*”యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ।*
*సవై రాఘవ శార్దూల! ధర్మస్త్వా మభిరక్షతు॥*```
ఇందు తల్లి 'ధర్మంచర' ధర్మమార్గములో సంచరించు అని ఉపదేశించలేదు.
ధర్మమే రాముని శీలము. స్వాభావికముగా రాముడు ధర్మరక్షకుడు. ఈ విషయం ఆమెకు తెలిసినదే. అందుచేత ఆమె పరోక్షముగా ధృతి నియమముల ఆవశ్యకతనుగూర్చి తెలుపుతూ 'రాఘవా! నీవు ధైర్యముతో నియమముతో ఏ ధర్మమును ఆచరిస్తూ ఉన్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక!' అని అన్నది.
'ధృతి' అనగా ధైర్యము. నియమము అనగా కట్టుబాటు. ధర్మపథంలో నియమము, ధృతి అత్యవసరములు.
ప్రతి భారతీయునకు రాముని శీలమే లక్ష్యం. ప్రతి భారతీయునకు రామనామమే మహామంత్రం. మనలను పీడించే రుజావైవిధ్యానికి రామానామామృతమే మందు.
మనకు కావలసినది రామరక్ష. రాముడు ధర్మస్వరూపి. 'రామో విగ్రహవాన్ ధర్మః' ధర్మాచరణకు అవసరమైన ధృతి నియమములను రామనామామృతమే మనకు ఇయ్యగలదు.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
No comments:
Post a Comment