ఇహపరాల సౌభాగ్యం
అయిదేళ్ల పాప ఒక రేఖాచిత్రం గీసింది. అందులోని రూపురేఖలు ప్రముఖుల చిత్రా లలోని సౌందర్యంతో కాక, ఓ వ్యంగ్య చిత్రంలోని బొమ్మల్లా కనబడుతున్నాయి. ఆ రూపాలు అమాయకత్వానికి ప్రతీకలు. ఓ ఆధ్యాత్మికవేత్త ఆ బాలిక చిత్రరచనలో దాగి ఉన్న ఒక ప్రకృతి లక్షణాన్ని గుర్తించాడు. అదేమంటే బాహ్యప్రపంచంలో కళ్లకు కని పించే ఏ వస్తువులోనూ తీర్చిదిద్దినట్లు పరిపూర్ణత ఉండదు. పరిపూర్ణత లేనితనాన్నే నిజమైన ప్రకృతి సౌందర్యంగా గుర్తిస్తారు మార్మికులు. అటువంటి దివ్య అసంపూర్ణ సౌందర్యం ఆ పాపాయి బొమ్మలో కనబడింది ఆ ఆధ్యాత్మికవేత్తకు.
ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు. అశాశ్వతమైనది ఏదీ పరిపూర్ణం కాదు. సాధారణ కళ్లకు కనిపించనివాడు, కాంతి స్వరూపుడు కాబట్టి భగవంతుడిలోని పరి పూర్ణత్వాన్ని మానవ మేధ అర్థం చేసుకో లేదు. అందుకే భగవంతుడి పట్ల సమర్ప ణభావంతో, ప్రీతితో ఆయనను పరిపూర్ణు డనీ, జగత్తుగా పిలిచే ఆయన సృష్టి మాత్రం అశాశ్వతం, అసంపూర్ణమనీ భావిస్తాడు మనిషి. అయినప్పటికీ ఆ ప్రకృతి అలౌకిక సౌందర్యం మానవమాత్రుడు వెలకట్టలేని దని వేదవిదులు అభిప్రాయపడతారు. వెలుగు-నీడ లాగా కష్టసుఖాలూ మనిషికి తోబుట్టువులు. మనిషి పుట్టినపుడే అతడికి తోడుగా మంచి-చెడు, పుట్టాయి. మానవుడు నిజానికి కష్టజీవి. అయితే అతడు చేసే తప్పొకటుంది. తాను సుఖాలను మనసుకు పట్టించుకోడు. అప్పుడు సమయం తెలియకుండా గడిచిపో తుంది. కష్టాలను మాత్రం అంకెలను లెక్క పెడుతున్నట్లుగా మనసారా అనుభవి స్తాడు. అనుక్షణం ఆ అనుభవం అతడి మనసులో నమోదవుతుంది. పడిన కష్టా లను తదుపరి కాలంలోనూ గుర్తుచేసుకుంటాడు. అయితే గతానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచి లక్షణం కాదంటారు పెద్దలు.
జీవితంలో కొందరిని కష్టాలు కోలుకోలేని దెబ్బతీస్తాయి. కొందరైతే అవి కొట్టిన దెబ్బకన్నా ఎక్కువ వేదన అనుభవిస్తారు. అది భయంవల్లనో, సున్నిత హృదయం వలన్లో కావచ్చు! మరికొందరు రబ్బరు బంతి నేలను తాకి పైకిలేచినట్లు, దు:ఖం వారిని స్పర్శించక ముందుండే స్థాయికన్నా ఎక్కువ ఎదుగుతారు. అలా పాఠం నేర్చు కొని జీవితంలో పైకొచ్చే మనుషులు పరిమితం! అయినప్పటికీ వారే లోకానికి ఆదర్శ ప్రాయులు. ప్రకృతి ఉత్పాతాలతో దెబ్బతిన్న ప్రాంతాలు మంచి నాయకుడి పర్యవేక్ష ణలో కోలుకొని అంతకుముందుకన్నా సుభిక్షంగా లోకం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ రెండో కోవకు చెందినవాడుగా మనిషి ఎదగాలి. నిన్నటి కన్నా నేటి స్థాయి పెంచుకో వడం ఆదర్శ పురుష లక్షణం. వ్యక్తిగత సాధన ద్వారా, సామాజిక అవగాహన ద్వారా దాన్ని నిజం చేసుకోవచ్చునంటారు అనుభవజ్ఞులు.
అసంపూర్ణంగా కనబడే ప్రకృతిని పరిపూర్ణం చేసే సాహసంతో మనిషి జీవించాలి. నిపుణులు, అనుభవజ్ఞుల సూచనల ద్వారా జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి. అప్పుడే మనిషి ఇహపరాలు సౌభాగ్యవంతమవుతాయి.
గోపాలుని రఘుపతిరావు
No comments:
Post a Comment