*_ఇప్పుడేడ్చి ఏం లాభం!?_*
కష్టజీవి శ్రమ..
అన్నదాత చెమట..
సైనికుడి సాహసం..
వైద్యుడి త్యాగం..
వ్యాపారి పన్ను..
విద్యార్థి జ్ఞానం
ఉద్యోగి సేవ
ఈ దేశంలో ఇవన్నీ
నాయకుల తోవ..
పట్టేస్తున్నాయి పెడత్రోవ..!
పండే భూమి
పచ్చని పుడమి
పుట్టే రూపాయి
పెరిగే పాపాయి
ఇచ్చే కాంట్రాక్టు
వచ్చే యాక్టు
జరిగే ప్రతి ఘట్టం
చేసే ప్రతి చట్టం..
ఈ దేశంలో
పాలకుల చుట్టం..
ఇలా అభివృద్ధి నేలమట్టం..!
పారే నీరు
దూకే ఏరు
వేసే రోడ్డు
పెట్టే బోర్డు
ఆడే ఆట
పాడే పాట
నీ రక్తం
నారక్తం
నేతలకే ఉపయుక్తం
ఇలా ఏడుస్తూ చేసినా
బాధ వ్యక్తం
అమాయక జనం
ఏం ప్రయోజనం
నిజానికి ఓటు నీ అభిమతం
అనర్హులకు అమ్ముతున్నావు..
అది నీ స్వయంకృతం..!😭
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286
7995666286
No comments:
Post a Comment