అన్నింటికంటే ఇష్టమైనది:
(అక్బర్ బీర్బల్ కథలు)
అక్బర్ చక్రవర్తికి చాలామంది భార్యలు వుండేవారు. వారిలో ఒక రాణి పరమ గయ్యాళి. ఆమె మీద చాలా మంది అక్బర్‌కు ఫిర్యాదులు కూడా చేసారు. ఒకనాడైతే ఆమె అకృర్తో చాలా మొరటుగా మాట్లాడింది. దానితో ఆయనకు విపరీతంగా కోపం వచ్చి, “నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో” అని ఆజ్ఞాపించాడు.
ఆవేశంలో ఏదో అన్నది కాని ఆయన వెళ్ళి పొమ్మనేసరికి ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికి వచ్చింది. “నా మాటలకు, చేతలకు సిగ్గుపడుతున్నా దయచేసి క్షమించి నన్ను మా పుట్టింటికి పంపొద్దు” అని వేడుకుందామె.
అక్బర్‌కు కూడా జాలి కలిగింది. కానీ యిచ్చిన ఆజ్ఞను ఉపసంహరించటం ఎట్లా? అందుకే, “నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అన్నిటికంటే యిష్టమైన దాన్ని తీసుకెళ్ళొచ్చు” అని కొంచెం సడలించాడు.
చక్రవర్తి తనను క్షమించడని ఆమెకు అర్థమైంది. కానీ ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఆఖరికి ఆమెకు బీర్బల్ గుర్తుకొచ్చాడు. అతని సహాయం కోరాలనుకుంది కానీ ఆమె అతణ్జి కూడా గతంలో ఎన్నోసార్లు దూషించింది. ఏ ముఖం పెట్టుకుని అడగగలదు?
ఏది ఏమైనప్పటికి ఆమె అతని కోసం కబురు పంపగానే వచ్చాడు.
“బీర్బల్, నాకు నీ సహాయం. అత్యవసరంగా కావాలి. కానీ నిన్ను సహాయం అర్థించటానికి సిగ్గుపడుతున్నా” అంది పశ్చాత్తాపం నిండిన స్వరంతో.
"బేగం సాహెబా, గతం మర్చిపోండి. దయచేసి నేను మీకు చేయగల సహాయం ఏంటో చెప్పండి” అన్నాడు బీర్భల్ సహృదయంతో.
జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. అంతావిని, కొంచం సేపు ఆలోచించి, ఇలా చేయండి” అని ఆమెకు గుసగుసగా చెప్పాడు.
బేగం ఆ సలహాకు ఎంతో సంతోషించింది. ఆ తర్వాత ఆమె ఆ సాయంకాలం, తాను మరునాడే వెళ్ళిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగా తన ఆతిధ్యం స్వీకరించమని అక్బరు కి కబురు పంపింది. ఆ ప్రకారమే ఆమె మందిరానికి వచ్చేసాడు అక్బర్.
“నా సామాన్లన్నీ సర్దుకున్నాను. ఈ షర్బత్ మీ కోసం ప్రత్యేకంగా తయారు చేసాను. తాగండి” అని అడిగింది బేగమ్. బేగమ్ చెప్పిన ప్రకారం వెళ్ళిపోతున్నందుకు సంతోషించిన అక్బర్, ఆమె యిచ్చిన షర్బత్ తాగాడు. కొద్ది సేపట్లోనే మైకం కమ్మినట్లయి, మత్తుగా నిద్రపోయాడు.
అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న బేగమ్, నిద్రపోతున్న అక్బర్‌ను పల్లకీలోకి చేర్చించింది నౌకర్లతో. తాను కూడా ఎక్కి కూర్చుని పుట్టింటికి ప్రయాణమైంది.
మరునాడు పొద్దున మెలకువ వచ్చిన అక్చర్కు పరిసరాలన్ని కొత్తగా తోచడంతో, “ఏంటిది? ఎక్కడున్నాను?” అన్నాడు ఆశ్చర్యంగా.
అతణ్ణి కనిపెట్టుకుని వున్న బేగం, “మందిరాంలోనే ఉన్నారు ప్రభూ! అంది. “కానీ ఇది మా మందిరం కాదే?” అన్నాడు అక్బర్ నందేహంగా, కిటికీలోంచి బయటికి చూస్తూ,
“ప్రభూ, మీరు నన్ను మా పుట్టింటికి నా అత్యంత ప్రీతి పాత్రమైన దాన్ని తీసుకుని పొమన్నారు కదా. నాకత్యంత యిష్టమైంది మీరే కాబట్టి మిమ్మల్ని తీసుకుని మా పుట్టింటికి వచ్చాను” అంది. ఆ మాటలకు ఆయన కోపం పోయింది. బీర్చల్ తప్ప ఆమెకు ఇలాంటి సలవా మరెవరూ యిచ్చి వుండరని ఆయనకు తెలిసి నవ్వుకున్నాడు.
కల్పితము.
విభాగము : అక్బర్ బీర్బల్ కథలు
🙏🙏🙏🙏🙏
యెనుముల
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment