇలా అనేక పండుగలు వస్తాయి.
🌿శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనః కారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము...ఈ...మాసం...
🌸ఈ మాస మందు రవి సంచ రించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును.
🌿చంద్రుని చార నుంచి జరగ బోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమ మైనది.
🌸మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పు కొని మానసిక శాంతి పొంద డానికి,
🌿ప్రకృతి వలన కలిగే అస్త వ్యస్త అనారోగ్యముల నుండి తప్పించు కొనుటకు,మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం...
🌸శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశ మైనది.
🙏శ్రావణమాసం-లక్ష్మీ కటాక్షం🙏
🌿ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చిందే కాలం శ్రావణమాసం. ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు.
🌸 పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు- శ్రావణ మంగళవారాల నోములు, దివ్యమైన శుభకరమైన పండుగలతో, పర్వదినాలలో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణం.
🌿చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో అయిదవ దివ్యమైన మాసం శ్రావణం. వర్షఋతువు ప్రారంభమయ్యేమాసం. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణమాసమనే పేరొచ్చింది.
🌸‘శ్రవణం’ విష్ణుమూర్తి జన్మనక్షత్రం. శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడంవల్ల విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణమాసం.
🌿శ్రావణమాసంలో మంగళవారాలు శ్రీ గౌరీదేవి పూజకు, శుక్రవారాలు శ్రీ లక్ష్మీదేవి పూజకు, శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైనవి. శ్రావణమాసంలో సోమవారంనాడు పరమశివుడిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది.
🌸సోమవారంనాడు శివాలయంలోగానీ, ఇంటిలోగానీ అభిషేకం చేయడంతోపాటు బిళ్వదళములతో అర్చన చేయవచ్చు.
🌿భగవాన్ శ్రీకృష్ణుని జననం శ్రావణమాసంలోనే జరిగింది. హయగ్రీవుడు, అరవిందయోగి వంటి పుణ్యపురుషులు జన్మించింది ఈనెలలోనే. వర్షఋతువు, ఓషధులు, పంటలు, ధనధాన్యాలకు శుభకరమైనది ఈ మాసం.
🌸ఈ కాలంలో దాడిచేసే రోగాలను దూరంగా పెట్టడానికి ఆహార నియమాలు పాటిస్తూ ఉపవాసాలకూ ప్రాధాన్యత ఇస్తారు.
🌿అంతేగాక దక్షిణాయనంలో దేవతల అనుహ్రం భూమిపై ప్రసరిస్తూ ఉంటుంది. ఈమాసంలో మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలతోపాటు అందరిమదిలో మెదిలేది శ్రావణపూర్ణిమ.
🌸 శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మరియు శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణుడు భువిపై అవతరించిన పుణ్యదినమే శ్రావణ బహుళ అష్టమి.
🌿శ్రావణంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించడంవల్ల సకల శుభాలు కలుగుతాయని మత్స్యపురాణం చెబుతున్నది.
🌸శ్రావణ శుద్ధ చవితిని నాగుల చవితి అని, పంచమిని నాగపంచమి అంటారు. నాగచతుర్థినాడు ఉపవాసం ఉండి పుట్టలో పాలుపోసి నాగదేవతను పూజించాలి.
🌿నాగపంచమినే గరుడ పంచమని కూడా అంటారు. నాగులకు పాలు, పాయసం, నువ్వుల పిండి, చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సర్పదోషం తొలగుతుంది.
🌸కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు తమ అయిదోతనం కలకాలం నిలవాలంటే ఈమాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు.
🌿పెళ్లయిన సంవత్సరంనుంచి వరుసగా అయిదు సంవత్సరాలపాటు నోము నోచి చివరి సంవత్సరం ఉద్యాపన చేస్తారు.
🌸శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము స్ర్తిలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కల్గి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం.
🌿ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు.
శ్రావణ పూర్ణిమను భారతావని మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తారు.
🌸ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు గల విశిష్టత ఇంతింతని చెప్పనలవికాదు. ఈ రోజున చేసే హయగ్రీవ ఆరాధన ఉన్నత విద్యను ప్రసాదిస్తుంది.
🌸చదువుల తల్లి సరస్వతికి గురువు హయగ్రీవుడని దేవీభాగవతం చెబుతోంది.
🌿శ్రావణపూర్ణిమనే ‘రాఖీపూర్ణిమ’.శ్రావణ బహుళ విదియ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన తిథిగా చెప్పబడింది.
🌸ఈ తిథి రోజు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రులు సశరీరంగా సజీవంగా బృందావన ప్రవేశాన్ని పొందారు.
🌿 లోకానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమే బహుళ అష్టమి.
🌸బహుళ ఏకాదశి కామ్య ఏకాదశి, శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు.
🌿ఈ విధంగా ప్రతిరోజూ విశేషదాయకమైన శ్రావణమాసాన్ని మనం పాటిద్దాం- మోక్షాన్ని పొందుదాం.
..స్వస్తి..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment