నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటి | Find True Mental Freedom | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OT3HfMvGSDE
Transcript:
(00:00) మనుషులుగా పుట్టిన మనందరికీ ఒక అందమైన బలహీనత ఉంటుంది. అది ప్రేమ. ఎవరినైనా ఇష్టపడితే ప్రాణం ఇచ్చేస్తాం. ఎవరినైనా నమ్మితే కళ్ళు మూసుకొని వాళ్ళంటే వెళ్తాం. కానీ ఒకసారి ఆలోచించండి మీరు అమితంగా ప్రేమించిన వ్యక్తులే మిమ్మల్ని లోతుగా గాయపరిచిన సందర్భాలు ఎన్ని ఉంటాయి? మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్లే మిమ్మల్ని నటేట ముంచిన రోజులు గుర్తుకొస్తున్నాయా అతిగా ప్రేమించడం, అతిగా నమ్మటం ఈ రెండే మీ పతనానికి పునాదులు.
(00:28) ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ ఇదే పచ్చినిజం. ఒక మొక్కకు కావాల్సిన దానికంటే ఎక్కువ నీరు పోస్తే అది కుళ్లిపోతుంది. అలాగే ఒక మనిషికి కావలసిన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మీ విలువ తగ్గిపోతుంది. మీ జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద బాధలు బయట శత్రువుల వల్ల రావు. మీరు గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు ఇచ్చే చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల వస్తాయి.
(00:51) రిలేషన్షిప్ లో లేదా ఫ్యామిలీలో మీరు ఎంతలా ఇన్వాల్వ్ అయిపోతారంటే వాళ్ళు చిన్న తప్పు చేసినా కనీసం ఒక చిన్న మాట అన్నా మీ ప్రపంచం కూల్పోయినట్లు బాధపడతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎదుటివారిని మీకంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల మీరు పొందేది ఆనందమా లేకపోతే బాధ అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది [సంగీతం] అని లోతుగా ఎప్పుడైనా ఆలోచిస్తే మనక ఒక విషయం అయితే అర్థంఅవుతుంది.
(01:12) మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించడం లేదు. ఆ వ్యక్తి మీద మనం పెంచుకున్న ఒక అందమైన ఊహని ప్రేమిస్తున్నాం. మనం అనుకున్నట్లు వాళ్ళు ఉండాలని కోరుకుంటాం. ఎవరైతే వాళ్ళు తమ అసలు స్వరూపాన్ని చూపిస్తారో అప్పుడు మనకి కలిగేది కోపం కాదు ఒక తీరని వేదన. నీమ్ కరోలి బాబా గారు ఒక మాట అంటారు. మీ శాంతిని ఇంకొకరి చేతుల్లో పెట్టకండి అని మనం సరిగ్గా ఇదే చేస్తున్నాం.
(01:34) ఎదుటివారు మనల్ని పలకరిస్తే సంతోషంగా ఉంటాం. వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే రోజంతా దిగులుగా కూర్చుంటాం. మనం ఏం తప్పు చేశము మనతో ఎందుకు మాట్లాడట్లేదు. పొరపాటు నేనుేమనా అన్నానా అని చెప్పేసి అందులోన నేను ఎవరి దగ్గరనా మాట్లాడిన మాటలు వాళ్ళు ఈయనక ఏమనా నా గురించి రాంగ్ గా చెప్పారా అని చెప్పేసి కంటిన్యూస్ గా మన మైండ్ లో ఒక సినిమా వేసుకొని ఆ సినిమాని 100 డేస్ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూనే ఉంటాం.
(01:57) ఇలా రన్ చేయడం అనేది మిమ్మల్ని మెల్లమెల్లగా ఒక మానసిక బానిసగా మారుస్తుంది. మీకు తెలియకుండానే మీకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా పోతుంది. వాళ్ళు నవ్వితే మీరు నవ్వుతారు. వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు. వాళ్ళు [సంగీతం] పలకరిస్తే మీరు పలుకుతారు వాళ్ళు పలకరించకపోతే మీరు బాధపడతారు. ఎదుటివారి మూడు మీద మీ జీవితం ఆధారపడి ఉంటే ఇక మీకంటూ సొంత అస్తిత్వం [సంగీతం] ఎక్కడుంది? మిమ్మల్ని మీరు పూర్తిగా త్యాగం చేయడం గొప్పతనం అని చాలా మంది అనుకుంటారు కానీ అది త్యాగం కాదు అది మీ ఆత్మ గౌరవాన్ని మీరు చంపుకోవడం.
(02:28) మీరు ఎవరికైతే అతిగా అందుబాటులో ఉంటారో అక్కడ మీ ఒనికికి విలువ ఉండదు. అంటే మీరు అక్కడ ఉన్నా కూడా మీకు అసలు వాల్యూవే ఉండదు. మరి ఈ సుడిగం నుంచి బయటపడడం ఎలాగా? ఇక్కడే మనం బౌండరీస్ అంటే మనకంటూ కొన్ని హద్దులు గీసుకోవడం నేర్చుకోవాలి. ప్రేమించండి. కానీ అది మిమ్మల్ని నాశనం చేసేంత కాదు. సహాయం చేయండి కానీ అది మిమ్మల్ని మరీ ఖాళీ చేసేంత కాదు నీమ్ కరోలిీ బాబాగారు తరుచుగా చెప్పేవారు అందరినీ ప్రేమించు అందరికీ సేవ చెయ్యి కానీ దేనికి అతుక్కుపోకు అనేవాళ్ళు ఈ అతుక్కుపోవడమే అసలైన సమస్య మీరు ఒకరికి ఎంత వరకు అవసరమో అంత వరకే ఉండడం నేర్చుకోవాలి ప్రతి చిన్న విషయానికి
(03:07) రియాక్ట్ అవ్వడం మానేయండి ఎదుటి వారు మిమ్మల్ని నొప్పించినప్పుడు మౌనంగా అక్కడి నుంచి తప్పుకోవడం నేర్చుకోండి అంతేకాకుండా వాళ్ళతో వాదించి మీ శక్తిని వృధా చేసుకోకండి మీకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉండాలి. మీ ఆలోచనలు మీ లక్ష్యాలు మీ ఎదుగుదల వీటి మీద దృష్టి పెట్టండి. ఎప్పుడైతే మీరు మీ మీద మీరు పని చేయడం మొదలు పెడతారో అప్పుడు మీకు అర్థంవుతుంది.
(03:30) మీ సంతోషం ఎక్కడో బయట లేదు. అది మీ లోపలే ఉందని మీరు ఇతరులకి ఇచ్చే ప్రేమలో సగం మీ మీద చూపించుకోండి. మీ జీవితం ఎంత ప్రశాంతంగా మారుతుందో మీరు అస్సలు ఊహించరు. మన జీవితాన్ని నిజంగా మెరుగుపరుచుకోవాలంటే మనం చేయాల్సిన మొదటి పని నో అని చెప్పడం నేర్చుకోవడం ఎవరికో నచ్చడం కోసం ఎవరో ఫీల్ అవుతారని భయంతో మీ మనసుకు నచ్చని పనిని ఎప్పుడూ చేయకండి.
(03:52) మీ కంఫర్ట్ జోన్ దాటి మీ ఆత్మగౌరవాన్ని తాకట పెట్టి ఎవరికీ అతిగా ప్రాధాన్యత ఇవ్వద్దు. గుర్తుంచుకోండి మీరు ఎవరినైతే అతిగా నెత్తిని పెట్టుకుంటారో వాళ్లే మిమ్మల్ని కిందకి తోసేయడానికి వెనుకాడరు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదండి. మీరు అందరినీ సంతోష పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు.
(04:14) సో మీ మొదటి బాధ్యత మీ పట్ల మీరు నిజాయితిగా ఉండటం మీ విలువను గుర్తించి వారితో మీ సమయాన్ని గడపడం మీ లోపల ఉన్న దైవత్వాన్ని గుర్తించండి. బాబాగారు చెప్పినట్లు ఈ ప్రపంచం ఒక నాటక రంగం. ఇందులో మీరు మీ పాత్రను పోషించండి కానీ ఆ పాత్రలో లేనమైపోయి మీ అసలు స్వరూపాన్ని మర్చిపోకండి. మీరు శక్తివంతులు మీరు స్వతంత్రులు ఎవరి మీద ఆధారపడి బతికే నీడల మిగిలిపోకండి.
(04:41) ఈ క్షణం నుంచే మీ జీవితానికి మీరే యజమాని అవ్వండి. అతిగా ప్రేమించడం తగ్గించి అవసరమైనంత గౌరవం నేర్చుకోండి. అప్పుడే మీరు నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తారు. రేపు కాదు ఇప్పుడే ఈ క్షణమే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
(05:04) బాయ్ [సంగీతం] ఓం
No comments:
Post a Comment