*నీతికథలు-34*
*మహాలక్ష్మి*
కొడుకు:అమ్మా..! చలిగా ఉందమ్మా.
అమ్మ:ఇదిగో దుప్పటి తీసుకో నాన్నా.
కొడుకు:మరి నీకెలా అమ్మ..?
అమ్మ:పర్వాలేదు..మీ నాన్నగారు వచ్చేస్తారుగా.
కొడుకు:నాన్న నా చిన్నప్పుడే చనిపోయారుగా మళ్ళీ ఎలా వస్తారు.
అమ్మ:నాన్నా..మీ నాన్న మనల్ని వదిలి ఎటూ వెళ్ళలేదు.ఉదయాన్నే ఇలా సూర్యుడిలా వచ్చి సాయంత్రం వరకు ఉండి వెలుగుని ఇస్తాడు.
కొడుకు:మరి రాత్రి నాన్న రావడం లేదేంటి..?
అమ్మ:రాత్రి చంద్రుడిలా వచ్చి వెలుగునిచ్చేది నాన్నే.
కొడుకు:అమ్మ మరి నేను పెద్దయ్యాక నీవు చనిపోతే అలా వస్తావుగా నా వద్దకు.
అమ్మ:నేను వస్తాను నీ కూతురిగా..నీవు రానిస్తావుగా మరి..!?
కొడుకు:అదేంటమ్మా అలా అంటావ్..?
అమ్మ:నేను కూతుర్ని అని పుట్టగానే చంపేస్తావేమోనని..
కొడుకు:అమ్మా..!నేను చంపను.మళ్ళీ నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానమ్మ.
అడపిల్ల బరువు అనుకొని కడుపులోనే చిదిమెసే
ప్రతి ఒక్క అమ్మ-నాన్నలకు ఈ పోస్ట్ అంకితం.
ఆడపిల్లను రక్షించండి..
రేపటి తరానికి అమ్మను అందించండి..
ఆడపిల్ల మనఇంటి *మహాలక్ష్మి*
*సర్వే *హిందూ* జనాః సుఖినోభవంతు*
No comments:
Post a Comment