Thursday, 26 March 2026

 *_దేవుడున్నాడా.._*
*_ఇది ప్రశ్నయితే_* 
*_పరమహంసే సమాధానం!_*
-------------------------------
*_కలియుగంలో_* 
*_జన్మించిన రుషి.._*
*_దేవుని కనుగొన్న అన్వేషి.._*
*_ఇల్లాలిలోనే జగన్మాతను_* 
*_దర్శించిన మనీషి.._*
*_ఎక్కడ తిరిగాడో.._*
*_గదాధరుడు ఎప్పుడు_*
*_రామకృష్ణుడయ్యాడో?_*
*_జగతి మన్నించిన భగవానుడు.._*
_*రూపంలో కలహంస*_
*_మన రామకృష్ణ పరమహంస!_*

*_అన్ని మతాలు_* *_సమానమేనని.._*
*_భిన్న మతాల సారాంశం ఒక్కటేనని.._*
*_మతమేదైనా దాని లక్ష్యం_* 
_*భగవంతుని చేరడమేనని*_
*_నమ్మిన తత్వవేత్త.._*
*_సృష్టిలో ఏకత్వాన్ని_*
*_అన్ని జీవుల్లో దైవత్వాన్ని_*
*_గాంచిన మానవతావేత్త..!_*

*_గురువు జీవితకాల సాధనతో_* 
*_సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని_*
*_మూడు రోజుల్లోనే_* 
*_సాధించిన మహాయతి.._*
*_హిందూమార్గంలో_*
*_దైవదర్శనం పొంది ఆగాడా.._*
*_క్రైస్తవ..ఇస్లాం మతాలను_*
*_సైతం అనుసరించి_* 
*_సాక్షాత్కారం పొందిన జ్ఞాని_*
*_అలా అన్ని మతాల వారిని ఆకట్టుకున్న విజ్ఞాని.._*
*_తానుగా బ్రహ్మజ్ఞాని..!_*

*_ఎన్ని రూపాలలో_* 
*_దేవుని దర్శించినా_*
*_పరమాత్మ ఒక్కడేనని_*
*_మానవునిలో సైతం దేవుని చూడాలని ఉద్భోదించిన_* 
*_సమతామూర్తి.._*
*_అఖండకీర్తి.._*
*_వివేకానందునికి స్ఫూర్తి..!_*

*_భగవంతుని ఉనికి_*
*_గ్రహించడమే_* 
*_అలా పుణ్యాన్ని_* _*సంగ్రహించడమే*_
*_మానవ ధర్మమని.._*
*_అదే ఈ సృష్టి మర్మమని.._*
*_ఆ ధర్మ నిర్వహణ సాధనమే_*
*_మతమని..._*
*_ఆ సాధనలో మతం ఏదైనా_*
*_అది సమ్మతమేనని.._*
*_తాను నమ్మి.._*
*_ఆ నమ్మినదానిని ఆచరించి.._*
*_ఆ మార్గంలోనే సంచరించి.._*
*_తరించిన మహనీయుడు.._*
*_రామకృష్ణ పరమహంస..!_*

*సద్గురు రామకృష్ణ* *_పరమహంస_* 
_*జయంతి సందర్భంగా*_ 
_*ప్రణామాలు అర్పిస్తూ..*_

 *_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
        *విజయనగరం*
        *9948546286*
        *7995666286*

No comments:

Post a Comment